Bigg Boss 4: ఎలిమినేషన్ నామినేషన్‌లో ‘టార్గెట్ మెహబూబ్’.. ఊహించని ట్విస్ట్
బిగ్‌బాస్ 4లో ఆరో వారం ఎలిమినేషన్‌కి గానూ నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా నామినేట్ చేయాలనుకునే వ్యక్తి మెడలో ఎండు మిర్చి దండ వేసి కారణం చెప్పాలని బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు వెల్లడించారు.
Bigg Boss 4 elimination: బిగ్‌బాస్ 4లో ఆరో వారం ఎలిమినేషన్‌కి గానూ నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా నామినేట్ చేయాలనుకునే వ్యక్తి మెడలో ఎండు మిర్చి దండ వేసి కారణం చెప్పాలని బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు వెల్లడించారు. ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేయొచ్చని తెలిపారు. దీంతో అరియానాతో ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. అరియానా మెహబూబ్‌ని నామినేట్ చేస్తూ.. కెప్టెన్సీ టాస్క్‌లో సొహైల్ హ్యాండ్ టచ్ అయ్యిందని మెల్లిగా అంటే, దాన్ని పెద్దగా చేశాడని అది నచ్చలేదని రీజన్ చెప్పింది. ఇక రెండో వ్యక్తిగా మోనాల్‌ని నామినేట్ చేస్తూ.. హోటల్ గేమ్‌లో బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌ను సరిగా చేయలేదని కారణం చెప్పింది.
ఇలా పలు కారణాలు చెబుతూ మిగిలిన వారు కూడా నామినేషన్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా దివి – నోయల్, మెహబూబ్‌ని.. నోయల్ – దివి, అభిజిత్‌లను.. హారిక – అరియానా, కుమార్ సాయిలను.. అభిజిత్ – మెహబూబ్, అఖిల్‌ని.. లాస్య – మెహబూబ్, దివిని.. మెహబూబ్ – దివి, అరియానాని.. సొహైల్ – అరియానా, కుమార్ సాయిని.. అమ్మ రాజ శేఖర్ – లాస్య, అభిజిత్‌ని.. అవినాష్ – దివి, అభిజిత్‌ని.. మోనాల్ – అరియానా, దివిని.. అఖిల్ – అభిజిత్, అరియానాను.. కుమార్ సాయి – హారిక, సొహైల్‌ని నామినేట్ చేశారు. ఇలా నలుగురు కంటెస్టెంట్‌లు మెహబూబ్‌ని టార్గెట్ చేయడంతో అతడు ఏడ్చేశారు. అయితే ఈ లోపే ఊహించని ట్విస్ట్ జరిగింది.
ఈ వారం హౌజ్‌కి సొహైల్ కెప్టెన్‌గా ఉండటంతో బిగ్‌బాస్ అతడికి ప్రత్యేక అధికారం ఇచ్చారు. నామినేట్ అయిన వారిలో ఒకరిని సేవ్ చేయమని సూచించారు. దీంతో తన ఫ్రెండ్ మెహబూబ్‌ని సేవ్ చేశారు సొహైల్. దీంతో ఈ వారం ఎలిమినేషన్‌కి అరియానా, అభిజిత్, మోనాల్, కుమార్ సాయి, దివి, అఖిల్, నోయల్, లాస్య, హారికలు నామినేట్ అయ్యారు.
Read More:
IPL 2020, RCB vs KKR : అదరగొట్టిన ఆర్సీబీ ..చిత్తుగా ఓడిన కేకేఆర్