AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weekly Horoscope: ఈ వారంలో వ్యవసాయదారులకు లాభసాటిగా ఉంటుంది.. ఏఏ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Weekly Horoscope: తమ జాతకాలను నామ నక్షత్ర ప్రకారం, లేక జన్మ నక్షత్ర ప్రకారం వారఫలాలను చూస్తారు.. వాటి ఆధారంగా తాము చేపట్టిన పనులను సక్రమంగా అడ్డకుంలు..

Weekly Horoscope: ఈ వారంలో వ్యవసాయదారులకు లాభసాటిగా ఉంటుంది.. ఏఏ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Weekly Horoscope
Surya Kala
|

Updated on: Jan 09, 2022 | 7:32 AM

Share

Weekly Horoscope: తమ జాతకాలను నామ నక్షత్ర ప్రకారం, లేక జన్మ నక్షత్ర ప్రకారం వారఫలాలను చూస్తారు.. వాటి ఆధారంగా తాము చేపట్టిన పనులను సక్రమంగా అడ్డకుంలు లేకుండా జరుగుతాయో లేదో తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. ఏ పని మొదలు పెట్టాలన్నా .. మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. నేటి నుంచి (జనవరి 9తేదీ)జనవరి 15వ  తేదీ వరకూ ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం..

మేష రాశి: ఈ వారంలో ఈ రాశివారు ప్రారంభించిన పనులు నిరాటంకంగా పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాల ప్రయత్నం ఫలిస్తుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.  ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.  కోర్టు కేసుల్లో అనుకూల తీర్పులు వస్తాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. వాహనాల కొనుగోలు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

వృషభ రాశి:  ఈ వారంలో ఈ రాశివారికి స్నేహితులు, బంధువులు సహకారం లభిస్తుంది. చేపట్టిన పనులు పూర్తి చేయడానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగంలో బాధ్యతలు పెరుగుతాయి. రావాలిన డబ్బులు ఆలస్యంగా రావడంతో ఆర్ధికంగా ఇబ్బందులు పడతారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు.

మిథున రాశి: ఈ రాశివారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార రంగంలో లాభాలు కలుగుతాయి. ఆర్ధికంగా ఇబ్బందులు ఏర్పడతాయి. వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం స్థిరంగా ఉంది.. క్రమేణా పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు పొందిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. దిగుబడి సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త పరిచయాలతో  పనులు సులభంగా చేస్తారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి.

కర్కాటక రాశి:  ఈ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.  దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపారంగలో ఉన్నవారు లాభాలను పొందుతారు.  చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. అనుకోని ఖర్చులు చేస్తారు. కొత్తపెట్టుబడుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. భూమి కొనుగోలు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బంధుమిత్రుల రాక  వలన ఖర్చులు అధికమవుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి.

సింహ రాశి: ఈ వారంలో వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. స్టూడెంట్స్ కు కలిసి వస్తుంది. రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వృధా ఖర్చులు చేస్తారు. కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. బంధుమిత్రులతో తగాదాలకు దూరంగా ఉండడం మంచిది. అధికారుల ఆదరణ లభిస్తుంది.  ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది.  ఉల్లాసంగా ఉంటారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈ వారంలో కొత్త వస్తువులు, నగలు కొనుగోలు చేస్తారు. కష్టానికి తగిన ఫలం అందుకుంటారు. చిన్ననాటి స్నేహితులతో సంతోషముగా గడుపుతారు. కుటుంబ పెద్దల సహకారంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయదారులకు రాబడి పెరుగుతుంది. వ్యాపార విస్తరణ చేపట్టాలనుకునేవారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్థుల్లో బదిలీలు ఏర్పడే అవకాశం ఉంది. పెద్దవారి సలహాలతో చేపట్టిన పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు పనిభారం పెరగవచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. సంయమనం పాటిస్తే మేలు జరుగుతుంది.  రాజకీయ పరమైన ఖర్చులు పెరుగుతాయి.

తుల రాశి: ఈ రాశివారికి ఈ వారంలో పదోన్నతి, ఉద్యోగంలో బదిలీలు ఉండవచ్చు. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి. ఆదాయం పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. రావాలిన డబ్బులు చేతికి ఆలస్యంగా అందుతాయి. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.  ఉన్నత విద్య ప్రయత్నాలు నెరవేరతాయి. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. వ్యవసాయదారులకు రాబడి సంతృప్తికరంగా ఉంటుంది.  కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. అనవసరమైన ఆలోచనలతో కొన్ని ఇబ్బందులు రావచ్చు. పనులపై మనసు నిలపడం వలన త్వరగా పూర్తి అవుతాయి.

వృశ్చిక రాశి: ఈ రాశివారికి ఈ వారం అందరి సహకారం లభిస్తుంది.  కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. పాతబాకీలు వసూలు అవుతాయి. బంధుమిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు తోటి వారితో అభిప్రాయం బేధాలు ఏర్పడే అవకాశం ఉంది. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది.  ఆధ్యాత్మిక ప్రవచనాలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. విద్యార్థులు కొంత శ్రమించవలసి రావచ్చు. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి.

ధనుస్సు రాశి: ఈ రాశివారు ఈ వారంలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. రావాలిన డబ్బులు చేతికి ఆలస్యంగా అందుతాయి. కొన్ని పనులు వాయిదా పడతాయి. కొన్ని పనులు అధిక శ్రమతో  పూర్తి చేస్తారు.  బంధువులు,స్నేహితుల రాకతో అధికంగా ఖర్చు చేస్తారు. భూముల విషయంలో తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. డబ్బు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆఫీసులో అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది.  దైవభక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకర రాశి: రాశివారు ఈ వారంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయిట. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. విందు వినోద కార్యక్రమాలకు హాజరవుతారు. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార వేత్తలు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికంగా ఖర్చులు చేయడంతో ఆర్ధికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యవసాయ దారులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు పదోన్నతి, బదిలీలు ఉండవచ్చు.

కుంభ రాశి: ఈరాశి వారి ఈ వారంలో అన్నిరంగాల వారికీ అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లభిస్తాయి.  ప్రయాణాలు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  వృత్తి, ఉద్యోగం రంగంలో సంతృప్తికరంగా ఉంటుంది. పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. రాబడి పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలకు న్యాయ సమస్యలు దూరమవుతాయి.

మీన రాశి: ఈ వారం ఈ రాశి ఉద్యోగులకు సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. రాజకీయరంగంలో ఉన్నవారికి అనుకూల ఫలితాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ చేస్తారు. రోజువారీ వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితాన్ని అందుకుంటారు. వ్యవసాయ దారులకు కలిసి వస్తుంది. రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.   అనవసరమైన ఆలోచనకు దూరంగా ఉండడం మంచిది. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది.

Also Read :

వీరు నేడు పట్టిందల్లా బంగారమే.. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..