వరుణ్, వితికల రొమాన్స్.. మధ్యలో రాహుల్ ఎంట్రీ!
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 రోజుకో ట్విస్ట్‌తో రసవత్తరంగా సాగుతోంది. గత సీజన్ల కంటే ఈ సీజన్ అధిక టీఆర్పీ రేటింగ్స్‌తో ప్రేక్షకాదరణ పొందుతోంది. కొన్ని గొడవలు, కొంత ఎమోషనల్‌గా.. ఇంకొంత రొమాంటిక్‌గా ఇలా అన్ని జనాల్లో కాకా రేపుతున్నాయి. ఇక సోమవారం ఎపిసోడ్ గురించి మాట్లాడితే.. కొంత వాగ్వాదం జరిగినా.. భార్యాభర్తలైన వరుణ్ సందేశ్, వితిక షేరు మధ్య రొమాన్స్ అభిమానుల్లో వేడిని రాజేసింది. బెడ్ రూమ్‌లో ఎవరు లేని […]
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 రోజుకో ట్విస్ట్‌తో రసవత్తరంగా సాగుతోంది. గత సీజన్ల కంటే ఈ సీజన్ అధిక టీఆర్పీ రేటింగ్స్‌తో ప్రేక్షకాదరణ పొందుతోంది. కొన్ని గొడవలు, కొంత ఎమోషనల్‌గా.. ఇంకొంత రొమాంటిక్‌గా ఇలా అన్ని జనాల్లో కాకా రేపుతున్నాయి. ఇక సోమవారం ఎపిసోడ్ గురించి మాట్లాడితే.. కొంత వాగ్వాదం జరిగినా.. భార్యాభర్తలైన వరుణ్ సందేశ్, వితిక షేరు మధ్య రొమాన్స్ అభిమానుల్లో వేడిని రాజేసింది.
బెడ్ రూమ్‌లో ఎవరు లేని సమయంలో వితిక, వరుణ్‌లు చిన్నపాటి రొమాన్స్ చేశారు. హౌస్‌లోకి ఎంటరైనప్పటి నుంచి తనను సరిగ్గా పట్టించుకోవట్లేదని వితిక కంప్లైంట్ చేయగా.. అలాంటిదేమి లేదంటూ వరుణ్.. వితికను బుజ్జగించడం మొదలు పెట్టారు. అంతేకాకుండా వీరి నాటు రొమాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
ఆ తర్వాత కపుల్ కొంచెం ఫార్వర్డ్ అయి ముద్దు.. మురిపెంతో లైట్ రొమాన్స్ చేశారు. ఇక ఈ సమయంలోనే సడన్‌గా లోపలికి ఎంట్రీ ఇచ్చిన రాహుల్.. వాళ్ళను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక.. అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇది ఇలా ఉండగా హౌస్‌లో ఈద్ వేడుకలు కూడా జరిగాయి. ఈ సందర్భంగా ఇంటి సభ్యులకు సంబంధించిన ఫ్యామిలీ ఫోటోలను చూపించడంతో కొంత భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఈద్ విందును ఏర్పాటు చేశారు. ఇలా సోమవారం బిగ్ బాస్‌లో ఎమోషనల్ టచ్‌తో కొంచెం రొమాన్స్‌తో కూడిన ఫ్యామిలీ డ్రామా నడిచిందని చెప్పవచ్చు.