Bigg Boss 4: ఆ కంటెస్టెంట్ గురించి క్లారిటీ ఇచ్చిన మోనాల్.. తనకే నా సపోర్ట్ అంటూ..
బిగ్‌బాస్ ముగింపుకు ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రస్తుతం హౌస్‌లో ఐదుగురు సభ్యుల కోసం సోషల్ మీడియాలో వారి ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.
బిగ్‌బాస్ ముగింపుకు ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రస్తుతం హౌస్‌లో ఐదుగురు సభ్యుల కోసం సోషల్ మీడియాలో వారి ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. తమ ఫేవరెట్ కంటెస్టెంట్లను గెలిపించేందుకు రెడి అయ్యారు. బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కూడా తమ తమ ఫెవరేట్ అభ్యర్థులకు ఓట్లు వేయాలని సోషల్ మీడియాలో ప్రేక్షకులను కోరుతున్నారు. అయితే బిగ్‌బాస్ 14వ వారంలో ఎలిమినేట్ అయినా మోనాల్ కూడా ఆ కోవలోకి వచ్చి చేరింది.
పద్నాలుగు వారాలు హౌస్‌లో కొన్ని రోజులు అటు అభిజిత్, ఇటు అఖిల్‌తో క్లోజ్‍గా ఉండడంతో ఇంట్లో ట్రయంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందని సోషల్ మీడియాలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. అభితో మనస్పర్ధలు రావడంతో ఈ బ్యుటీ అఖిల్‌లో ఎక్కువగా కనెక్ట్ అయ్యింది. ఆదివారం ఎలిమినేషన్ అనంతరం ఆమె సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. ఈ క్రమంలోనే అఖిల్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని క్లారిటీ ఇచ్చేసింది. గేమ్ మొదటి రోజు నుంచి అఖిల్ తనకు చాలా సపోర్ట్‌గా ఉన్నాడని.. ఇప్పుడు తన కోసం మనం నిలబడాల్సిన సమయం వచ్చిందని తెలిపింది. బిగ్‌బాస్ విజేతగా అఖిల్‌ను గెలిపించడం కోసం అందరు ఓట్లు వేయాలని తన అభిమానులను కోరింది. అతనితోపాటు సోహైల్, హారికకు కూడా సపోర్ట్ చేయాలని తన ఫ్యాన్స్‌ను రిక్వెస్ట్ చేసింది.