AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4: ఇద్దరు దేవదాసుల ‘లవ్ స్టోరీ’.. మోనాల్ కోసం తన్నుకునేలా ఉన్నారుగా!

ఏడుపులు, పెడబొబ్బలు, కోపాలు, ప్రేమలు, అలకలు, టాస్కులు, ఫైటింగులు.. ఇవన్నీ కూడా బిగ్ బాస్‌లో జరుగుతుండటం ఆనవాయితీ. మొదటి వారం చిన్న ఇష్యూస్‌కు వీర లెవెల్‌లో ఆవేశాలకు లోనైన కంటెస్టెంట్లు..

Bigg Boss 4: ఇద్దరు దేవదాసుల 'లవ్ స్టోరీ'.. మోనాల్ కోసం తన్నుకునేలా ఉన్నారుగా!
Ravi Kiran
|

Updated on: Sep 17, 2020 | 1:54 PM

Share

ఏడుపులు, పెడబొబ్బలు, కోపాలు, ప్రేమలు, అలకలు, టాస్కులు, ఫైటింగులు.. ఇవన్నీ కూడా బిగ్ బాస్‌లో జరుగుతుండటం ఆనవాయితీ. మొదటి వారం చిన్న ఇష్యూస్‌కు వీర లెవెల్‌లో ఆవేశాలకు లోనైన కంటెస్టెంట్లు.. రెండోవారంలో మిగిలిన ఎమోషన్స్‌ను బయట పెడుతున్నారు. ముఖ్యంగా ఈ వారంలో స్నేహం, ప్రేమ అనే రెండు ఎమోషనల్ ఫీలింగ్స్ కీ రోల్ పోషిస్తున్నాయని చెప్పాలి. మోనాల్-అభిజిత్-అఖిల్, హారిక-అభిజిత్, సుజాత-అభిజిత్.. ఇలా కొన్ని జంటల మధ్య మనస్పర్ధలు, స్నేహం, ప్రేమలు, కోపాలు బయటపడుతున్నాయి. (Bigg Boss 4)

హారికకు అభిజిత్ అంటే ఇష్టం.. ఇది మంగళవారం నాటి ఎపిసోడ్‌లో తేలిపోయింది. అటు సుజాతకు కూడా అభిజిత్ అంటే ఇష్టమే. కానీ వీరిది కేవలం స్నేహం మాత్రమే అని అభిమానులకు కూడా స్పష్టమైంది. ఎందుకంటే అభిజిత్‌కు మోనాల్ అంటే మరీ మరీ ఇష్టం. మొదట్లో మోనాల్‌ను అభిజిత్ దూరం పెట్టినా.. ఆ తర్వాత ఆమెతోనే ప్రతీ రోజూ టైం స్పెండ్ చేస్తున్నాడు. ఆమెను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.

అయితే వారి క్లోజ్‌నెస్‌.. అఖిల్‌కు నచ్చట్లేదు. ఎందుకంటే అఖిల్ సార్ధిక్ కూడా మోనాల్‌ను ఇష్టపడుతున్నాడు. పైకి వీరిద్దరూ మేము కేవలం బెస్టీస్ అని చెబుతున్నా.. నిన్న సాంగ్ రిహార్సల్ సమయంలో అఖిల్ ఎక్స్‌ప్రెషన్స్‌ చూస్తే.. అతనికి మోనాల్‌పై ఏదో ఉందని చెప్పకనే చెబుతున్నాయి. ఇదంతా కూడా ఒక పక్క నుంచి కెప్టెన్ లాస్య, అభిజిత్, సుజాతలు కూడా చూశారు. అలాగే నిన్నటి ఎపిసోడ్‌లో మోనాల్‌కు అఖిల్ కారం దోస్ ఎంతో ప్రేమతో తినిపించడం.. అదంతా చూస్తూ అభిజిత్ చిన్నబుచ్చుకోవడం జరిగింది. అటు ఏదో ఇష్యూ వల్ల అఖిల్, అభిజిత్ మధ్య దూరం కూడా పెరిగింది. ఇక వీరి ముగ్గురు మధ్య లాస్య రాయబారం నడపడం, సంధి కుదర్చడం లాంటివి జరుగుతోంది.

అసలు నిజంగా వీరి మధ్య ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ నడుస్తోందా.? లేక ఇది బిగ్ బాస్ స్కెచా.? అనేది ప్రేక్షకుల్లో మెదులుతున్న ప్రశ్న. అయినా చూద్దాం మున్ముందు ఈ లవ్ స్టోరీ ఎంతవరకు వెళ్తుందో..? ముందైతే టాస్కులు మీద ఫోకస్ చేయండి బిగ్ బాస్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Also Read:

బిగ్ బాస్ 4: గంగవ్వను బయటికి పంపే ప్లాన్.. అందుకే టార్గెట్ చేస్తున్నారా.!

బిగ్ బాస్ 4: ఈ సీజన్‌లో ఆమెదే భారీ రెమ్యునరేషన్

బిగ్ బాస్ హౌస్‌లోకి రామ్‌చరణ్ హీరోయిన్..!

సచివాలయ పరీక్షలకు సర్వం సిద్ధం.. వారికి ఐసోలేషన్ రూంలో ఎగ్జామ్!

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

Follow Us
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?
IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?
IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?
వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?
వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్
సమ్మర్ ఎఫెక్ట్..కాసులు కురిపించనున్న ఆ స్టాక్స్!కొన్నారో ధనవంతులే
సమ్మర్ ఎఫెక్ట్..కాసులు కురిపించనున్న ఆ స్టాక్స్!కొన్నారో ధనవంతులే
పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే బరువు తగ్గండిలా.. ఈ సూపర్ ఫార్మూలతో..
పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే బరువు తగ్గండిలా.. ఈ సూపర్ ఫార్మూలతో..
విజయ్ దళపతి, సంగీత విడాకుల కేసులో ఊహించని ట్విస్టు..
విజయ్ దళపతి, సంగీత విడాకుల కేసులో ఊహించని ట్విస్టు..
ఆ 3 విషయాల్లో కివీస్‌దే ఆధిపత్యం.. మరోసారి భారత్‌కు ఓటమి తప్పదా?
ఆ 3 విషయాల్లో కివీస్‌దే ఆధిపత్యం.. మరోసారి భారత్‌కు ఓటమి తప్పదా?
వారికి తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. ఉచితంగానే ఖరీదైన వైద్యం!
వారికి తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. ఉచితంగానే ఖరీదైన వైద్యం!
అతడంటే పిచ్చి ఇష్టం.. అసలు విషయం చెప్పిన ఛాంపియన్ హీరోయిన్..
అతడంటే పిచ్చి ఇష్టం.. అసలు విషయం చెప్పిన ఛాంపియన్ హీరోయిన్..