Vastu Tips for Wealth: అపర కుబేరులు కావాలంటే ఈ 8 వాస్తు టిప్స్ తప్పక తెలుసుకోండి
Vastu Shastra Tips for Wealth: వాస్తు సూత్రాల ప్రకారం ఇంటిని కట్టుకున్నా, ఇల్లును అమర్చుకున్నా, లేక ఇంటిని మార్చుకున్నా ధనయోగం పట్టడం ఖాయమని వాస్త్ర శాస్త్ర పండితులు చెబుతున్నారు. 'వాస్తు మణి భూషణం ' అనే ఒక పురాతన వాస్తు శాస్త్ర గ్రంథం ఈ సూత్రాలను వివరించింది. ఈ సూత్రాలను పాటిస్తే సునాయాసంగా అపర కుబేరులు అవుతారని..
Vastu Tips for Money: సృష్టిలో ప్రతి వ్యక్తి ధనయోగం కోసం, అపర కుబేరుడు కావటం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. అయితే, ఇందుకు వాస్తు శాస్త్ర పరంగా కూడా కొన్ని మార్గాలు ఉన్నాయని ఋషులు సూచించారు. తాము చెప్పిన వాస్తు సూత్రాల ప్రకారం ఇంటిని కట్టుకున్నా, ఇల్లును అమర్చుకున్నా, లేక ఇంటిని మార్చుకున్నా ధనయోగం పట్టడం ఖాయమని వారు చెబుతున్నారు. ‘వాస్తు మణి భూషణం ‘ అనే ఒక పురాతన వాస్తు శాస్త్ర గ్రంథం ఈ సూత్రాలను వివరించింది. ఈ సూత్రాలను పాటిస్తే సునాయాసంగా అపర కుబేరులు అవుతారని, లాటరీలు తగలటం, ధన యోగాలు పట్టడం, ఆర్థిక లావాదేవీలలో ఘన విజయాలు సాధించడం, ఆకస్మిక ధన లాభం ప్రాప్తించడం వంటివి జరుగుతాయని ఈ గ్రంథం తెలియజేసింది. సొంత ఇల్లు అయినా, ఫ్లాట్ అయినా, చివరికి అద్దె ఇల్లు అయినా ఈ సూత్రాలను పాటించడం వల్ల తప్పకుండా సిరిసంపదలు వచ్చి పడతాయని ఈ గ్రంథం తెలిపింది. ఈ గ్రంథంలో ఇందుకు సంబంధించి 8 ముఖ్య సూత్రాలను తెలియజేయడం జరిగింది.
1. ఇంటి లోపలి భాగంలో ఉత్తర దిక్కులో గాని, తూర్పు దిక్కులో గాని, ఈశాన్య దిక్కులో గాని కుబేర యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవడం ఆర్థికపరంగా చాలా మంచిది. భారతీయ పురాణాల ప్రకారం కుబేరుడు సంపదకు, ధనానికి, అదృష్టానికి కారకుడు. కుబేరుడు ఉత్తర దిక్కుకు అధిపతి. అందువల్ల ఉత్తర దిక్కులో గాని, ఈశాన్య దిక్కులో గాని టాయిలెట్ ను, చెప్పుల స్టాండును, బరువైన వస్తువులను ఉంచకూడదు. ఈ దిక్కుల్లో ఏ వస్తువు ఉంచకుండా ఖాళీగా వదిలేయడం వల్ల కుబేర అనుగ్రహం కలుగుతుంది. ఈ ఖాళీ స్థలంలో ఉంచవలసిన ఒకే ఒక వస్తువు అద్దం మాత్రమే. ఇక్కడ కుబేర యంత్రం వల్ల ఆ ఇంటి యజమానికి సంపద పెరగటం ప్రారంభిస్తుంది.
2. ధన యోగానికి సంబంధించినంత వరకు నైరుతి మూలకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ నైరుతి మూలను సవ్యంగా ఉపయోగించుకుంటే ఆ ఇంట్లో ధన ధాన్యాలకు కొ దువ ఉండదని ఈ గ్రంథం తెలిపింది. నగలను, డబ్బును, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన దస్తావేజులను నైరుతి దిక్కున పెడితే మంచిది. ఈ దిక్కులో ఒక చిన్న అల్మేరా ను ఏర్పాటు చేసి, అందులో వీటిని ఉంచడం వల్ల సంపద పెరుగుతుంది. ఈ అల్మేరా ఉత్తరం దిక్కును గాని, ఈశాన్య దిక్కున గాని చూడాలి. ఈ దిక్కులో ఏది పెట్టిన అది పెరుగుతుందని ఈ గ్రంథం తెలిపింది. ఈ బీరువా లేక అల్మేరా దక్షిణ దిక్కులు చూసినా లేదా పశ్చిమ దిక్కున చూసినా ఆ ఇంట్లో విపరీతంగా ధన నష్టం జరుగుతుంది. ఈ బీరువా లోపల ఒక ఎర్రని వస్త్రాన్ని కానీ స్పటికాన్ని గాని ఉంచడం మంచిది. అలా చేస్తే అతి తక్కువ కాలంలో సంపన్నుడు కావడానికి, ఆర్థిక సమస్యలన్నీ తీరిపోవడానికి అవకాశం కలుగుతుంది.
