30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి వైసీపీలో కీలక పదవి

30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి వైసీపీలో కీలక పదవి

హైదరాబాద్‌: సినీ నటుడు 30 ఇయర్స్ ఇండష్ట్రీ పృథ్వీ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు పృథ్వీని కీలక పదవిలో నియమించారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. తాడేపల్లిగూడెంకు చెందిన పృథ్వీ గత కొంతకాలంగా వైఎస్సార్‌సీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. అంతేకాక ఛానలల్లో, సోషల్ మీడియా వేదికగా పార్టీ వాయిస్‌ను గట్టిగా వినిపించడంతో పాటు  పార్టీ నిర్వహించిన ప్రతి కార్యక్రమం​లోనూ పాల్గొని సంఘీభావం తెలుపుతున్నారు. వైఎస్‌ జగన్‌ […]

Ram Naramaneni

|

Feb 15, 2019 | 8:57 PM

హైదరాబాద్‌: సినీ నటుడు 30 ఇయర్స్ ఇండష్ట్రీ పృథ్వీ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు పృథ్వీని కీలక పదవిలో నియమించారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. తాడేపల్లిగూడెంకు చెందిన పృథ్వీ గత కొంతకాలంగా వైఎస్సార్‌సీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. అంతేకాక ఛానలల్లో, సోషల్ మీడియా వేదికగా పార్టీ వాయిస్‌ను గట్టిగా వినిపించడంతో పాటు  పార్టీ నిర్వహించిన ప్రతి కార్యక్రమం​లోనూ పాల్గొని సంఘీభావం తెలుపుతున్నారు.

వైఎస్‌ జగన్‌ ఇటీవల నిర్వహించిన ప్రజాసంకల్పయాత్రలో కూడా ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను సామాన్యప్రజలకు తెలిసేలా త్వరలో వీధి నాటకాల ప్రదర్శనలు చేపడతామని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనను పార్టీ కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu