Big News Big Debate: తెలుగురాష్ట్రాల్లో మళ్లీ సెంటిమెంట్‌ రాజుకుంటోందా?

కామన్‌ కేపిటల్‌ గడువు ముగుస్తున్న వేళ హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలు తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఉమ్మడి రాజధాని గడువు పెంచేందుకు కుట్ర జరుగుతుందన్నారు మాజీ మంత్రి. అయితే ఇదంతా ఎన్నికల స్టంట్‌ అని కాంగ్రెస్‌ అంటోంది. యూటీ, కామన్‌ కేపిటల్‌ చర్చే లేదంటోంది బీజేపీ.

Big News Big Debate:  తెలుగురాష్ట్రాల్లో మళ్లీ సెంటిమెంట్‌ రాజుకుంటోందా?
Big News Big Debate
Follow us
Ram Naramaneni

|

Updated on: May 03, 2024 | 7:28 PM

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్‌. తాజాగా బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు చేసిన కామెంట్‌ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా మరికొంత కాలం పొడిగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి. ఇప్పుడు జరుగుతున్నవి తెలంగాణ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలన్నారు. తెలంగాణ కోసం ఢిల్లీలో కొట్లాడే గులాబీ జెండాను గెలిపించుకోవాలన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులో హైదరాబాద్‌ను పదేళ్లపాటు తెలంగాణ, ఏపీరాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. 2024, జూన్‌ 1తో ఆ గడువు ముగియనుంది. వందశాతం తెలంగాణ సొంతం కాబోతోంది. సరిగ్గా గడువు ముగుస్తున్న సమయంలోనే పార్లమెంట్‌ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భాగ్యనగరం కూడా ఎన్నికల ఎజెండాగా మారింది. రాజధాని లేని ఏపీ నేతలు హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా లేదంటే ఉమ్మడి రాజధానిగా కొనసాగించే కుట్రలు చేస్తున్నారన్నది బీఆర్ఎస్‌ అనుమానం. ఓట్లు దండుకోవడం కోసం ఉమ్మడి రాజధాని నినాదం వినిపిస్తున్నారంటోంది కాంగ్రెస్‌. యూటీ చేయాలన్నది కేటీఆర్‌ కోరిక అయి ఉంటుందని.. అలాంటి చర్చే ఎక్కడా లేదంటోంది బీజేపీ.

కొద్ది వారాల క్రితం ఏపీలోనూ కొందరు నేతలు ఉమ్మడి రాజధాని అంశాన్ని చర్చకు పెట్టడంతో పెనుసంచలనంగా మారింది. ఇప్పుడు తెలంగాణలోనూ అదే ఎన్నికల నినాదంగా మారుతోంది. మరి నిజంగానే హైదరాబాద్‌పై జాతీయస్థాయిలో చర్చ జరుగుతోందా? ఓట్ల వేటలో భాగంగా పార్టీలు రచ్చ చేస్తున్నాయా?.. ఈ రోజు బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో చూద్దాం.

మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం