Bigg Boss 4: ఎలిమినేషన్ స్టార్ట్.. ఆ ముగ్గురు సేఫ్
ఆరోవారం ఎలిమినేషన్‌కిగానూ మొత్తం 9 మంది నామినేట్ అయిన విషయం తెలిసిందే. వారిలో మొదటగా లాస్యను సేవ్ చేశారు నాగార్జున.
Bigg Boss 4 elimination: ఆరోవారం ఎలిమినేషన్‌కిగానూ మొత్తం 9 మంది నామినేట్ అయిన విషయం తెలిసిందే. వారిలో మొదటగా లాస్యను సేవ్ చేశారు నాగార్జున. ఎండుమిర్చి, పచ్చిమిర్చి బ్యాగ్‌లు ఇచ్చి వాటిలో పచ్చి మిర్చీలు వచ్చినవాళ్లు సేవ్ అవుతారని నాగార్జున చెప్పారు. దీంతో పచ్చి మిర్చిలు వచ్చిన లాస్య సేవ్ అయ్యింది. ఆ తరువాత రెండో కంటెస్టెంట్‌గా నోయల్ సేవ్ అయ్యాడు. ఈ సందర్భంగా నోయల్‌కి మరో ఆఫర్ ఇచ్చారు నాగార్జున. నీకు ఎవరినైనా సేవ్ చేసే అధికారం ఇస్తే ఎవర్ని కాపాడతావు అని అడిగారు. దీంతో హారిక పేరు చెప్పాడు నోయల్.
ఆ తరువాత నోయల్‌ని స్మిమ్మింగ్ పూల్‌లోకి దూకి ఓ కాయిన్‌ని తీసుకురావాలని, ఆ కాయిన్‌పై ఎవరి బొమ్మ ఉంటుందో వాళ్లు సేవ్ అయినట్టు అని నాగార్జున చెప్పారు. నోయల్ స్మిమ్మింగ్ పూల్‌లోకి దూకి కాయిన్ తీసుకువచ్చాడు. దానిపై హారిక ఫొటో ఉండటంతో ఈ వారం నామినేషన్స్ నుంచి ఆమె సేవ్ అయ్యింది. మొత్తంగా ఆరోవారం నామినేషన్స్‌లో ఉన్న తొమ్మది మందిలో నోయల్, హారిక, లాస్యలు సేవ్ అయ్యారు. మిగిలిన ఆరుగురిలో ఒకరు ఇవాళ ఎలిమినేట్ అవ్వబోతున్నారు. అయితే అరగుండు కొట్టించుకున్నందుకు మీరు సెల్ఫ్ సేవ్ అవుతారా..? లేక ఎవరినైనా సేవ్ చేస్తారా..? అని నాగార్జున అడగ్గా.. నన్ను నేను సేవ్ చేసుకుంటా అని చెప్పారు. దీంతో వచ్చే వారం ఎలిమినేషన్‌ని నుంచి మాస్టర్ సేవ్ అయ్యారు. అయితే ఈ వారం కుమార్ సాయి బయటకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
Read More:
Bigg Boss 4: మాస్టర్ అరగుండు.. ఆకాశానికెత్తేసిన నాగార్జున
అర్ధరాత్రి తెగిన బాలాపూర్ గుర్రం చెరువు కట్ట.. నడుంలోతు మునిగిన కాలనీలు