Bigg Boss 4 Telugu : ఫినాలేకు ఊహించని అతిథి..! మీ మనసులో కూడా ఇతడే ఉన్నాడా..? ఆ స్టార్ ఎవరంటే..?
బిగ్‌బాస్ ఫోర్త్ సీజన్.. చూస్తున్నారుగా..! అసలే సీజన్ ఎండింగ్‌కి వచ్చిన నేపథ్యంలో ఆట రసవత్తరంగా మారింది. ఇంతకీ ఫోర్త్ వెర్షన్ టైటిల్ విన్నర్ ఎవరవుతారు..?
బిగ్‌బాస్ ఫోర్త్ సీజన్.. చూస్తున్నారుగా..! అసలే సీజన్ ఎండింగ్‌కి వచ్చిన నేపథ్యంలో ఆట రసవత్తరంగా మారింది. ఇంతకీ ఫోర్త్ వెర్షన్ టైటిల్ విన్నర్ ఎవరవుతారు..? అంటే మాత్రం రకరాలు పేర్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఆ కాంపిటిషన్ మామూలుగా లేదు. అందునా బిగ్ బాస్ హౌస్‌లో ఏమైనా జరగొచ్చు. షోని గ్రాండ్‌గా కంక్లూడ్ చేసే ఆ ఫైనల్ ఎపిసోడ్‌కి గెస్ట్ ఎవరొస్తారు.. కింగ్ నాగార్జునకు తోడుగా ఆ డయాస్ మీద ఏ హీరో ఫ్లాష్ ఔతారు..? ఇదీ ఇప్పుడు వీక్షకుల మదిలో మెదులుతోన్న ప్రశ్న.
థర్డ్ సీజన్ ఫినాలేకి మెగాస్టార్ వచ్చి మెగా ఫినిషింగ్ ఇచ్చారు.. గుర్తుందిగా..! అంతకుముందు సెకండ్ సీజన్ లాస్ట్ ఎపిసోడ్‌ని విక్టరీ వెంకటేష్ కలర్‌ఫుల్‌గా మార్చేశారు. అవన్నీ గోల్డెన్ మూమెంట్స్. మరి.. ఈసారి ఫినాలేని ఏ స్టార్ హీరో వచ్చి ఫినిష్ చేస్తారు..? అన్నది ప్రజంట్ హాట్ టాపిక్‌గా మారింది.
షో నిర్వాహకులు మాత్రం.. ఒకటికాదు.. నాలుగైదు ఆప్షన్స్ రెడీగా పెట్టుకున్నారు. నాగ్ లీవ్ తీసుకున్నప్పుడు సమంత వచ్చి ఆ గ్యాప్‌ని గ్రాండ్‌గా ఫిలప్ చేసిన విషయం తెలిసిందే. అఖిల్ కూడా వదినమ్మతో కలిసి చలాకీగా జోకులేసి వెళ్లారు. ఫినాలేకి మాత్రం మహేష్ రావాలని, బన్నీ రావాలని.. కాదుకాదు తారక్ వస్తే అదుర్స్ అని చాలాచాలా గెస్సింగ్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈసారి ఫినాలేకి చీఫ్‌గెస్ట్‌గా వచ్చే ఛాన్సెస్ చైతూకే ఎక్కువట. ఇంకాస్త కలర్ కావాలనుకుంటే.. చైతూకి తోడుగా అదేనండీ సింగిల్ పీస్ అంటారే.. ఆ సాయిపల్లవిని కూడా తీసుకొస్తారు. చూద్దాం మరి ఏం జరగుతుందో..