Weekly Horoscope: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభానికి అవకాశం..12 రాశుల వారికి వారఫలాలు

వార ఫలాలు (జూన్ 23 నుంచి జూన్ 29, 2024 వరకు): మేష రాశి వారికి ఈ వారం ఆర్థికంగా అనుకూలతలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కొత్త కార్యక్రమాలు చేపడతారు. వృషభ రాశి వారికి ఈ వారం కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. మిథున రాశి వారికి ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

Weekly Horoscope: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభానికి అవకాశం..12 రాశుల వారికి వారఫలాలు
Weekly Horoscope 23rd June 29th June 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 23, 2024 | 5:01 AM

వార ఫలాలు (జూన్ 23 నుంచి జూన్ 29, 2024 వరకు): మేష రాశి వారికి ఈ వారం ఆర్థికంగా అనుకూలతలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కొత్త కార్యక్రమాలు చేపడతారు. వృషభ రాశి వారికి ఈ వారం కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. మిథున రాశి వారికి ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఈ వారం ఆర్థికంగా అనుకూలతలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కొత్త కార్యక్రమాలు చేపడతారు. వారమంతా ఉత్సాహంగా గడిచిపోతుంది. ముఖ్యమైన పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. కొందరు ఇష్టమైన మిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహకాలు అంది వస్తాయి. అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. వృత్తి జీవితంలో రాబడి మరింతగా పెరుగుతుంది. వ్యాపారాల్లో కొత్త ప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్ వంటివి బాగా లాభిస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శనానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది.. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల ఆశించిన శుభవార్తలు వింటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

జీవనశైలిలో బాగా మార్పు వస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. కొత్త నిర్ణయాలు, కొత్త ఆలోచన లను అమలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. పెండింగ్ పనులు చాలావరకు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో అధికారులను మీ పనితీరుతో సంతృప్తిపరుస్తారు. సహోద్యోగుల సహకారంతో సకా లంలో బాధ్యతలను పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. అనవసర పరిచయాల వల్ల ఇబ్బంది పడతారు. రావల సిన డబ్బు చేతికి అందుతుంది. తరచూ శివార్చన చేయడం వల్ల ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఊహించని విధంగా అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగ జీవితంలో అనుకూలతలు పెరుగుతాయి. హోదా పెరగడానికి అవకాశం ఉంది. ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది. ఇంట్లో శుభ కార్యం జరగడానికి అవకాశం ఉంది. ఇంట్లో సుఖ సంతోషాలకు లోటుండదు. పండుగ వాతా వరణం నెలకొంటుంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఇత రుల పనుల మీద కంటే సొంత పనుల మీద కూడా శ్రద్ధ పెట్టడం మంచిది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ప్రతి రోజూ ఉదయం సుబ్రహ్మణ్యాష్టకం పఠనం వల్ల మేలు జరుగుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. అధికారుల నుంచి గౌరవ మర్యాదలు లభి స్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి శ్రమ, ఒత్తిడి ఉంటాయి. అయితే, రాబడికి లోటుండదు. లాభ దాయక పరిచయాలు ఏర్పడతాయి. కొత్త ఒప్పందాలకు అవకాశం ఉంది. ఆదాయం దిన దినా భివృద్ధి చెందుతుంది. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. దైవ కార్యాలకు సహాయం చేస్తారు. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం కావచ్చు. గృహ, వాహన సౌకర్యాలకు ప్లాన్ చేస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు లోటుం డదు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొం టారు. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల అష్టమ శని దోషం తగ్గుతుంది. ఆరోగ్యం పరవా లేదు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

కొద్దిపాటి ఒడిదుడుకులున్నా వారమంతా ఆశించిన విధంగా సాగిపోతుంది. సొంత బాధ్యతల మీద దృష్టి పెట్టడం మంచిది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. కుటుంబ జీవితం చాలావరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆధ్యా త్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు సాదా సీదాగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభ సాటిగా సాగిపోతాయి. బంధుమిత్రులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ప్రయాణాల వల్ల లాభముంటుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. రావలసిన డబ్బు సకా లంలో అంది అవసరాలు తీరుతాయి. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. ఎవరికీ వాగ్దా నాలు చేయడం, హామీలు ఉండడం శ్రేయస్కరం కాదు. గణపతి స్తోత్ర పఠనం వల్ల మేలు జరుగుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

