‘బిగ్ బాస్’ స్ట్రాంగ్ వార్నింగ్.. ఆ ఇద్దరికీ షాక్!

అందరూ అనుకున్నట్లు గానీ గత వారం నానా హంగామా చేసిన తమన్నా సింహాద్రి ఆదివారం ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. దీనితో హౌస్‌లో మిగిలిన 13 మంది సభ్యులకు సోమవారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఇందులో ఊహించని విధంగా నామినేషన్స్ జరిగాయి. గతవారం జరిగిన టాస్క్‌లో భాగంగా రవికృష్ణ చేతి గాయానికి పరోక్షంగా కారణమైన శ్రీముఖి ఈ వారం డైరెక్ట్‌గా నామినేట్ అయింది. అటు సీక్రెట్ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేయడంతో అలీ, పునర్నవి […]

'బిగ్ బాస్' స్ట్రాంగ్ వార్నింగ్.. ఆ ఇద్దరికీ షాక్!
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 13, 2019 | 1:03 PM

అందరూ అనుకున్నట్లు గానీ గత వారం నానా హంగామా చేసిన తమన్నా సింహాద్రి ఆదివారం ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. దీనితో హౌస్‌లో మిగిలిన 13 మంది సభ్యులకు సోమవారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఇందులో ఊహించని విధంగా నామినేషన్స్ జరిగాయి. గతవారం జరిగిన టాస్క్‌లో భాగంగా రవికృష్ణ చేతి గాయానికి పరోక్షంగా కారణమైన శ్రీముఖి ఈ వారం డైరెక్ట్‌గా నామినేట్ అయింది.

అటు సీక్రెట్ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేయడంతో అలీ, పునర్నవి నామినేషన్ నుంచి తప్పించుకున్నారు. ఇక మిగిలిన 10 మంది సభ్యులను బిగ్ బాస్.. జంటలుగా కన్ఫెషన్ రూమ్‌లోకి ఆహ్వానించాడు. ఈ క్రమంలో రూమ్‌లోకి వెళ్లిన శివజ్యోతి, రోహిణి.. నామినేషన్స్‌లో భాగంగా బిగ్ బాస్‌ను విసిగించడంతో.. నియమాలను ఉల్లంఘించినందుకు గానూ ఇద్దరినీ డైరెక్ట్‌గా నామినేట్ చేయడమే కాకుండా వచ్చేవారం కూడా నామినేషన్స్‌లో ఉంచుతూ షాకిచ్చాడు. దీనికి ఇద్దరూ ఒకింత నిరుత్సాహం చెందారు.

ఇక మిగిలిన కంటెస్టెంట్లలో వరుణ్, రాహుల్, బాబా భాస్కర్ నామినేట్ అయ్యారు. మొత్తానికి ఈ వారం ఎలిమినేషన్‌లో శ్రీముఖి- రవి- రోహిణి- శివజ్యోతి- వరుణ్- రాహుల్- బాబా భాస్కర్ నామినేట్ అయ్యారు. అటు వచ్చే వారానికి కూడా శివజ్యోతి- రోహిణిలు నామినేట్ అయ్యారు. మరి చూడాలి ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్లే నామినేట్ కావడంతో ఈ వారం ఎవరు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతారో.?