బిగ్ బాస్ 3: ఎలిమినేట్ అయ్యేది ఆ ఇద్దరేనా.?

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 అప్పుడే రెండో వారం పూరి చేసుకుంది. ఎన్నో ట్విస్టులు.. మరెన్నో అద్భుతమైన టాస్క్‌లతో ఈ రియాలిటీ షో క్రమేపి ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. అటు టీఆర్పి రేటింగ్స్‌లో సత్తా చాటుతోందని చెప్పాలి. ఇది ఇలా ఉండగా ఇవాళ మరో ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైంది. దీంతో రెండో వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారనే అంశంపై సోషల్ మీడియాలో సర్వత్రా చర్చ జరుగుతోంది. శ్రీముఖి, మహేష్ విట్టా, వరుణ్ […]

బిగ్ బాస్ 3: ఎలిమినేట్ అయ్యేది ఆ ఇద్దరేనా.?
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 04, 2019 | 3:45 AM

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 అప్పుడే రెండో వారం పూరి చేసుకుంది. ఎన్నో ట్విస్టులు.. మరెన్నో అద్భుతమైన టాస్క్‌లతో ఈ రియాలిటీ షో క్రమేపి ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. అటు టీఆర్పి రేటింగ్స్‌లో సత్తా చాటుతోందని చెప్పాలి. ఇది ఇలా ఉండగా ఇవాళ మరో ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైంది. దీంతో రెండో వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారనే అంశంపై సోషల్ మీడియాలో సర్వత్రా చర్చ జరుగుతోంది.

శ్రీముఖి, మహేష్ విట్టా, వరుణ్ సందేశ్, వితిక షేరు, పునర్నవి, హిమజ, రాహుల్ సిప్లిగంజ్‌లు ఎలిమినేషన్స్‌లో ఉండగా.. వాళ్లలో శ్రీముఖి, మహేష్, రాహుల్, హిమజ సేఫ్ జోన్‌కు వెళ్లారు. ఇక మిగిలిన నలుగురిలో కంటెస్టెంట్లలో జర్నలిస్ట్ జాఫర్ డేంజర్ జోన్‌లో ఉన్నారని తెలుస్తోంది. అటు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నెట్టింట్లో వార్తలు వినిపిస్తున్నాయి. అలా అయితే వితిక షేరు, జాఫర్‌లు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.