3. ఇంట్లో ఎక్కడా పాత వస్తువులు పోగు చేసి పెట్టడం ఆర్థికపరంగా మంచిది కాదు. ఏ దిక్కులోను పాత ఫర్నిచర్ ను, పాత వస్తువులను, విరిగిన వస్తువులను, పగిలిన వస్తువులను, అక్కడ లేని వస్తువులను ఉంచకూడదు. ముఖ్యంగా మూలల్లో ఈ వస్తువులను ఉంచకపోవడం చాలా మంచిది. చివరికి ఈ మూలల్లో అతిగా ఇంటీరియర్ డెకరేషన్ కూడా చేయకూడదు. ఇటువంటివన్నీ ఆ ఇంటిలోని వారిని ఆర్థికంగా దెబ్బతీస్తాయి. ఈ ప్రాంతాలను ఎంత ఖాళీగా లేదా తేలికగా ఉంచితే ఆర్థికంగా అంత మంచిది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మూలల్లో ఉన్న కిటికీలను కూడా పరిశుభ్రంగా ఉంచడం సంపద వృద్ధికి చాలా మంచిది.
4. ఇక ఇంటికి ప్రధాన ద్వారం తలుపుల్లో విరుగుళ్లు, పగుళ్ళు, చీలికలు ఉండకూడదు. అది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చేది ప్రధాన ద్వారం గుండా నే అని అర్థం చేసుకోవాలి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లేకపోతే సంపద నిలవదు. అందువల్ల ప్రధాన ద్వారం ఎప్పుడూ పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రధాన ద్వారానికి ఎదురుగా పూల మొక్కలు, అందమైన బొమ్మలు ఉండటం సంపదకు, సౌభాగ్యానికి చాలా మంచిది.
5. ఈశాన్యంలో చిన్నపాటి నీటి ఫౌంటెన్ లేదా అక్వేరియం ను ఏర్పాటు చేసుకుంటే ఆకస్మిక ధన యోగాలు పట్టడం ఖాయమని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ మూల నీరు ప్రవహిస్తూ ఉంటే అది ఆర్థికంగా మంచి చేస్తుంది. నీటి వల్ల పాజిటివ్ ఎనర్జీ మరింత వేగంగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ మూలలో నీరు నిలిచిపోయినా, కలుషితం అయినా, మురికిగా మారినా ఆ ఇంట్లో ధన నష్టానికి, అతిగా ధన వ్యయానికి, వైద్య ఖర్చులు పెరగటానికి అవకాశం ఉంటుంది. అక్కడి నీటిని తరచూ శుభ్రం చేస్తూ ఉండకపోతే ఆర్థిక అభివృద్ధి స్తంభించిపోతుంది.
6. ఈశాన్యం, ఆగ్నేయ మూలల్లో ఎటువంటి పరిస్థితులలోనూ ఓవర్ హెడ్ ట్యాంకులు కానీ, వాటర్ హెడ్ ట్యాంకులు గానీ పెట్టకూడదు. ఈ మూలల్లో బరువైన వాటర్ ట్యాంకును పెట్టే పక్షంలో క్రమక్రమంగా ఆర్థిక పరిస్థితి క్షీణించిపోవడమే కాకుండా ఆ ఇంట్లోని వారి ఆరోగ్య పరిస్థితి కూడా దెబ్బతింటుంది. ఆ ఇంట్లోని వారికి ఏదీ కలిసి రాదు. ఆ ఇంట్లో కార్యాలే జరగవు. 7. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో కానీ, స్నానాల గదిలో కానీ, ఇంటి ఆవరణలో కానీ ఎక్కడా నీరు కారుతూ అంటే నీరు లీకేజీ అవుతూ ఉండకూడదు. అలా జరిగితే ఆ ఇంట్లో వృధా వ్యయం ఎక్కువగా అవుతూ ఉంటుందని, డబ్బు నిలవదని, బ్యాంక్ బ్యాలెన్స్ కరిగిపోతూ ఉంటుందని అర్థం చేసుకోవాలి. వర్షాకాలంలో ఇంటి చూరు నుంచో, పై కప్పునుంచో నీరు కారడం కూడా మంచిది కాదు. పైపులు విరిగి, గోడలు బీటలు వారి నీరు కారడం ప్రారంభం అయితే, వెంటనే వాటికి మరమ్మతు చేయాలి. లేకపోతే ఆ ఇంట్లో వైద్య ఖర్చులకు సంపదంతా హరించుకుపోతుంది.
8. టాయిలెట్లను లేదా స్నానాల గదులను కట్టేటప్పుడు కూడా వాస్తు పరంగా ఎంతో శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. వాటిని ఎక్కడ కట్టాలో, ఏ విధంగా కట్టాలో అలాగే కట్టాలి. నైరుతి దిశలో స్నానాల గద నిర్మిస్తే ఆ ఇంట్లో విపరీతంగా ధన నష్టం జరుగుతుంది. ఇంట్లో దొంగతనాలు జరిగే అవకాశం కూడా ఉంది. వీటిని వాయువ్యంలో కానీ, ఈశాన్యంలో గాని కడితే ఆ ఇంట్లో సంపద ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది.
మరిన్ని ఇలాంటి కథనాలు చదవండి..