అనేక కీలక విషయాల్లో సమయం బాగా అనుకూలంగా ఉంది. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయ త్నాలు చేపట్టడం మంచిది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండదు. అనవసర ఖర్చుల్ని, సహాయాల్ని తగ్గించుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. అధికారులకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. వ్యాపార లావాదేవీలు సానుకూలంగా సాగిపోతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరు ద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల్లో ముఖ్యమైన వాటిని పట్టుదలగా పరిష్కరించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. తరచూ విష్ణు సహస్ర నామం చదువుకోవడం శ్రేయస్కరం.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

చిన్నా చితకా వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుని ఊరట చెందుతారు. ఆదాయానికి, ఆరో గ్యానికి ఇబ్బంది ఉండదు. విదేశాల్లో ఉన్న పిల్లలు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ పని తీరు అధికారులకు బాగా నచ్చుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగి పోతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో కూడా సంప్రదించడం మంచిది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. పిల్లల చదువులకు సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగరీత్యా అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొందరు మిత్రుల వల్ల డబ్బు నష్టం జరుగుతుంది. తరచూ శివార్చన చేయడం వల్ల ఆశించిన శుభవార్తలు వినడం జరుగుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వ్యాపారాల్లో పెట్టుబడికి తగ్గ లాభాలు లభిస్తాయి. ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కొందరు ఇష్టమైన బంధుమిత్రులను కలు సుకుని ఎంజాయ్ చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. పెళ్లి ప్రయత్నాలు అను కూలిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు విజయవంతం అవుతాయి. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థిక సహాయం చేస్తారు. పిల్లల చదువులు సాఫీగానే సాగిపోతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్ర మాల్లో పాల్గొంటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయటా అను కూలతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ప్రతి రోజూ సుందరకాండ పారాయణం చేయడం వల్ల మనసులోని కోరికలు నెర వేరుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఒత్తిడి, శ్రమ, వ్యయప్రయాసలు తప్పకపోవచ్చు. కొన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ, చిన్నా చితకా ఇబ్బందులు కూడా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన పనులు శ్రమ మీద పూర్తవుతాయి. అనేక విషయాల్లో కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. జీత భత్యాల పెరుగుదల విషయంలో అధికారుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇతరులకు సహాయం చేసే ముందు బాగా ఆలోచించడం మంచిది. వాగ్దానాలకు, హామీలకు ఇది సమయం కాదు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. దుర్గా స్తోత్ర పఠనం వల్ల బాగా మేలు జరుగుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

అనేక విధాలుగా అనుకూలతలు పెరుగుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా ఆశాజన కంగా ఉంటుంది. వృత్తి జీవితంలో బిజీ అయిపోవడం జరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగి పోతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. దత్తాత్రేయ స్తోత్ర పఠనం వల్ల ఆశించిన మేలు జరుగుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు చాలావరకు సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగపరంగా ఆశించిన శుభవార్త వింటారు. కుటుంబంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొత్త ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవు తాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. కొందరు ప్రముఖులతో పరిచయాలు పెరుగు తాయి. ఆస్తి వ్యవహారంలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో విహార యాత్ర చేస్తారు. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో సొంత ఊర్లోనే ఉద్యోగం లభించడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విష్ణు సహస్ర నామ స్తోత్ర పఠనం వల్ల ప్రతి ప్రయత్నంలోనూ విజయం వరిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

అనవసర పరిచయాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. కొందరు మిత్రులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యంగా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. కొందరు బంధుమిత్రులతో పుణ్య క్షేత్ర సందర్శనకు వెళ్లే సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇంటా బయటా బాగా అనుకూలతలు పెరుగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. తల్లితండ్రుల జోక్యంతో సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగుల మంచి ఆఫర్ అందుతుంది. హనుమాన్ చాలీసా పఠనం వల్ల మేలు జరుగుతుంది.