కేబినెట్ విస్తరణకు కుదిరిన ముహూర్తం

కేబినెట్ విస్తరణకు కుదిరిన ముహూర్తం

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 19న మాఘశుద్ధ పౌర్ణమి కావడంతో అదే రోజు ఉదయం 11.30 గంటలకు మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈరోజు రాజ్‌భవన్‌కు వెళ్లిన కేసీఆర్‌.. గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశమయ్యారు. గవర్నర్‌తో సీఎం భేటీ అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కేబినెట్‌ విస్తరణపై ప్రకటన వెలువడింది. మంత్రివర్గ విస్తరణపై సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడంతో గత రెండు నెలలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్టయింది. కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని రాజ్‌భవన్‌లో నిర్వహించనున్నారు. […]

Ram Naramaneni

|

Feb 15, 2019 | 6:45 PM

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 19న మాఘశుద్ధ పౌర్ణమి కావడంతో అదే రోజు ఉదయం 11.30 గంటలకు మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈరోజు రాజ్‌భవన్‌కు వెళ్లిన కేసీఆర్‌.. గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశమయ్యారు. గవర్నర్‌తో సీఎం భేటీ అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కేబినెట్‌ విస్తరణపై ప్రకటన వెలువడింది. మంత్రివర్గ విస్తరణపై సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడంతో గత రెండు నెలలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్టయింది. కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని రాజ్‌భవన్‌లో నిర్వహించనున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu