‘బిగ్‌బాస్’ వివాదం మీకు కనబడలేదా? సామ్, చిన్మయిపై సెటైర్లు

అప్పుడప్పుడు మనకు సంబంధం లేని విషయాల్లో కూడా మనం మాటలు పడాల్సి వస్తుంది. ఇంక సెలబ్రిటీలకయితే అది కొత్త కాదు. అనవసరమైన వాటికి కూడా కొంతమంది నెటిజన్లు సెలబ్రిటీలను లాగేస్తుంటారు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నామనుకుంటున్నారా..? ఎందుకంటే ‘బిగ్‌బాస్’ వివాదం ఇప్పుడు సమంత, చిన్మయి దాకా వచ్చింది. బిగ్‌బాస్ వివాదంపై సామ్, చిన్మయి ఎందుకు స్పందించడం లేదంటూ నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు. బిగ్‌బాస్ పేరిట మహిళలను మోసం చేస్తూ లైంగిక దాడులకు పాల్పడుతున్నారని ఇన్ని ఆరోపణలు […]

‘బిగ్‌బాస్’ వివాదం మీకు కనబడలేదా? సామ్, చిన్మయిపై సెటైర్లు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 18, 2019 | 5:11 PM

అప్పుడప్పుడు మనకు సంబంధం లేని విషయాల్లో కూడా మనం మాటలు పడాల్సి వస్తుంది. ఇంక సెలబ్రిటీలకయితే అది కొత్త కాదు. అనవసరమైన వాటికి కూడా కొంతమంది నెటిజన్లు సెలబ్రిటీలను లాగేస్తుంటారు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నామనుకుంటున్నారా..? ఎందుకంటే ‘బిగ్‌బాస్’ వివాదం ఇప్పుడు సమంత, చిన్మయి దాకా వచ్చింది. బిగ్‌బాస్ వివాదంపై సామ్, చిన్మయి ఎందుకు స్పందించడం లేదంటూ నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

బిగ్‌బాస్ పేరిట మహిళలను మోసం చేస్తూ లైంగిక దాడులకు పాల్పడుతున్నారని ఇన్ని ఆరోపణలు వస్తుంటే మీరిద్దరు ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. అన్నింటిమీదా మాట్లాడే చిన్మయి ఈ విషయం మీద ఎందుకు మాట్లాడటం లేదంటూ నెటిజన్లు వారిని ఆడేసుకుంటున్నారు. కాగా మహిళల పట్ల లైంగిక దాడికి పాల్పడుతున్నారంటూ గతంలో చిన్మయి పోరాటం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె చేసిన పోరాటానికి సమంత కూడా అండగా నిలుస్తూ ట్వీట్లు చేసింది. ఇప్పుడు మహిళల లైంగిక దాడుల మీద అంతగా మాట్లాడిన సామ్, చిన్మయిలు ఇప్పుడు ఎందుకు నోరు విప్పడం లేదు. మామ నాగార్జున హోస్ట్‌గా చేస్తున్నాడని సామ్.. ఆయనతో(నాగార్జున) తన భర్త(రాహుల్ రవీంద్రన్) సినిమా తీశాడని చిన్మయి నోర్లు విప్పడం లేదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మీకు జరిగితే ఒకటి.. వేరే వాళ్లకు జరిగితే మరొకటా వారిద్దరిని తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.