Bigg Boss 4: మగాడిలా ఆట ఆడు.. అభిపై సొహైల్‌ సీరియస్‌

బుల్లితెరపై బిగ్‌బాస్ 4 హవా కొనసాగుతోంది. బిగ్‌బాస్ టాస్క్‌లు, లవ్‌ స్టోరీలు, గొడవలు వీక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి

Bigg Boss 4: మగాడిలా ఆట ఆడు.. అభిపై సొహైల్‌ సీరియస్‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 30, 2020 | 7:14 AM

Bigg Boss 4 Telugu: బుల్లితెరపై బిగ్‌బాస్ 4 హవా కొనసాగుతోంది. బిగ్‌బాస్ టాస్క్‌లు, లవ్‌ స్టోరీలు, గొడవలు వీక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక గత వారం జరిగిన ఉక్కు హృదయం టాస్క్‌ నేపథ్యంలో రచ్చపై అభిజిత్-సొహైల్‌ల మధ్య మళ్లీ రచ్చ రేగింది. ఆ టాస్క్ రచ్చకి ఎండ్ ఉండదా..? అని అభి, సొహైల్‌ని అడగడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. మమ్మల్ని గల్లీ బాయ్స్ అంటే ఊరుకోవాలా..?? అని సొహైల్ మండిపడ్డాడు. మరి నీ బతుకు అని నువ్వు నన్ను అనలేదా..? అంటూ అభి అడిగాడు. దీనికి ఎండ్ కార్డ్ ఇవ్వవా..? ఫిజికల్ టాస్క్ వస్తే కొట్టినా కొడతావా..? అని అభి అన్నాడు. దాంతో ‘కొట్టను గానీ ఫిజికల్ టాస్క్ ఇస్తే కాలర్ పట్టుకుని పక్కకు లాగే అవసరం వస్తే ఖచ్చితంగా అలాగే చేస్తా’ అని తెలిపాడు.

ఇక ఆడ పిల్లలతో గీకించుకున్నావు నువ్వు అని అభి, సొహైల్‌ని అన్నాడు. నేను గీకించుకోవడం కాదు. నువ్వు అమ్మాయిలతో ఆట ఆడించి ఛార్జింగ్ పెట్టించుకున్నావు. వాళ్లతో ఆట ఆడించి పేరు కొట్టేశావు. కాస్త మగాడిలా ఆట ఆడు అంటూ సొహైల్ సీరియస్ అయ్యాడు. వెంటనే ఆడవాళ్లతో గీకించుకున్నవాడు మగాడా..? కండలు చూపిస్తే మగాడా..? ఫిజికల్‌గా కలబడితే మాగాడా..? అంటూ ప్రశ్నించిన అభిజిత్‌.. కండలు వాడటం కాదు బుర్ర కూడా వాడు అని అన్నాడు. ‘నీకు దమ్ము లేదు నువ్వు రాలేదు. అమ్మాయిలు ముందుకొచ్చి ఆడారు. నేను నూటికి నూరు శాతం మగాడిని. అలాగే ఆడతా’ అంటూ సొహైల్ కౌంటర్‌ ఇచ్చాడు.

ఇక వీరిద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో.. మెహబూబ్‌ మధ్యలో ఇన్వాల్వ్‌ అయ్యాడు. మేం లొల్లి చేశాము అని నువ్వు ఎందుకు అంటావు అంటూ అభిని అడిగాడు. వెంటనే నువ్వు ఎందుకు మధ్యలో వస్తున్నావు అని సీరియస్ అయ్యాడు. ఇక ఫిజికల్‌ టాస్క్ అనే సరికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు. నేను కెమెరా వద్దకు వెళ్లి చెప్తే నీకు నష్టం ఏంటి..?ఓకే బిగ్‌బాస్‌, అభి భయపడుతున్నాడు. మీరు అభికి ఫిజికల్ టాస్క్ ఇవ్వకండి ఒకవేళ ఇచ్చినా అమ్మాయిలను పెట్టే ఆడతాడు అని సొహైల్‌ సీరియస్‌గా చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

Read More:

IPL 2020 : చెన్నై అభిమానులకు గుడ్ న్యూస్..

మెగాస్టార్‌ సినిమాలో రమ్యకృష్ణ !