ఏపీలో ఐఏఎస్‌ల బదిలీలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్‌లు, ఆరుగురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా డి.వరప్రసాద్, కార్మిక శాఖ కమిషనర్‌గా వరప్రసాద్‌కు పూర్తి అదనపు బాధ్యలు కల్పించారు. దివ్యాంగుల సంక్షేమం, వయో వృద్ధుల శాఖ డైరెక్టర్‌గా కిశోర్‌ కుమార్‌, ఉపాధి, శిక్షణా శాఖ డైరెక్టర్‌గా కె. మాధవీలత, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా పి.లక్ష్మీనరసింహం, చేనేత, జౌళి శాఖ కార్యదర్శిగా శ్రీనివాస శ్రీనరేశ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. […]

ఏపీలో ఐఏఎస్‌ల బదిలీలు
Follow us

|

Updated on: Feb 15, 2019 | 6:11 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్‌లు, ఆరుగురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా డి.వరప్రసాద్, కార్మిక శాఖ కమిషనర్‌గా వరప్రసాద్‌కు పూర్తి అదనపు బాధ్యలు కల్పించారు. దివ్యాంగుల సంక్షేమం, వయో వృద్ధుల శాఖ డైరెక్టర్‌గా కిశోర్‌ కుమార్‌, ఉపాధి, శిక్షణా శాఖ డైరెక్టర్‌గా కె. మాధవీలత, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా పి.లక్ష్మీనరసింహం, చేనేత, జౌళి శాఖ కార్యదర్శిగా శ్రీనివాస శ్రీనరేశ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. వ్యవసాయ, సహకార శాఖ ముఖ్య కార్యదర్శిగా బి.రాజశేఖర్‌ను నియమించగా‌, రియల్‌టైం గవర్నెన్స్‌ ముఖ్య కార్యదర్శిగా రాజశేఖర్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే,  సీసీఎల్ఏ సంయుక్త కార్యదర్శిగా లావణ్య వేణి, పౌర సరఫరాలశాఖ డైరెక్టర్‌గా విజయ సునీత, ఏపీటీడీసీ సీఈవోగా గా కె.విజయ, విశాఖ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌గా పి.శ్రీనివాసులు, ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీగా ధనుంజయ్‌రెడ్డిని నియమిస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. మరోవైపు, కడప, ప్రకాశం జిల్లాల ఎస్పీలకు స్థాన చలనం జరిగింది. కడప జిల్లా ఎస్పీగా రాహుల్ దేవ్ శర్మ, ప్రకాశం జిల్లా ఎస్పీగా కోయ ప్రవీణ్, గ్రేహౌండ్స్‌ గ్రూప్ కమాండర్‌గా అభిషేక్ మహంతి, విజయవాడ సిటీ జాయింట్ కమిషనర్‌గా నవదీప్ సింగ్, పర్సనల్ ఐజీగా వినీత్ బ్రిజ్‌లాల్‌, విశాఖ గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌గా సత్య ఏసుబాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.