బిగ్ బాస్ 4: ఆ ఇద్దరూ టాప్ 2లో ఉండాలి.. పనికి రానోళ్లను తోసేయండి: రాహుల్ సిప్లిగంజ్
బిగ్ బాస్ సీజన్ 4 చివరి అంకానికి చేరుకుంది. మరో మూడు వారాలు మిగిలి ఉండటంతో బిగ్ బాస్ విజేతగా ఎవరు నిలుస్తారన్న దానిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
Bigg Boss 4: బిగ్ బాస్ సీజన్ 4 చివరి అంకానికి చేరుకుంది. మరో మూడు వారాలు మిగిలి ఉండటంతో బిగ్ బాస్ విజేతగా ఎవరు నిలుస్తారన్న దానిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ సీజన్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీలతో కలిసి మొత్తం 19 కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. పన్నెండో వారం ముగిసేసరికి ఏడుగురు మాత్రమే మిగిలారు. ప్రస్తుతం అఖిల్, అభిజిత్, అరియానా, అవినాష్, హారిక, సోహైల్, మోనాల్‌లు టైటిల్ రేసులో ఉన్నారు.
వీరందరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కావడంతో ఎవరు టాప్ 5లో నిలుస్తారన్న దానిపై జనాల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ‘టికెట్ టూ ఫినాలే’ టాస్క్ ద్వారా అఖిల్ టాప్ 5కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో తమకు నచ్చిన కంటెస్టెంట్లను గెలిపించుకోవడం కోసం అటు సెలబ్రిటీలు, ఇటు అభిమానులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
కొంతమంది సీరియల్ నటీనటులు అఖిల్‌కు మద్దతు ప్రకటించగా.. నటుడు సాయి కుమార్ జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్‌కు ఓటు వేయమని ప్రేక్షకులను కోరాడు. ఇక మెగా బ్రదర్ నాగబాబుతో సహా పలువురు నటులు అభిజిత్ సీజన్ 4 విజేతగా నిలుస్తాడని అభిప్రాయపడుతున్నారు. అటు యూట్యూబ్ స్టార్లు అయితే దేత్తడి హారికకు గెలిపించాలని కోరుతున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పటిదాకా అభిజిత్‌కు సపోర్ట్ చేస్తూ వస్తున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. తాజాగా సోహైల్, అరియనాలు టాప్ 2లో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. జెన్యూన్‌గా ఆడేవాళ్లకు సపోర్ట్‌ను అందించండి.. పనికి రానివారిని ఎలిమినేట్ చేయండంటూ అభిమానులను కోరాడు. పెర్ఫార్మన్స్ ఇచ్చినవారికే తన సపోర్ట్ ఉంటుందని చెప్పుకొచ్చాడు.
Read more:
GHMC Election Results 2020: Full list of winning candidates : గ్రేటర్ ఎన్నికల్లో విజేతలు వీరే
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు..