Big News Big Debate: ఏపీ రుణాలపై జరుగుతోంది విష ప్రచారమేనా?.. సర్కారు చేసే అప్పులు తప్పా? ఒప్పా?

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: Sep 03, 2021 | 8:49 PM

APలో అప్పులపై పెద్ద యుద్ధమే నడుస్తోంది. రాష్ట్రంలో ఆర్ధిక ఎమర్జెన్సీ వస్తుందా. విపక్షాలు చేస్తున్నట్టు అంత దయనీయంగా పరిస్థితులున్నాయా.? పేదల సంక్షేమానికి అప్పో సప్పో చేసి ఖర్చు చేస్తుంటే కుట్రలు చేస్తున్నారన్నది అధికారపార్టీ వాదన.

Big News Big Debate: ఏపీ రుణాలపై జరుగుతోంది విష ప్రచారమేనా?.. సర్కారు చేసే అప్పులు తప్పా? ఒప్పా?
Ap Debts Big Debate

Follow us on

APలో అప్పులపై పెద్ద యుద్ధమే నడుస్తోంది. రాష్ట్రంలో ఆర్ధిక ఎమర్జెన్సీ వస్తుందా. విపక్షాలు చేస్తున్నట్టు అంత దయనీయంగా పరిస్థితులున్నాయా.? పేదల సంక్షేమానికి అప్పో సప్పో చేసి ఖర్చు చేస్తుంటే కుట్రలు చేస్తున్నారన్నది అధికారపార్టీ వాదన. అప్పులపై విపక్షాలు చేస్తున్న రాద్ధాంతంపై CM జగన్‌ క్లారిటీ ఇచ్చారు. కరోనా సమయంలో ఆదాయం తగ్గిపోయినా సంక్షేమ పథకాలు ఆపకుండా అప్పొ సప్పో చేసి కూడా అమలు చేస్తుంటే వక్రీకరించి మరీ విష ప్రచారం చేయడం తగదన్నారు జగన్‌.

విపక్షాల వాదనేంటి?

దేశంలో అత్యధికంగా అప్పులు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ ఉందని.. ఆర్ధికంగా రాష్ట్రం దివాళ తీయడం ఖాయమంటూ విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అసెట్‌ క్రియేట్‌ చేయకుండా అప్పులు చేసుకుంటూ పోవడంపై కేంద్రానికి ఫిర్యాదు కూడా చేసింది ఏపీ బీజేపీ. ఇటీవల ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి జగన్‌ ప్రభుత్వంపై ఫిర్యాదులు చేసింది కమల దండు. ఇటీవల ఆంధ్రా టూర్‌కు వచ్చిన కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి AP ఆర్థిక పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

సజ్జల కామెంట్

ప్రభుత్వం చేస్తున్న అప్పులనే ప్రధానాస్త్రంగా చేసుకుంది విపక్ష TDP. AP దివాళా తీసిందంటూ విమర్శలు చేస్తోంది. విపక్షాల ఆరోపణలకు ప్రభుత్వం ఘాటుగా స్పందిస్తోంది. విభజన నాటిని అప్పులపై వడ్డీలు 4వేల కోట్లు ఉంటే.. చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులకు 30వేల కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుందన్నారు ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి.

ఇంతకీ రాష్ట్రం చేసిన అప్పులు ఎంతో తెలుసా?

Ap Debtsఇతర రాష్ట్రాలు, కేంద్రం సంగతేంటి?

Center Debt

 

GSDPతో పోల్చితే అప్పుల శాతం…

Gsdp

ఏపీలో కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాలు అన్నీ కలిపితే 5లక్షలకు దాటుతున్నాయి. ఇంతకీ ఏపీలో అప్పుల పాపం ఎవరిది? ఇతర రాష్ట్రాలు కేంద్రం అప్పులు చేయడం లేదా? సంక్షేమానికి అప్పులు చేయడం తప్పా.. ? ఒప్పా?..ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్‌ డిబేట్‌ జరిగింది.. పూర్తి సమాచారం కోసం కింద వీడియో చూడండి..

(బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్)

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu