Bigg Boss 4: బీబీ డే కేర్ సెంటర్‌.. సొహైల్‌కి చుక్కలు చూపించిన అరియానా

బిగ్‌బాస్‌ 4లో మంగళవారం నాటి ఎపిసోడ్‌లో బీబీ డే కేర్ అనే లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌ని బిగ్‌బాస్‌ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో భాగంగా హౌజ్‌ పిల్లలను

Bigg Boss 4: బీబీ డే కేర్ సెంటర్‌.. సొహైల్‌కి చుక్కలు చూపించిన అరియానా
Follow us

| Edited By:

Updated on: Oct 28, 2020 | 7:15 AM

Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్‌ 4లో మంగళవారం నాటి ఎపిసోడ్‌లో బీబీ డే కేర్ అనే లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌ని బిగ్‌బాస్‌ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో భాగంగా హౌజ్‌ పిల్లలను చూసుకునే డే కేర్‌గా మారింది. ఇక ఇంటి సభ్యులు పిల్లలు, కేర్ టేకర్లుగా విడిపోయారు. పిల్లల టీమ్‌లో అరియానా, అవినాష్‌, మెహబూబ్‌, హారిక, అమ్మ రాజశేఖర్ ఉండగా.. నోయల్‌, అఖిల్‌, సొహైల్‌, మోనాల్‌, అభిజిత్‌లు కేర్‌ టేకర్లుగా మారారు. లాస్య సంచాలకురాలిగా మారింది.

ఇక టాస్క్‌లో భాగంగా పిల్లలకు కేర్ టేకర్లు అన్నం తినిపించాలి, బట్టలు, డైపర్లు వేయాలి, చదువు చెప్పాలి, వారిని ఎంటర్‌టైన్ చేయాలి. ఇక పిల్లలు కొంటెగా, బాగా అల్లరి చేయాలి. ఈ టాస్క్‌లో విజేతగా నిలిచిన వారికి ప్రత్యేక బహుమతి కూడా ఉంటుందని చెప్పారు.

టాస్క్‌ మొదలైన తరువాత పిల్లలు రచ్చ రచ్చ చేశారు. అమ్మ రాజశేఖర్ మాస్టర్ చిన్న పిల్లాడిగా బాగా నటించారు. అరియానా అయితే తనను నామినేట్ చేసిన సొహైల్‌కి చుక్కలు చూపించింది. సొహైల్‌ మీదకు ఎక్కి చల్‌ చల్‌ గుర్రం ఆడుకుంది. సొహైల్‌ని నాన్న నాన్న అంటూ బాగా ఆడుకుంది. ఆమెకు అవినాష్‌ కూడా తోడు కాగా.. సొహైల్‌ని వారిద్దరు బాగా ఆడుకున్నారు. హారిక అల్లరి పనులతో గోల గోల చేసింది. తోటి పిల్లాడైన అమ్మ రాజశేఖర్‌ని హారిక రాచిరంపాన పెట్టింది. మెహబూబ్‌ కోరిక మేరకు అఖిల్‌ అతడిని పలుమార్లు ఎత్తుకొని తిప్పేందుకు చాలా కష్టపడ్డాడ.

ఇక ఏడుపు సౌండ్ వచ్చినప్పుడు బట్టలు, డైపర్లు మార్చాల్సి ఉండగా.. బట్టలపైనే డైపర్లు వేశారు. దానిని వేసుకునేందుకు పిల్లలు మారం చేశారు. హారిక, మోనాల్‌ను బాగా విసిగించింది. అయితే అభిజీత్ డైపర్ వేసినప్పుడు అమ్మ రాజశేఖర్ మాస్టర్ మాత్రం బుద్ధిగా వేయించుకున్నారు. అయితే హారిక, అభిజీత్‌పై నీళ్లు పోస్తూ అల్లరి చేసింది.

Read More:

కాసేపట్లో బీహార్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్

దేశ రాజధానిలో తిరిగి విజృంభిస్తున్న కరోనా మహమ్మారి

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..