అవును ‘బిగ్‌బాస్‌’లోకి వెళ్తున్నా.. కన్ఫర్మ్ చేసిన యాంకర్..!

ఓ వైపు షో ప్రారంభం కావడానికి మూడు రోజుల సమయముంది. మరోవైపు వివాదాలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ‘బిగ్‌బాస్ 3’ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ సారి హౌస్‌లో ఎవరెవరు వెళ్తున్నారా..? అన్నది హాట్ టాపిక్‌గా మారింది. అటు యాజమాన్యం.. ఇటు కంటెస్టెంట్లు కూడా దీన్ని సీక్రెట్‌గా ఉంచుతున్నారు. అయితే తాజాగా ఓ ప్రముఖ యాంకర్ బిగ్‌బాస్‌లోకి తన ఎంట్రీని కన్ఫర్మ్ చేసింది. ఓ ఛానెల్‌లో వచ్చే తీన్‌మార్ షోతో అందరినీ మెప్పించిన సావిత్రక్క […]

అవును ‘బిగ్‌బాస్‌’లోకి వెళ్తున్నా.. కన్ఫర్మ్ చేసిన యాంకర్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Jul 18, 2019 | 7:59 PM

ఓ వైపు షో ప్రారంభం కావడానికి మూడు రోజుల సమయముంది. మరోవైపు వివాదాలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ‘బిగ్‌బాస్ 3’ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ సారి హౌస్‌లో ఎవరెవరు వెళ్తున్నారా..? అన్నది హాట్ టాపిక్‌గా మారింది. అటు యాజమాన్యం.. ఇటు కంటెస్టెంట్లు కూడా దీన్ని సీక్రెట్‌గా ఉంచుతున్నారు. అయితే తాజాగా ఓ ప్రముఖ యాంకర్ బిగ్‌బాస్‌లోకి తన ఎంట్రీని కన్ఫర్మ్ చేసింది.

ఓ ఛానెల్‌లో వచ్చే తీన్‌మార్ షోతో అందరినీ మెప్పించిన సావిత్రక్క అలియాస్ శివజ్యోతి ఈ సారి బిగ్‌బాస్‌లోకి వెళ్లనుంది. ఈ విషయాన్ని తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో వెల్లడించింది. అందులో తాను న్యూస్ ఛానెల్ నుంచి తప్పుకోవడానికి గల కారణాలను చెప్పడంతో పాటు.. బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళుతున్నట్లు కూడా చెప్పేసింది. అయితే కారణాలు తెలీవు గానీ.. ఈ వీడియోను తరువాత ఆమె తొలగించింది. అయితే అప్పటికే ఆ వీడియో వైరల్ కావడంతో సావిత్రి బిగ్‌బాస్ ఎంట్రీ కన్ఫర్మ్ అయింది.

కాగా ఈ సారి షోలో మొత్తం 15మంది కంటెస్టెంట్లు పాల్గొననున్నారు. వందరోజులు పాటు ఈ షో జరగనుంది. ఇక ఇందులో సావిత్రితో పాటు యాంకర్ శ్రీముఖి, నటి హేమ, వరుణ్ సందేశ్, ఆయన భార్య వితికా షేరు, జర్నలిస్ట్ జాఫర్, ఉయ్యాల జంపాల ఫేమ్ పునర్నవి భూపాలం, నటి హిమజ, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తదితరులు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ షో నిర్వాహకులు తమతో అభ్యంతరంగా ప్రవర్తించి.. లైంగికంగా వేధించారని జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.