Big News Big Debate: ప్రకాష్ రాజ్ వెర్సస్ మంచు విష్ణు.. సిని’మా’లో ముదిరిన యుద్ధం..
భావోద్వేగం. ఆవేదన. ఆవేశం. అన్నీ కలగలిపిన ప్రకాశ్‌రాజ్‌ను సినిమాల్లో చాలాసార్లు చూశాం. ఫస్ట్ టైం మా ఎన్నికల్లో రియల్ లైఫ్‌లో కూడా అలాంటి...
భావోద్వేగం. ఆవేదన. ఆవేశం. అన్నీ కలగలిపిన ప్రకాశ్‌రాజ్‌ను సినిమాల్లో చాలాసార్లు చూశాం. ఫస్ట్ టైం మా ఎన్నికల్లో రియల్ లైఫ్‌లో కూడా అలాంటి ఎక్స్‌ప్రెషన్ కనిపించింది. పోస్టల్ బ్యాలెట్‌లో కుట్ర జరిగిందని.. మా ఎన్నికల్లో దిగజారి గెలవాలా అంటూ మంచు విష్ణు ప్యానల్‌పై మండిపడ్డారు. ఎన్నికల్లో ఇవన్నీ కామన్ అని తెలియదా అంటూ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు విష్ణు. అసలే వ్యక్తిగత ధూషణలతో హద్దులు దాటిన మా ఎపిసోడ్‌లో… తాజా పరిణామాలు మరింత అగ్గి రాజేశాయి.
ఏకగ్రీవం కానప్పుడు ఎన్నికల్లో విజయం కోసం ఎత్తులు పైఎత్తులూ సహజమే. ఇందుకు మా అసోసియేషన్ కూడా అతీతం కాదని అర్థమవుతోంది. పట్టుదలకు పోతే ప్యానళ్ల మధ్య పోటీ ఎలా ఉంటుందో సరికొత్తగా రియల్ సినిమా చూపిస్తున్నారు. విమర్శలు పదునెక్కాయి. ఆరోపణలు శృతిమంచాయి. వ్యక్తిగత దూషణల్లో సరిహద్దులు చెరిపేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బ్యాలెట్‌పైనా ఫైటింగ్‌కు క్లాప్ కొట్టారు. పోస్టల్ బ్యాలెట్ తెరమీదకు రావడంతో విష్ణు ప్యానల్ రంగంలోకి దిగింది. 60ఏళ్లు దాటిన వారి సంతకాలు తీసుకుని వారి పేరుతో మంచు ప్యానల్ మనీ కూడా పే చేసింది. దీనిని ఆలస్యంగా అర్థం చేసుకున్న ప్రకాష్‌రాజ్ కుట్ర, కుతంత్రం అంటూ ఫిర్యాదులు చేశారు. ఇంత అన్యాయం జరుగుతుంటే చిరంజీవి, కృష్ణంరాజు, నాగార్జున మాట్లాడరా అంటూ ఆవేదన వెళ్లగక్కారు. జీవిత ఓ అడుగు ముందుకేసి గెలుపు మాదే అంటూ మీరు చేస్తున్న ప్రచారానికి అర్థం ఇదేనా విష్ణు అంటూ ప్రశ్నించారు.
ప్రకాష్‌రాజ్ ప్యానల్ ఫిర్యాదు తర్వాత డబ్బు వాపస్ ఇచ్చిన అసోసియేషన్… వ్యక్తిగతంగా పే చేస్తేనే పోస్టల్ బ్యాలెట్ పంపుతామంటూ క్లారిటీ ఇచ్చారు ఎన్నికల అధికారి. దీంతో వివాదం సర్దుమణిగినా.. విష్ణు మాటల మంటలను కంటిన్యూ చేస్తున్నారు. ప్రకాష్‌రాజ్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. మరోసారి నా కుటుంబం గురించి మాట్లాడితే సహించేది లేదని.. దమ్ముంటే మొగాడివైతే నాతో తేల్చుకోవాలంటున్నారు విష్ణు. ప్రకాష్‌రాజ్ కు మతిస్థిమితం లేదా అంటూ నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు పూర్తయ్యేలోగా వీరిమధ్య ఎన్ని మాటల యుద్ధాలు చూడాల్సి వస్తుందో. కులగోత్రాలు, గుణగణాలు, ప్రాంతాలు, భాషలు అబ్బో ఒకటేమిటి అన్నీ తెరమీదకు వచ్చాయి. తిట్టుకోవడానికి ఇంకా ఏం మిగిలాయో.. రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి డైలాగ్‌లు పేలుస్తారో చూద్దాం.