బిగ్‌బాస్-3 విన్నర్‌ ఎవరో చెప్పిన.. జాఫర్

తెలుగు బిగ్‌బాస్ 3 హౌస్‌ రెండో వారంలోనే ఎలిమినేట్ అయ్యాడు జర్నలిస్ట్ జాఫర్. బయటకు వచ్చిన జాఫర్ టీవీ9కి ఇంటర్య్వూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జాఫర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు.. బిగ్‌బాస్‌ 2లోనే లోపలికి వెళ్లేందుకు ఆఫర్ వచ్చిందని.. కానీ అప్పుడు కుదరలేదని చెప్పారు. అందరూ అనుకుంటున్నట్టు బిగ్‌బాస్‌ హౌస్‌లో జరిగేదంతా స్క్రిప్టెడ్‌ అని అనుకుంటారు. కానీ.. నిజానికి అవి నిజమైన ఫీలింగ్స్ అని చెప్పాడు. అలాగే.. హౌస్‌లో గ్రూపులు ఫామ్‌ […]

బిగ్‌బాస్-3 విన్నర్‌ ఎవరో చెప్పిన.. జాఫర్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 08, 2019 | 4:01 PM

తెలుగు బిగ్‌బాస్ 3 హౌస్‌ రెండో వారంలోనే ఎలిమినేట్ అయ్యాడు జర్నలిస్ట్ జాఫర్. బయటకు వచ్చిన జాఫర్ టీవీ9కి ఇంటర్య్వూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జాఫర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు.. బిగ్‌బాస్‌ 2లోనే లోపలికి వెళ్లేందుకు ఆఫర్ వచ్చిందని.. కానీ అప్పుడు కుదరలేదని చెప్పారు. అందరూ అనుకుంటున్నట్టు బిగ్‌బాస్‌ హౌస్‌లో జరిగేదంతా స్క్రిప్టెడ్‌ అని అనుకుంటారు. కానీ.. నిజానికి అవి నిజమైన ఫీలింగ్స్ అని చెప్పాడు. అలాగే.. హౌస్‌లో గ్రూపులు ఫామ్‌ అయ్యాయని చెప్పారు. వితిక, వరుణ్, పునర్నవి, రాహుల్ ఓ గ్రూప్ అని పేర్కొన్నారు. అలాగే.. హౌస్ అందరూ మంచివాళ్లే కానీ.. సమయానుకూలంగా ఎవరు ఎలా స్పందిస్తారనేదే పాయింట్‌ అని చెప్పారు. అయితే.. బగ్‌బాస్‌ హౌస్‌లో తనకు శ్రీముఖి లాంటి ఓ అక్క, బాబా మాస్టర్ లాంటి ఓ మంచి మిత్రుడు దొరికాడని.. బాబానే విన్నర్ అవుతారని చెప్పారు జర్నలిస్ట్ జాఫర్.