Bigg Boss 4: మాస్టర్ అరగుండు.. ఆకాశానికెత్తేసిన నాగార్జున

వారాంతం ఎపిసోడ్‌లో భాగంగా బిగ్‌బాస్ 4 వ్యాఖ్యత నాగార్జున ఎప్పటిలాగే ఫుల్‌ ఖుషీతో వచ్చారు. ఈ సందర్భంగా కంటెస్టెంట్‌ల ముందు ఓ డీల్ పెట్టారు

Bigg Boss 4: మాస్టర్ అరగుండు.. ఆకాశానికెత్తేసిన నాగార్జున
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 18, 2020 | 7:41 AM

Rajasekhar Master Half Shave: వారాంతం ఎపిసోడ్‌లో భాగంగా బిగ్‌బాస్ 4 వ్యాఖ్యత నాగార్జున ఎప్పటిలాగే ఫుల్‌ ఖుషీతో వచ్చారు. ఈ సందర్భంగా కంటెస్టెంట్‌ల ముందు ఓ డీల్ పెట్టారు. అరగుండు, అరగడ్డం చేసుకుంటే వచ్చే వారం ఎలిమినేషన్ నుంచి సేవ్ అవ్వొచ్చని, లేదంటే మీకు ఇష్టమైన వాళ్లను సేవ్ చేయొచ్చని అన్నారు. దీంతో నేను చేస్తాను సర్ అని అమ్మ రాజశేఖర్ మాస్టర్ ముందుకు వచ్చారు. ‘ఆలోచించుకోండి పూర్తి షేవ్ కాదు అరగుండు అని’ నాగార్జున చెప్పడంతో.. నేను ముందే డిసైడ్‌ అయ్యా సర్‌.. హాఫ్ సేవ్ చేయించుకుంటా అని మాస్టర్ చెప్పారు.

దీంతో ఇంటి సభ్యులు తెగ ఫీల్ అయ్యారు. మాస్టర్‌కి వెంట్రుకలంటే ఇష్టమని మాట్లాడుకున్నారు. దివి అయితే బోరు బోరును ఏడ్చేసింది. నామినేషన్స్ కోసం ఇంత చేయాల్సిన అవసరం లేదు. మీకు నిర్ణయం తీసుకోవడం రాదా.. వద్దని ఒక్క మాట చెప్పలేరా? అంటూ దివి చాలా ఏడ్చింది.

ఇక అరగుండు తరువాత మాస్టర్ ఏడ్చేశాడు. లైఫ్‌లో ఎంతో పోయింది ఇదేం లెక్క కాదు. ఏదో గ్రేట్ అనిపించుకోవాలని కాదు. దేవుడికి ఇచ్చానని అనుకుంటా అని మాట్లాడారు. అయితే ఇంత సాహస నిర్ణయం తీసుకున్న మాస్టర్‌ని నాగార్జున అభినందించారు. కళలకు రూపం నటరాజు. ఆయన అర్థనారీశ్వర రూపాన్ని తలుచుకోండి. మీరు గొప్ప త్యాగం చేశారు. అమ్మ కోసం కూడా చేయని త్యాగం ఇప్పుడు చేశారు అని తెలిపారు.

అయితే మాస్టర్‌ని చూసి ఎమోషనల్ అయిన దివిని చూసి నాగార్జున మాట్లాడారు. బాగా డిస్ట్రబ్ అయినట్టు ఉన్నావు కదా అని అనడంతో.. హాఫ్ షేవ్ అంటే మిస్టేక్‌లా అనిపిస్తుంది సర్. పూర్తిగా గుండు చేసుకోమంటే పర్లేదు కానీ హాఫ్ అంటే రైట్ కాదు అని దివి తన అభిప్రాయాన్ని చెప్పింది. అయితే మాస్టర్ గుండు కొట్టించుకోవడంతో చాలా ఎదిగిపోయారు అని నాగార్జున ప్రశంసలు కురిపించారు. అయితే ఇదంతా చూస్తుంటే వచ్చే వారం నుంచి అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ని సేవ్ చేసేందుకు ముందుగానే ఈ డీల్‌ పెట్టినట్లుగా అనిపించింది.

Read More:

IPL 2020:CSK vs DC : గబ్బర్ సెంచరీ, ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం

IPl 2020 : ఐపీఎల్​లో రబాడ క్రేజీ రికార్డ్