AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shukra Gochar: మేష రాశిలో శుక్ర సంచారం.. ఆ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు..!

జూన్ 26 వరకు శుక్రుడు మేష రాశిలో సంచరిస్తాడు. దీని ప్రభావంతో వృషభ, కన్య, తుల సహా మరికొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. వృత్తి, ఆర్థికంగా అనుకూలమైనప్పటికీ, దాంపత్య జీవితంలో, ఆరోగ్యంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. శుక్ర గ్రహ స్తోత్ర పారాయణం, ప్రదక్షిణలు శుభ ఫలితాలను ఇస్తాయి.

Shukra Gochar: మేష రాశిలో శుక్ర సంచారం.. ఆ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు..!
Shukra Transit
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 05, 2025 | 6:07 PM

Share

ఈ నెల(జూన్) 26వ తేదీ వరకు మేష రాశిలో సంచారం చేయబోతున్న శుక్ర గ్రహం వల్ల కొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ప్రేమలు, పెళ్లిళ్లు, శృంగారం, విలాసాలు, సుఖ సంతోషాలు, సంపదకు కారకుడైన శుక్రుడు దుస్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు కూడా ఏదో రూపంలో యోగాలు కలిగించే అవకాశం ఉంది. అయితే, కొద్దిగా దుస్థాన ఫలితం కూడా తప్పక పోవచ్చు. శుక్రుడి మేష రాశి సంచారం వల్ల వృషభం, కన్య, తుల, వృశ్చికం, కుంభ రాశుల వారు కొద్దిపాటి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ రాశుల వారు శుక్ర గ్రహ స్తోత్రాన్ని చదువు కోవడం లేదా శుక్ర గ్రహానికి ప్రదక్షిణలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

  1. వృషభం: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు వ్యయ స్థానంలో సంచారం చేయడం వల్ల వ్యసనాలు, దురలవాట్లు, అనవసర పరిచయాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాజయోగాలు కలగడం, ఒకటి రెండు ధన యోగాలు కలగడం వంటివి జరిగే అవకాశం ఉన్నప్పటికీ, మిత్రుల వల్ల తప్పుదోవలో నడవడం, విలాసాలకు అలవాటుపడడం, మిత్రుల వల్ల డబ్బు నష్టపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి.
  2. కన్య: ఈ రాశికి అష్టమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల దాంపత్య జీవితంలో అన్యోన్యత తగ్గే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు తలెత్తడం, కొద్దిగా ఎడబాటు చోటు చేసుకోవడం జరుగుతుంది. అష్టమ శుక్రుడి వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి కలగడం, షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల విశేషంగా లాభించడం, రావలసిన సొమ్ము చేతికి అందడం వంటివి జరిగే అవకాశం ఉన్నప్పటికీ, జూదాల వల్ల ధన నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. కుటుంబం మీద వృథా ఖర్చులు పెరుగుతాయి.
  3. తుల: రాశ్యధిపతి శుక్రుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల వైవాహిక జీవితంలో టెన్షన్లు పెరిగే అవకాశం ఉంది. కోపతాపాలు, వాదోపవాదాలు, అపార్థాలు చోటు చేసుకుంటాయి. ప్రేమ వ్యవహారాలు బెడిసి కొట్టవచ్చు. పెళ్లి ప్రయత్నాలు ముందుకు సాగకపోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అందలాలు ఎక్కడానికి, పురోగతి సాధించడానికి అవకాశం ఉన్నప్పటికీ, నష్టదాయక వ్యవహారాల వల్ల, అనవసర పరిచయాల వల్ల డబ్బు నష్టపోవడం, ప్రతిష్ఠకు భంగం కలగడం వంటివి జరుగుతాయి.
  4. వృశ్చికం: ఈ రాశికి షష్ట స్థానంలో శుక్ర సంచారం వల్ల జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి రాకపోవడం, ప్రేమ వ్యవహారాల్లో సమస్యలు తలెత్తడం జరుగుతుంది. అకారణ వాగ్వాదాలు చెలరేగుతాయి. షష్టంలో శుక్ర సంచారం వల్ల ఉద్యోగంలో పురోగతికి, వృత్తి, వ్యాపారాల్లో స్థిరత్వానికి, ఆర్థిక సమస్యల పరిష్కారానికి అవకాశం ఉన్నా, దాంపత్యంలో మాత్రం చికాకులు తప్పకపోవచ్చు.
  5. కుంభం: ఈ రాశికి తృతీయ స్థానంలో శుక్ర సంచారం వల్ల దంపతుల మధ్య ఎడమొహం పెడమొహం ఏర్పడే అవకాశం ఉంది. బంధువుల జోక్యం వల్ల ఇద్దరి మధ్యా విభేదాలు తలెత్తడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా ఇబ్బందులు చోటు చేసుకునే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రయాణాల వల్ల కూడా ఇబ్బందులు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతికి, ఆదాయ వృద్ధికి అవకాశం ఉన్నా మనస్పర్థలకు బాగా అవకాశం ఉంది.