వితిక ఎలిమినేట్‌.. ఎమోషనల్‌ అయిన వరుణ్ సందేశ్

బుల్లితెర తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌3’ నుంచి నటి, వరుణ్‌ సందేశ్‌ భార్య వితిక ఎలిమినేట్‌ అయ్యింది. ఈ వారం నామినేషన్‌లో ఉన్నవారిలో వితికకు ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమె బిగ్‌బాస్‌ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. భార్య తనను వదిలిపెట్టి ఇంటిలో నుంచి వెళ్లిపోతుంటే వరుణ్ సందేశ్ ఎమోషనల్ అయ్యాడు. అతన్ని చూసి వితిక కూడా ఏడ్చేసింది. ‘మా ఆయన్ను జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ మిగిలిన […]

వితిక ఎలిమినేట్‌.. ఎమోషనల్‌ అయిన వరుణ్ సందేశ్

బుల్లితెర తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌3’ నుంచి నటి, వరుణ్‌ సందేశ్‌ భార్య వితిక ఎలిమినేట్‌ అయ్యింది. ఈ వారం నామినేషన్‌లో ఉన్నవారిలో వితికకు ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమె బిగ్‌బాస్‌ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. భార్య తనను వదిలిపెట్టి ఇంటిలో నుంచి వెళ్లిపోతుంటే వరుణ్ సందేశ్ ఎమోషనల్ అయ్యాడు. అతన్ని చూసి వితిక కూడా ఏడ్చేసింది. ‘మా ఆయన్ను జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ మిగిలిన కంటెస్టెంట్లకు చెప్పి వరుణ్‌కు కిస్ ఇచ్చి వెళ్లిపోయింది వితిక. ఆ తరవాత స్టేజ్ మీదికి వచ్చిన వితికాకు తన జర్నీ మొత్తాన్ని చూపించారు నాగార్జున. ఈ 90 రోజుల్లో ఇన్ని ఎమోషన్స్ తాను ఫీలయ్యానని స్క్రీన్ మీద చూస్తే కానీ తెలియలేదని వితిక అంది.  చివరిగా బిగ్ బాంబ్‌ను రాహుల్‌పై వేసింది. ఈ బాంబ్ ఏంటంటే.. బిగ్ బాస్ ఆపమని చెప్పేంత వరకు ఇంట్లోని బాత్‌రూంలు అన్నింటినీ రాహుల్ ఒక్కడే క్లీన్ చేయాలి.

వితిక ఎలిమినేషన్‌ను ముందే ఊహించిందా?

అయితే, ఈ వారం తాను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోతానని వితిక ముందే ఊహించింది. అది ఎలాగంటారా? బిగ్ బాస్‌లో శనివారం జరిగిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ వచ్చారు. ఈ సందర్భంగా వితిక తల్లి కూడా వచ్చారు. ఆ సమయంలో తన తల్లితో మాట్లాడిన వితిక.. ఓ విధమైన భావోద్వేగానికి గురైంది. ఆ సందర్భంగా తన తల్లిని ఏడవొద్దని చెబుతూ.. ‘ఏడవొద్దు. నేను రెండు వారాల్లో వచ్చేస్తా కదా. రేపు కూడా వచ్చేయొచ్చు.’ అని చెప్పింది. అంటే, ఎలిమినేషన్‌లో ఉన్న తాను బయటకు వెళ్లాల్సిన పరిస్థితి తప్పకపోవచ్చని ముందే ఊహించింది. దీంతో మానసికంగా సిద్ధమైనట్టు కనిపిస్తోంది.

సరదాగా సాగిన ఎపిసోడ్:

ముందుగా  ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌ నాగార్జున కంటెస్టెంట్స్‌కు పెద్ద టాస్కే వచ్చాడు. అందులో భాగంగా శ్రీముఖి.. ఛార్మి నటించిన ‘అనగనగా ఒక రోజు’ సినిమాలోని పాటకు డాన్స్ చేసింది. మరోవైపు వితికా షేరు.. ‘మిస్టర్ ఫర్ఫెక్ట్’ సినిమాలోని అగ్గిపుల్ల లాంటి పాటకు డాన్స్ చేస్తే.. రాహుల్ .. ‘ముఠామేస్త్రీ’ లోని టైటిల్ సాంగ్‌కు చిందేసాడు. శివజ్యోతి కూడా చందమామ పాటకు డాన్స్ చేసింది. అలీ రెజా, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్‌ తమకిచ్చిన పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేసాడు. ఇంకోవైపు కళ్లకు గంతలు కట్టుకొనే టాస్క్‌లో వితికా,వరుణ్ సందేశ్ బాల్స్‌తో ఆడుకోవడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక అలీ రజా, రాహుల్ కళ్లకు గంతలతో ఒకరినొకరు గుద్దుకున్నారు. ఈ క్రమంలో అందరి కళ్లకు గంతలు కట్టుకొని ఈ స్కిట్స్ చేసారు.

కాగా ఈ రోజుతో బిగ్‌బాస్‌ షో  12 వారాలు పూర్తి చేసుకుంది. మరో రెండు వారాల్లో బిగ్‌బాస్ సీజన్ 3 తెలుగుకు ముగింపు పలకనున్నారు. పదమూడో వారం నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా ‘టాపర్‌ ఆఫ్‌ ది హౌస్‌’ టాస్క్‌ను నిర్వహించగా, అది కాస్తా పక్కదారి పట్టి, వ్యక్తిగత దూషణల వరకూ వెళ్లింది. దీంతో హౌస్‌లోని వారందరినీ నామినేట్‌ చేస్తూ బిగ్‌బాస్‌ షాకిచ్చాడు.

 

Click on your DTH Provider to Add TV9 Telugu