బిగ్‌బాస్ షోకు వెళ్లడం నేను చేసిన అతి పెద్ద తప్పిదాల్లో ఒకటి… అభి టైటిల్ విన్నర్ అంటున్న సింగర్…

బిగ్‌బాస్ షోకు వెళ్లడం నేను చేసిన అతి పెద్ద తప్పిదాల్లో ఒకటి అంటున్నాడు బిగ్‌బాస్ షో కంటెస్టెంట్ నోయల్. ఈయన వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చారు. కానీ అనారోగ్యం కారణంగా అంత తొందరగా హౌస్‌ నుంచి నిష్క్రమించాడు.

బిగ్‌బాస్ షోకు వెళ్లడం నేను చేసిన అతి పెద్ద తప్పిదాల్లో ఒకటి...  అభి టైటిల్ విన్నర్ అంటున్న సింగర్...

బిగ్‌బాస్ షోకు వెళ్లడం నేను చేసిన అతి పెద్ద తప్పిదాల్లో ఒకటి అని బిగ్‌బాస్ షో కంటెస్టెంట్ నోయల్ అంటున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లాడు నోయల్. హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గానూ నోయల్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, అనారోగ్యంతో నోయల్ షో నుంచి  బయటకు  వచ్చాడు.  ప్రేక్షకులకు మాత్రం నోయల్ ఎలిమినేషన్  నచ్చలేదు. పూర్తి ఆరోగ్యంతో నోయల్ తిరిగి హౌస్‌లోకి వస్తాడనుకున్నారు కానీ.. తాను మళ్లీ బిగ్ బాస్ లోకి వెళ్లనని నోయల్ తెగేసి చెప్పాడు.

శత్రువులు లేరు…

హౌస్ నుండి బయటకు వెళ్లిన తర్వాత ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అసలు బిగ్ బాస్ షోకు నేనసలు వెళ్లాల్సింది కాదన్నాడు. ఈ షోకు వెళ్లిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు మనకు అవసరం లేదనే విషయం తనకు అర్ధమైందన్నారు. అందుకే హౌస్ నుండి బయటకు వెళ్లిన తర్వాత షో కూడా చూడడం కూడా మానేసినట్టు చెప్పుకొచ్చాడు నోయల్. ఇక హౌస్‌లో తనకు ఎవరు శత్రువులు లేదన్నాడు. కానీ తను మాత్రం బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న హారిక, అభిజిత్‌కు మద్దతు ఇస్తున్నట్టు తెలిపాడు. ప్రస్తుతం హౌస్‌లో ఎవరికి తగ్గట్టు వాళ్లు మంచిగానే ఆట ఆడుతున్నారని చెప్పారు. ప్రస్తుతం ఉన్న సిట్యూవేషన్ చూస్తుంటే.. అభిజిత్ బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచే అవకాశాలున్నాయని జోస్యం చెప్పారు.