హౌస్‌లో బక్రీద్ సంబరాలు: ఏడ్చేసిన ఇంటిసభ్యులు
బిగ్‌బాస్.. ఇక్కడ ఏమైనా జరగవచ్చు.. అన్నట్టుగా.. తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3లో చిత్ర విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముందునుంచీ ఈ షోకి భారీ హైప్ తెచ్చిన విషయం తెలిసిందే. కానీ.. బిగ్‌బాస్ సీజన్ 3 మాత్రం.. ఫుల్ కాంట్రవర్సిటీల మధ్య సాగుతోంది. ఇప్పటికీ ఈ వివాదాలు చల్లారలేదనుకోండి. కాగా.. బక్రీద్ సందర్భంగా బిగ్‌బాస్ హౌస్‌లో.. సంబరాలు నిర్వహించారు. దీంతో.. ఇంటి సభ్యులందరూ.. ఫుల్ కుషీ అయ్యారు. ఒకరికొకరు హగ్ చేసుకుంటూ.. విషెస్ చెప్పుకుంటూ.. డాన్స్‌లతో హంగామా చేశారు. […]
బిగ్‌బాస్.. ఇక్కడ ఏమైనా జరగవచ్చు.. అన్నట్టుగా.. తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3లో చిత్ర విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముందునుంచీ ఈ షోకి భారీ హైప్ తెచ్చిన విషయం తెలిసిందే. కానీ.. బిగ్‌బాస్ సీజన్ 3 మాత్రం.. ఫుల్ కాంట్రవర్సిటీల మధ్య సాగుతోంది. ఇప్పటికీ ఈ వివాదాలు చల్లారలేదనుకోండి.
కాగా.. బక్రీద్ సందర్భంగా బిగ్‌బాస్ హౌస్‌లో.. సంబరాలు నిర్వహించారు. దీంతో.. ఇంటి సభ్యులందరూ.. ఫుల్ కుషీ అయ్యారు. ఒకరికొకరు హగ్ చేసుకుంటూ.. విషెస్ చెప్పుకుంటూ.. డాన్స్‌లతో హంగామా చేశారు. పండుగ సందర్భంగా.. కంటెస్టెంట్స్ అందరికీ బిగ్ బాస్ సర్‌ప్రైజ్ చేశారు. కంటెస్టెంట్స్.. చిన్నప్పటి ఫొటోలు.. వారి కుటుంబసభ్యుల ఫొటోలను చూపించేసరికి.. అందరూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. వాళ్ల వాళ్ల.. ఫ్యామిలీ ఫొటోలు వచ్చేసరిగా.. అందరినీ తలుచుకొని ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. శివజ్యోతి, అషు రెడ్డి, శ్రీముఖి, రోహిణి వాళ్ల పేరెంట్స్ గురించి చెప్పుకొని ఏడ్చేశారు. ముఖ్యంగా శివజ్యోతి.. నాన్న నువ్వు మళ్లీ నాకే పుట్టాలంటూ.. కన్నీళ్లు పెట్టుకుంది.
ఇంత హంగామా మధ్య బిగ్‌బాస్ ఎలిమినేషన్ కూడా.. సర్‌ప్రైజ్‌గానే ఉంది. ఇద్దరిద్దరు జంటా వెళ్లి.. ఒకరు నామినేషన్ చేసుకోవాలని బిగ్ బాస్ ఆదేశించడంతో.. అందరూ.. జంటలుగా కంటెస్టెంట్ రూమ్‌కి వెళ్లారు. ఈవారం ఎలిమినేషన్‌లో.. రవి, వరుణ్, బాబా మాస్టర్, శివజ్యోతి, శ్రీముఖి, రాహుల్‌లు ఉన్నారు.