AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెక్కు వెనుక సంతకం ఎందుకు చేస్తారో తెలుసా..? 99 శాతం మందికి తెలియదు..

మీరు బ్యాంకుకు వెళ్లి చెక్కు ద్వారా డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా? అయితే చెక్కు ముందు భాగంలో సంతకం ఉన్నా.. బ్యాంక్ అధికారులు వెనుక వైపు కూడా ఎందుకు సంతకం అడుగుతారో తెలుసా? ఒకవేళ మీరు అక్కడ సంతకం పెట్టకపోతే ఏమౌతుంది? అసలు ఏ చెక్కులకు వెనుక వైపు సంతకం పెట్టాలి, దేనికి అక్కర్లేదు? అనే విషయాలు తెలుసుకుందాం..

చెక్కు వెనుక సంతకం ఎందుకు చేస్తారో తెలుసా..? 99 శాతం మందికి తెలియదు..
Why Sign Behind A Cheque
Krishna S
|

Updated on: Jul 05, 2026 | 11:19 AM

Share

నేటి డిజిటల్ యుగంలో నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం వంటి అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీల కోసం ఇప్పటికీ చాలా మంది చెక్కుల పైనే ఆధారపడుతున్నారు. అయితే చెక్కు ద్వారా డబ్బు విత్‌డ్రా చేసే సమయంలో బ్యాంక్ అధికారులు తరచూ చెక్కు వెనుక వైపు సంతకం చేయమని అడుగుతుంటారు. చెక్కు ముందు భాగంలో ఇప్పటికే సంతకం ఉన్నప్పటికీ, వెనుక వైపు మళ్లీ ఎందుకు సంతకం అడుగుతారో? ఏ చెక్కులకు ఇది తప్పనిసరో చాలా మందికి తెలియదు.

అన్ని చెక్కులకూ వెనుక సంతకం అవసరం లేదు..

గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అన్ని రకాల చెక్కుల వెనుక సంతకం చేయాల్సిన అవసరం లేదు. కేవలం బేరర్ చెక్కుల కు మాత్రమే వెనుక వైపు సంతకం అడుగుతారు.

బేరర్ చెక్కు: ఈ చెక్కును ఎవరైనా బ్యాంకుకు తీసుకువెళ్లి నగదుగా మార్చుకోవచ్చు.

ఆర్డర్ చెక్కు: ఈ చెక్కుపై ఎవరి పేరు రాసి ఉంటుందో, వారు మాత్రమే బ్యాంకుకు వెళ్లి డబ్బు విత్‌డ్రా చేసుకోగలరు. ఇందులో సదరు వ్యక్తి గుర్తింపును బ్యాంక్ సిబ్బంది పూర్తిగా విచారించి, ధృవీకరించుకున్నాకే డబ్బు ఇస్తారు కాబట్టి దీనికి వెనుక వైపు సంతకం తప్పనిసరి కాదు.

వెనుక వైపు సంతకం ఎందుకు తీసుకుంటారు?

దారిలో ఎవరైనా బేరర్ చెక్కును పోగొట్టుకున్నా లేదా అది దొంగిలిస్తే డబ్బు పోయే ప్రమాదం ఉంది. అది చోరి చేసిన వ్యక్తి బ్యాంకుకు వెళ్లి సులభంగా డబ్బు డ్రా చేసుకునే ప్రమాదం ఉంది. ఇలాంటి మోసాలను నివారించడానికి, భద్రతా కారణాల దృష్ట్యా బ్యాంక్ సిబ్బంది ఒక ఎత్తుగడ వేస్తారు. డబ్బు తీసుకోవడానికి వచ్చిన వ్యక్తితో చెక్కు వెనుక వైపు సంతకం చేయించుకుంటారు. ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా తప్పుడు వ్యక్తికి డబ్బు చేరిందని తేలితే ఆ సొమ్మును సదరు వ్యక్తి బాధ్యతపైనే చెల్లించినట్లు నిరూపించడానికి ఈ సంతకం ఒక పక్కా ఆధారంగా ఉపయోగపడుతుంది. ఒకవేళ విత్‌డ్రా చేయాల్సిన మొత్తం రూ.50,000 కంటే ఎక్కువగా ఉంటే డబ్బు తీసుకోవడానికి వచ్చిన వ్యక్తిని బ్యాంక్ అధికారులు ఖచ్చితంగా గుర్తింపు ధృవీకరణ పత్రం అడుగుతారు. ఆ తర్వాతే నగదు అందజేస్తారు.

సంతకం చేయకపోతే ఏమవుతుంది?

ఒకవేళ ఎవరైనా చెక్కు వెనుక సంతకం చేయడానికి నిరాకరిస్తే, వారు స్వయంగా డబ్బు స్వీకరిస్తున్నట్లు ఒక దరఖాస్తును జతచేయాల్సి ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి తన సొంత ఖాతా నుండి డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి తనే స్వయంగా బ్యాంకుకు వెళ్తే, అప్పుడు బేరర్ చెక్కుకు కూడా వెనుక వైపు సంతకం అవసరం లేదు. వేరొకరి అభ్యర్థన మేరకు మూడవ వ్యక్తి బేరర్ చెక్కుతో నగదు తీసుకోవడానికి వచ్చినప్పుడు మాత్రమే ఈ సంతకం ఖచ్చితంగా అవసరమవుతుంది. కాబట్టి చెక్కు లావాదేవీలు జరిపేటప్పుడు ఈ విషయాలను గుర్తి పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ పని పూర్తవుతుంది.

Follow Us
అందుకే రా పాకిస్తాన్ టీం అనేది.. క్యాచ్ వదిలేసి గొడవపడ్డ ఆటగాళ్లు
అందుకే రా పాకిస్తాన్ టీం అనేది.. క్యాచ్ వదిలేసి గొడవపడ్డ ఆటగాళ్లు
నో మొబైల్‌.. రోజుకు 10 గంటల చదువు.. UPSC టాపర్ సక్సెస్ స్టోరీ!
నో మొబైల్‌.. రోజుకు 10 గంటల చదువు.. UPSC టాపర్ సక్సెస్ స్టోరీ!
పాత బోగీలు, ఇంజిన్లను రైల్వేశాఖ ఏం చేస్తుందో తెలుసా..?
పాత బోగీలు, ఇంజిన్లను రైల్వేశాఖ ఏం చేస్తుందో తెలుసా..?
మటన్ లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?
మటన్ లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?
ఒకే వయసు.. ఒకే మార్కులు.. కానీ కాలేజీ చదువులో భారీ వ్యత్యాసం..
ఒకే వయసు.. ఒకే మార్కులు.. కానీ కాలేజీ చదువులో భారీ వ్యత్యాసం..
చికెన్‌, గుడ్ల ధరలు భారీగా పెరగనున్నాయా? కారణం ఏంటో తెలుసా..?
చికెన్‌, గుడ్ల ధరలు భారీగా పెరగనున్నాయా? కారణం ఏంటో తెలుసా..?
భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: జెన్సెన్ హువాంగ్
భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: జెన్సెన్ హువాంగ్
IPL 2027లో మూడు జట్లకు కొత్త కెప్టెన్లు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?
IPL 2027లో మూడు జట్లకు కొత్త కెప్టెన్లు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?
కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న
కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న
చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..
చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..