Bigg Boss 4: అఖిల్ ముందే అవినాష్‌కి మోనాల్ ముద్దు.. రచ్చ చేసిన కమెడియన్
హౌజ్‌లో వెళ్లినప్పటి నుంచే మోనాల్‌కి అవినాష్ పులిహోర కలుపుతూ వస్తోన్న విషయం తెలిసిందే. అయితే మొదట్లో ఆమె అవినాష్‌ని
Monal kisses Avinash: హౌజ్‌లో వెళ్లినప్పటి నుంచే మోనాల్‌కి అవినాష్ పులిహోర కలుపుతూ వస్తోన్న విషయం తెలిసిందే. అయితే మొదట్లో ఆమె అవినాష్‌ని పెద్దగా పట్టించుకోలేదు. అంతేకాదు అవినాష్ నువ్వు చేసే కామెడీ నాకు నచ్చలేదంటూ మొహం మీదే చెప్పేసింది. కానీ రోజులు గడుస్తున్న కొద్ది వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. మోనాల్‌కి ట్రై చేస్తున్న ‘ఏ’ ల్లో అవినాష్ కూడా చేరిపోయాడు.(Bigg Boss 4: బీబీ డే కేర్ సెంటర్.. సొహైల్‌కి చుక్కలు చూపించిన అరియానా)
ఇక మంగళవారం నాటి ఎపిసోడ్‌లో అఖిల్, మోనాల్ ఒక చోట అరియానా, అవినాష్ మరోచోట కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నారు. మోనాల్‌ని చూసి అవినాష్ ఐ హేట్ యు చెప్పింది. దీంతో అతడిని కూల్ చేసేందుకు మోనాల్ పరుగెత్తుకుంటూ వెళ్లి అవినాష్ నుదిటిపై ముద్దు పెట్టింది. దీంతో అవినాష్ రచ్చ రచ్చ చేశాడు. నా పొలంలో మొలకలు వచ్చాయి అంటూ ఎగిరేశాడు. మై హీరోయిన్ మోనాల్ అంటూ అరుస్తూ.. ఏ అని అవినాష్ అని సంబరపడిపోయాడు.(తొలిదశలో పోటీపడుతోన్న హేమాహేమీలు)