బిగ్ బాస్ 13: ఆ హిందీ నటుడికి.. కౌశల్‌కి మధ్య లింకేంటి.?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2ను ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోరు . హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు కౌశల్‌ను టార్గెట్ చేయడంతో.. ‘కౌశల్ ఆర్మీ’ మొత్తం సీజన్‌ను ఎంతలా డామినేట్ చేసిందో అందరికి తెలిసిన విషయమే. కౌశల్‌కు ఎదురు తిరిగితే చాలు.. ఆ కంటెస్టెంట్ ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోయినట్లే. ఆఖరికి కౌశల్‌ను టార్గెట్ చేశాడని హోస్ట్ నానికి కూడా విరుద్ధంగా అప్పట్లో నెగటివ్ పబ్లిసిటీ కూడా జరిగింది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నానని అనుకుంటున్నారా.. సరిగ్గా కౌశల్ […]

బిగ్ బాస్ 13: ఆ హిందీ నటుడికి.. కౌశల్‌కి మధ్య లింకేంటి.?
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 20, 2019 | 5:45 PM

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2ను ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోరు . హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు కౌశల్‌ను టార్గెట్ చేయడంతో.. ‘కౌశల్ ఆర్మీ’ మొత్తం సీజన్‌ను ఎంతలా డామినేట్ చేసిందో అందరికి తెలిసిన విషయమే. కౌశల్‌కు ఎదురు తిరిగితే చాలు.. ఆ కంటెస్టెంట్ ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోయినట్లే. ఆఖరికి కౌశల్‌ను టార్గెట్ చేశాడని హోస్ట్ నానికి కూడా విరుద్ధంగా అప్పట్లో నెగటివ్ పబ్లిసిటీ కూడా జరిగింది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నానని అనుకుంటున్నారా.. సరిగ్గా కౌశల్ మాదిరిగానే రీసెంట్‌గా హిందీ బిగ్ బాస్‌లో ఓ కంటెస్టెంట్.. ఇతర కంటెస్టెంట్ల దగ్గర నుంచి తీవ్ర వ్యతిరేకత పొందుతున్నాడు. అతనెవరో కాదు బుల్లితెరలో ఫేమస్ అయిన హీరో సిద్ధార్థ్ శుక్లా.

ఎన్నో కాంట్రవర్సీల నడుమ ఇటీవలే మొదలైన హిందీ బిగ్ బాస్.. ప్రస్తుతం లోయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్‌తో దిగువన ఉంది. ఇక ఈ షోలో చెప్పుకోదగ్గ కంటెస్టెంట్ల విషయానికి వస్తే.. ముఖ్యంగా రష్మీ దేశాయ్, సిద్ధార్థ్ శుక్లా పేర్లు గట్టిగా వినిపిస్తాయి. పలు హిందీ సీరియల్స్‌లో నటించిన ఈ జంటకు బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అంతేకాక ఇద్దరూ ఇప్పుడు మాజీ లవర్స్. ఇప్పుడు హౌస్‌లోకి చేరారు. దీనితో ప్రేక్షకుల్లో ఒకింత ఆసక్తి కలుగుతుంది. అయితే వారందరికి షాక్ కలిగిస్తూ.. బిగ్ బాస్ వీళ్లిద్దరి మధ్య గొడవలు పెడుతున్నాడు. ప్రతీ టాస్క్‌లో కూడా రష్మీ.. సిద్దార్థ్‌లోని తప్పుడు యాంగిల్‌నే ఎత్తి చూపుతూ.. ఇతర కంటెస్టెంట్ల దగ్గర అతని మీద వ్యతిరేకతను పెంచుతోంది.

ఇదిలా ఉండగా సిద్ధార్థ్ దూకుడుతనం.. అచ్చం కౌశల్ మాదిరిగా ఉండటంతో మిగిలినవారంతా కొంచెం ఇబ్బందికి గురవుతున్నారు. టాస్క్ విషయంలో కమాండింగ్‌గా వ్యవహరిస్తున్నాడని అంటున్నారు. తనది మాత్రమే కరెక్ట్ మిగిలిన వారిది తప్పు అని ఎత్తి చూపుతున్నాడని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అయితే నెటిజన్లు మాత్రం సిద్ధార్థ్ శుక్లా ఆడే ఆటను ఆస్వాదిస్తూ.. అతనికి ఎక్కువగా ఓట్లు వేసి గెలిపిస్తున్నారు. అంతేకాకుండా సిద్ధార్థ్‌ను అందరూ కార్నర్ చేస్తున్నారని వారి అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా మిగిలిన కంటెస్టెంట్లు సిద్దార్థ్ శుక్లాను ఇలాగే కార్నర్ చేస్తే.. ‘వార్’ ఖచ్చితంగా వన్ సైడ్ అయిపోయినట్లే.