దేశ రాజధానిలో తిరిగి విజృంభిస్తున్న కరోనా మహమ్మారి

Corona Virus Re-Emerges : దేశ రాజధానిలో కరోనా వైరస్ తిరిగి విజృంభిస్తోంది. ఒక్క రోజే దాదాపు 5 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. దసరా పండగ ఎఫెక్ట్ అని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. 3 వేలకు పైగా కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. ఇదిలావుంటే కోవిడ్ నిబంధనలను దేశరాజధాని ప్రజలు గాలికి వదిలేసిన కనిపిస్తున్నారు. కనీసం మాస్కులను కూడా ధరించడం లేదు. సోషల్ డిస్టెన్స్ పాటించకుండే […]

దేశ రాజధానిలో తిరిగి విజృంభిస్తున్న కరోనా మహమ్మారి
Follow us

|

Updated on: Oct 28, 2020 | 2:54 AM

Corona Virus Re-Emerges : దేశ రాజధానిలో కరోనా వైరస్ తిరిగి విజృంభిస్తోంది. ఒక్క రోజే దాదాపు 5 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. దసరా పండగ ఎఫెక్ట్ అని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. 3 వేలకు పైగా కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. ఇదిలావుంటే కోవిడ్ నిబంధనలను దేశరాజధాని ప్రజలు గాలికి వదిలేసిన కనిపిస్తున్నారు. కనీసం మాస్కులను కూడా ధరించడం లేదు.

సోషల్ డిస్టెన్స్ పాటించకుండే ప్రజలు హోటల్స్, రోడ్లపై కనిపిస్తున్నారు. ఇప్పటికే దేశ రాజధానిలో 3 లక్షల 64 వేలు దాటిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య కొనసాగుతోంది. ఢిల్లీ చరిత్రలోనే అత్యధికంగా ఒక్క రోజులో 4,853 “కరోనా” పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటలలో డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 2,722గా ఉంది.

గడచిన 24 గంటలలో “కరోనా” కారణంగా 44 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు మొత్తం మృతుల సంఖ్య 6,356 అని తాజా విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వం వెల్లడించింది. దేశ రాజధానిలో ఇప్పటివరకు నమోదయిన కేసుల సంఖ్య 3,64,341 ఇలా వుంది.