Venus Remedies: జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నాడా.. ఆర్ధిక ఇబ్బందులా.. ఈ పరిహారాలు చేసి చూడండి

ఎవరి జాతకంలో శుక్రుడు  బలహీనంగా ఉంటే.. ఆ వ్యక్తి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. జీవితంలో అన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటారు. కనుక మీ జాతకంలో శుక్రుడు కష్టాలకు కారణం అవుతున్నట్లయితే ఈ సులభమైన పరిహారాలు చేసి చూడండి.. ఎవరి జాతకంలోనైనా శుక్రుడు బలహీనంగా ఉన్నట్లయితే శుక్రవారం రోజున వీలైనంత వరకు శుభ్రమైన తెలుపు రంగు దుస్తులను ధరించాలి.  

Venus Remedies: జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నాడా.. ఆర్ధిక ఇబ్బందులా.. ఈ పరిహారాలు చేసి చూడండి
Venus Astro Remedies
Follow us
Surya Kala

|

Updated on: Sep 08, 2023 | 12:55 PM

హిందూమతంలో సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవిని, సంపద శ్రేయస్సుకు కారణమైన శుక్రుడిని పూజించడానికి శుక్రవారం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఎవరి జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉంటాడో వారు అన్ని రకాల ఆనందాలను పొందుతారని నమ్ముతారు. అంతేకాదు శుక్రుడు శుభస్థానంలో ఉంటె ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు. అదే సమయంలో ఎవరి జాతకంలో శుక్రుడు  బలహీనంగా ఉంటే.. ఆ వ్యక్తి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. జీవితంలో అన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటారు. కనుక మీ జాతకంలో శుక్రుడు కష్టాలకు కారణం అవుతున్నట్లయితే ఈ సులభమైన పరిహారాలు చేసి చూడండి..

  1. ఎవరి జాతకంలోనైనా శుక్రుడు బలహీనంగా ఉన్నట్లయితే శుక్రవారం రోజున వీలైనంత వరకు శుభ్రమైన తెలుపు రంగు దుస్తులను ధరించాలి.
  2. జ్యోతిష్య శాస్త్రంలో ఏ గ్రహమైనా అశుభాలను కలిగిస్తుంటే.. వాటిని తొలగించడానికి, శుభాలను పొందడానికి అన్ని పరిష్కారాల కోసం మంత్రాలను పఠించడం చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది.
  3. అటువంటి పరిస్థితిలో శుక్ర గ్రహం శుభాన్ని పొందడానికి ముఖ్యంగా ప్రతి శుక్రవారం పూజ సమయంలో ” శ్రీ ద్రాం ద్రీం ద్రౌం సః శుక్రాయ నమః ” అనే మంత్రాన్ని జపించండి.
  4. శుక్రుడి శుభాలను ఇవ్వడానికి శుక్రవారం కొన్ని వస్తువులను దానం చేయడం చాలా ఫలవంతంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ రోజు వీలైతే తెల్లని వస్త్రాలు, పంచదార, పాలు, పంచదార మిఠాయి, అన్నం, నెయ్యి మొదలైన వాటిని అవసరమైన వారికి దానం చేయండి.
  5. ఇవి కూడా చదవండి
  6. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి సంబంధించిన దోషాలు తొలగిపోవాలంటే గోధుమ పిండిలో పంచదార కలిపి శుక్రవారం రోజు చీమలకు ఆహారం అందించాలి. ఈ పరిహారం చేయడం ద్వారా శుక్ర గ్రహం శుభ దృష్టితో ఐశ్వర్యం లభిస్తుందని నమ్ముతారు.

శుక్రవారం చేయకూడని పనులు

  1. ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీ దేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ పై ఉండాలని మీరు కోరుకుంటే శుక్రవారం రోజున పులుపును తినకూడదు.
  2. అదే విధంగా శుక్రవారాల్లో నలుపు లేదా మురికి బట్టలు ధరించ వద్దు. అంతేకాదు ఇంటిని శుభ్ర పరుచుకోవాలి.
  3. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున ఏ అమ్మాయిని లేదా స్త్రీని బాధించకూడదు. ఈ రోజున అప్పు ఇవ్వవద్దు అదే సమయంలో ఎవరి దగ్గరా డబ్బు అప్పుగా తీసుకోవద్దు.
  4. అదేవిధంగా ఈ రోజున ధర  చెల్లించకుండా ఎవరి నుండి ఏ వస్తువులను తీసుకోరాదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!