Bigg Boss 4: ఇదంతా కాని పని.. మోనాల్ మొహం మీదే చెప్పేసిన అభి
బిగ్‌బాస్ 4 సోమవారం నాటి ఎపిసోడ్‌లో భాగంగా గతవారం నామినేషన్ ప్రక్రియలో జరిగిన గొడవ గురించి అభిజిత్, మోనాల్ చర్చించుకున్నారు
Abhijeet Monal Bigg Boss 4: బిగ్‌బాస్ 4 సోమవారం నాటి ఎపిసోడ్‌లో భాగంగా గతవారం నామినేషన్ ప్రక్రియలో జరిగిన గొడవ గురించి అభిజిత్, మోనాల్ చర్చించుకున్నారు. నీకు, నాకు మధ్యం ఏం లేదా మోనాల్ అని అభి స్టార్ట్ చేశారు. ఒక అమ్మాయి కోణం నుంచి ఆలోచించు అని మోనాల్ వివరిస్తుండగా.. దీన్ని ఉమెన్ ఇష్యూలా చూపించకు. అఖిల్‌పై నీ మీద అంత ప్రేమ ఉంటే, ఇది జాతీయ ఛానెల్‌లో వస్తుందని అంటే, నామినేషన్ ప్రక్రియలో అఖిల్ నీ పేరు ఎందుకు ప్రస్తావించాడు అని అభిజిత్ అడిగేశారు.
నీ బెడ్ రూమ్‌లో ఉన్నప్పుడు అఖిల్‌ది తప్పన్నావు. నాగ్ సార్ ముందు ఇద్దరిదీ తప్పన్నావు. నాకు, నువ్వు చేస్తున్నావో అర్థమవుతుంది అని మోనాల్ అన్నారు. దీంతో మోనాల్ ఏడ్చేస్తూ కోపాన్ని ప్రదర్శించింది. నాకు నీతో మాట్లాడకపోతేనే మంచిదనిపిస్తోందని, ఏదోకటి చెప్పు, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. నా పని నేను చూసుకోవచ్చు. నేను నేనుగా ఉండలేకపోతున్నా. నువ్వు నీలా ఉండలేకపోతున్నావు. నన్ను నువ్వు తప్పుపట్టడం, నిన్ను నేను తప్పుపట్టడం ఇదంతా వేస్ట్ అని మోనల్ మొహం మీదే చెప్పేవారు అభి. దానికి మోనాల్ సమాధానం చెప్పలేదు. ఆ తరువాత కనీసం గుడ్ మార్నింగ్, హాయ్‌లు అయినా చెప్పుకుందాం అని మోనాల్ అడిగింది. అందుకు కాసేపు ఆలోచించుకొని చెప్తా అని అభి బర్త్‌డే వేడుకకు వెళ్లారు.
Read More:
Bigg Boss 4: ఎలిమినేషన్ నామినేషన్‌లో ‘టార్గెట్ మెహబూబ్’.. ఊహించని ట్విస్ట్