Bigg Boss 4: అవినాష్‌ పులిహోరా.. నీకు పడిపోతాలే అవినాష్‌ అన్న అరియానా

సమయం చిక్కితే అమ్మాయిలతో పులిహోర కలపడంలో ముందు ఉండే అవినాష్‌.. శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో అరియానాతో ఓరేంజ్‌లో ఆడుకున్నాడు

Bigg Boss 4: అవినాష్‌ పులిహోరా.. నీకు పడిపోతాలే అవినాష్‌ అన్న అరియానా
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 14, 2020 | 7:22 AM

Bigg Boss 4 Telugu: సమయం చిక్కితే అమ్మాయిలతో పులిహోర కలపడంలో ముందు ఉండే అవినాష్‌.. శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో అరియానాతో ఓరేంజ్‌లో ఆడుకున్నాడు. అరియానా చాలా బాగుంటుంది కదా అని మోహబూబ్‌తో అవినాష్‌ చెప్పగా… ఏమో నాకు తెలియదు అంటూ మెహబూబ్‌ అన్నాడు. ఇక అవినాష్‌ మాటలకు ముసిముసి నవ్వులు నవ్వుతూనే అవినాష్‌కి పంచ్‌లు ఇచ్చింది అరియానా. నువ్వు నాకంటే ముందే ఇద్దరు, ముగ్గురికి బాగుంటావు అని అన్నావు. ఇప్పుడు నేను బావుంటాను కదా అంటే నేనేం పడను నీకు” అని చెప్పింది. దీంతో అవినాష్‌ తన మాటలను కవర్‌ చేసుకునే ప్రయత్నం చేశాడు.

నువ్వు ఎవరు నాకు పడటానికి ఛల్. నీకు అంత సీన్ లేదు.. నాకూ అంత సీన్ లేదు.. అసలు నాకు ఆ ఆలోచనే లేదు. మనం ఫ్రెండ్స్ అంతే అనుకుంటూ మ్యాటర్‌ని కవర్ చేశాడు. ఇక వెంటనే అరియానా.. ఓకే అవినాష్‌ నేను నీకు పడిపోతాలే అని చెప్పింది. దీంతో అవినాష్‌ ‘మనం ఫ్రెండ్స్ కదా. ఎందుకు పడతాం. ఈ పడిపోవడాలు ఏంటి?? ఏం మాట్లాడుతున్నావు అంటూ డైవర్ట్‌ చేసుకొచ్చాడు.

ఇక అరియానా పింక్ శారీ కట్టుకోగా.. అవినాష్ కూడా పింక్ షర్ట్ వేసుకున్నాడు. దీంతో అరియానా కోసమే పింక్ వేసుకున్నావా? అని మెహబూబ్ అడిగాడు. వెంటనే అరియానా.. అవునా అవినాష్ నాకోసం పింక్ వేసుకున్నావా..? అని అడిగింది. దానికి ‘బొక్కేం కాదు.. నేను నీకోసం ఎందుకు పింక్ వేసుకుంటా.. నీకు అంత లేదు.. ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకు’అంటూ కాస్త ఘాటుగా మాట్లాడాడు.