ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఐదవ రోజు సమావేశాల్లోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అదే గందరగోళం.. అవే నిరసనలు.. వెరసి ప్రతిపక్ష సభ్యుల..

  • Shiva Prajapati
  • Publish Date - 11:12 am, Fri, 4 December 20
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు..

AP Assembly : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఐదవ రోజు సమావేశాల్లోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అదే గందరగోళం.. అవే నిరసనలు.. వెరసి ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ల పర్వం కొనసాగింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ బిల్లులను చెల్లించాలంటూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. స్పోకర్‌ పోడియంపైకి ఎక్కి నిరసనలు వ్యక్తం చేశారు. స్పీకర్ వారించినా వినలేదు. దీంతో విపక్ష టీడీపీకి చెందిన 10 మంది సభ్యులను సస్పెండ్ చేయాలని మంత్రి పేర్ని నాని తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం మేరకు 10 మంది సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారం ప్రకటించారు. సస్పెండైన వారిలో అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, అనగాని సత్య ప్రసాద్, ఏలూరు సాంబశివరావు, జోగేశ్వర రావు, రామ రాజు, రామకృష్ణ బాబు, బాల వీరాంజనేయ స్వామి, అశోక్, బుచ్చయ్య చౌదరి ఉన్నారు.

ఇదిలాఉండగా, విపక్ష సభ్యులు సభా సమయాన్ని వృధా చేస్తున్నారంటూ అధికార పార్టీ సభ్యులు ధ్వజమెత్తారు. కావాలనే డ్రామాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. ఏ సమస్యపై అయినా చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆందోళనలు మాని అంశాలపై చర్చకు రావాలని ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి టీడీపీ సభ్యులను కోరారు.