Tula Rasi | Ugadi Horoscope 2023: శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో తులా రాశి వారికి ఫలితాలు ఇలా..
Tula Rasi Ugadi Rasi Phalalu 2023: తెలుగువారి నూతన సంవత్సర కాలంలో తులా రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నది ఇక్కడ పరిశీలిద్దాం.
తెలుగువారి కొత్స సంవత్సరాదినే ఉగాది అని అంటారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం బుధవారం (మార్చి 22) నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్ 23 నుంచి గురుగ్రహం మేషరాశిలో సంచారం ప్రారంభిస్తుంది. అదేవిధంగా, అక్టోబర్ 24న మీనరాశిలో రాహు సంచారం కన్యారాశిలో కేతువు సంచారం ప్రారంభం అవుతుంది. శని గ్రహం ఈ ఏడాదంతా కుంభ రాశిలో కొనసాగుతుంది. మిగిలిన గ్రహాలు సుమారుగా నెలరోజులు చొప్పున వివిధ రాశుల్లో సంచరించడం జరుగుతుంది. గ్రహాల సంచారం ఆధారంగా శ్రీ శోభకృత్ నామ సంవత్సర కాలంలో తులా రాశి వారికి జ్యోతిష్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నది ఇక్కడ పరిశీలిద్దాం.
తులా రాశి (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆదాయం 14, వ్యయం 11 | రాజపూజ్యం 7, అవమానం 7
ఈ ఏడాదంతా ఈ రాశి వారికి పంచమంలో శనీశ్వరుడు, సప్తమంలో గురు రాహువులు, మొదటి స్థానంలో కేతువు సంచరించడం వల్ల, జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాల్లో శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకోవడం జరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికార యోగం పట్టడం ఖాయం అని చెప్పవచ్చు. ఆదాయం, సంపాదన, లాభాలు ఆశించిన స్థాయిలో పెరిగే సూచనలు ఉన్నాయి. అక్రమ సంపాదన విషయంలో అతి జాగ్రత్తగా ఉండటం మంచిది.
వ్యాపారానికి సంబంధించి, కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకొని వెంటనే ఆచరణలో పెట్టడం వల్ల మున్ముందు ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఏదో విధంగా ముఖ్యమైన పనులను పెండింగ్లో ఉంచకుండా పూర్తి చేయడం చాలా మంచిది. సమయం అన్ని విధాలుగాను అనుకూలంగా ఉన్నందువల్ల దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఎంజాయ్ చేస్తారు. కుటుంబ సభ్యులను కలుపుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
మే నుంచి అదృష్టం
నిరుద్యోగులకు ఆశించిన స్థాయిలో చక్కని ఉద్యోగం లభించ వచ్చు. విదేశాలకు వెళ్లడానికి మార్గం సుగమం అవుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యాపారులు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు ఆర్జిస్తారు. కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అయ్యే సూచనలు ఉన్నాయి. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మే నెల నుంచి అదృష్టం బాగా కలిసి వస్తుంది.
ఇష్ట దైవానికి పూజ
ఇతర నక్షత్రాల కంటే స్వాతి నక్షత్రం వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. కొందరు మిత్రులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. కొద్దిగా విచక్షణా జ్ఞానంతో వ్యవహరించడం మంచిది. ఇష్ట దైవాన్ని మరింత శ్రద్ధగా పూజించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.
(Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..)
మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..