సోహైల్ క్యారక్టర్ బట్టబయలు చేసిన అతని మరదలు.. నిజంగానే అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేస్తాడా?..

బిగ్‏బాస్ సీజన్ ముగింపుకు ఇంకా రెండు వారాలే ఉన్నాయి. కాగా హౌస్‏లోని సభ్యులందరూ హోరాహోరీగా పోటి పడుతున్నారు. ఇందులో సింగరేణి ముద్దుబిడ్డ కూడా టైటిల్ రేసులో దూసుకుపోతున్నాడు.

సోహైల్ క్యారక్టర్ బట్టబయలు చేసిన అతని మరదలు.. నిజంగానే అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేస్తాడా?..
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 10, 2020 | 1:34 PM

బిగ్‏బాస్ సీజన్ ముగింపుకు ఇంకా రెండు వారాలే ఉన్నాయి. కాగా హౌస్‏లోని సభ్యులందరూ హోరాహోరీగా పోటి పడుతున్నారు. ఇందులో సింగరేణి ముద్దుబిడ్డ కూడా టైటిల్ రేసులో దూసుకుపోతున్నాడు. అయితే లవర్ బాయ్‏లా కనిపించే సోహైల్ మాత్రం ఇంట్లోని అమ్మాయిలను ఫ్లర్ట్ చేయాలని ఏమాత్రం ప్రయత్నించినట్టు కనబడడం లేదు. నిజంగానే సోహైల్ అలాగే ఉంటాడా లేక బిగ్‏బాస్ ఇంట్లోనే అలా నటిస్తున్నాడన్న అనుమానం లేకపోలేదు. అయితే ఈ విషయం అతని మరదలు క్లారిటీ ఇచ్చేసింది.

సోహైల్ మరదలు మాట్లాడుతూ.. “సోహైల్‏కి గేమ్ ప్లాన్ అంటే ఏం ఉండదు. ఫెయిర్ గేమ్ ఆడుతున్నాడు. మొదట్లో సోహైల్ కొత్తగా కనిపించాడు. అందరితో మాట్లాడుతూ కలివిడిగా ఉండటానికి ప్రయత్నిస్తాడు. ఒంటరిగా ఉండడం అసలు నచ్చదు. కాని నిజమైన సోహైల్ మాకు కనిపించడం లేదని చూశాం. కానీ తర్వాత అసలైన సోహైల్ బయటకు వచ్చాడు. కాగా సోహైల్ మొదటి నుంచి అగ్రెసివ్. తనకు చాలా కోపం వస్తుంది. కానీ కారణం ఉంటేనే సోహైల్ కోపానికి వస్తాడు. కానీ బిగ్‏బాస్ ప్రోమోలు టీజర్స్‏లో సోహైల్‏ని బాగా టెంపర్‏గా చూపిస్తున్నారు. దీంతో ప్రేక్షకులకు అతను చాలా కోపిష్టి అని డిసైడ్ అయిపోతున్నారు. కానీ అతనికి కోపం ఎందుకు వచ్చింది. కారణం ఏమై ఉంటుందని చూడటం లేదు.

ఇక అమ్మాయిల విషయానికి వస్తే.. సోహైల్ అమ్మాయిలకు బాగానే ఫ్లర్ట్ చేస్తాడు. కానీ బిగ్‏బాస్ హౌస్‏లో అలా ఉండడం లేదు. మేం కూడా వేయిట్ చేశాం. సోహైల్‏కి ఇంట్లో ఉన్నవాళ్ళలో ఎవరైనా కనెక్ట్ అవుతారా అని.. కానీ ఇంతవరకు ఎవరు కనెక్ట్ కాలేదు. అందర్ని సిస్టర్ అని పిలుస్తున్నాడు. బహుశా వాళ్ళలో ఆ కనెక్షన్ తనకి రాలేదేమో. ఖచ్చితంగా సోహైల్ టాప్ 1లో ఉంటాడని అనుకుంటున్నాం. రియల్‏గా సోహైల్ గేమ్ ఆడుతున్నాడు. అందుకే అతను బిగ్‏బాస్ విన్నర్ అవుతాడని అనుకుంటున్నాం” అని సోహైల్ మరదలు తెలిపింది.