Zodiac Signs: మేషరాశిలో రాహు గ్రహ సంచారం.. ఆ రాశుల వారికి ఐటీ కంపెనీల్లో మంచి జాబ్ ఆఫర్స్ తథ్యం..!
గురు, రాహువుల కలయికను ఈ ఆధునిక కాలంలో ఒక మహా యోగంగా కూడా పాశ్చాత్యులు పరిగణించడం జరుగుతోంది. ఇది ప్రస్తుత కాలంలో మన సమాజానికి కూడా వర్తిస్తుంది. ప్రస్తుతం గురువుతో కలిసి మేషరాశిలో సంచరిస్తున్న రాహు గ్రహం ఈ రాశిలో ఈ ఏడాది అక్టోబర్ 24 వరకు కొనసాగడం జరుగుతుంది. వివిధ రాశులకు, ముఖ్యంగా సైన్స్ టెక్నాలజీ రంగాలకు సంబంధించిన రాశుల వారికి ఈ రాహు సంచారం ఏ విధంగా పనిచేసేది ఇక్కడ పరిశీలిద్దాం.
IT Jobs Astrology: రాహు గ్రహం ఆధునీకరణకు, ఆధునికతకు కారకుడు. సైన్స్, టెక్నాలజీ వంటి ఆధునిక రంగాలు రాహువు నియంత్రణలోనే ఉంటాయి. ఇక విదేశాలకు, పరిశోధనలకు, ఆవిష్కారాలకు కూడా రాహువే కారకుడు. విద్యార్థులు, ఉద్యోగులు తమ నైపుణ్యాలను, ప్రతిభా పాటవాలను అప్డేట్ చేసుకోవలసిన అవసరాన్ని రాహువు తెలియజేస్తాడు. పాశ్చాత్య జ్యోతిష శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని చాలా ఏళ్ల క్రితమే గుర్తించారు. రాహువు చాందస భావాలకు, ఆచార సంప్రదాయాలకు పూర్తి వ్యతిరేకి. శాస్త్రీయంగా, విప్లవాత్మకంగా ఆలోచించడాన్ని ప్రోత్సహిస్తాడు. అందువల్ల గురు, రాహువుల కలయికను ఈ ఆధునిక కాలంలో ఒక మహా యోగంగా కూడా పాశ్చాత్యులు పరిగణించడం జరుగుతోంది. ఇది ప్రస్తుత కాలంలో మన సమాజానికి కూడా వర్తిస్తుంది. ప్రస్తుతం గురువుతో కలిసి మేషరాశిలో సంచరిస్తున్న రాహు గ్రహం ఈ రాశిలో ఈ ఏడాది అక్టోబర్ 24 వరకు కొనసాగడం జరుగుతుంది. వివిధ రాశులకు, ముఖ్యంగా సైన్స్ టెక్నాలజీ రంగాలకు సంబంధించిన రాశుల వారికి ఈ రాహు సంచారం ఏ విధంగా పనిచేసేది ఇక్కడ పరిశీలిద్దాం.
- మేష రాశి: ఈ రాశి వారు సైన్స్, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంజనీరింగ్ వంటి రంగాలకు చెందినవారు అయ్యే పక్షంలో వీరికి తప్పకుండా బ్రహ్మాండమైన రాజయోగం పట్టే అవకాశం ఉంది. వీరి ఆలోచనలు జీవనశైలి ప్రయత్నాలలో సమూలమైన మార్పు చోటు చేసుకుంటుంది. విపరీతంగా యాంబిషన్ పెరుగుతుంది. తమ నైపుణ్యాలను వృద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆధునిక విద్య మీద దృష్టి పెడతారు. మొత్తానికి ఈ రంగాలకు చెందిన వారు ఎంతగానో పురోగతి చెందే అవకాశం ఉంది.
- వృషభ రాశి: ఈ రాశి వారిని రాహు గ్రహం తప్పకుండా విదేశాలకు తీసుకువెళుతుంది. వీరు తమ ప్రతిభ పాటవాలకు పదును పెడతారు. తమ చదువులను బట్టి వివిధ రంగాలలో తప్పకుండా రాణించడం జరుగుతుంది. వ్యయ స్థానంలో ఉన్న రాహువు ఈ రాశి వారి జీవితంలో సమూల మైన మార్పులు తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వీరు తమను తాము ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటారు. మంచి టెక్నాలజీ సంస్థలో స్థిరపడే అవకాశం ఉంది.
- మిథున రాశి: ఈ రాశికి చెందిన వారు ఏ చదువులో లేదా ఏ ఉద్యోగంలో ఉన్నప్పటికీ తప్పనిసరిగా కొత్త నైపుణ్యాలను, ఆధునిక పరిణామాలను వంట పట్టించుకోవలసి వస్తుంది. ఐటీ రంగంలో ఈ రాశి వారు తగిన గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది. వీరి ఆలోచన విధానంలో మార్పులు చోటు చేసుకుంటాయి. సంప్రదాయ విరుద్ధంగా వ్యవ హరించే అవకాశం ఉంది. పాశ్చాత్య దేశాలకు పయనం కావడం ఖాయంగా జరుగుతుంది. ఈ ఏడాది అక్టోబర్ 24 లోపల వీరు ఒక ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీలో చేరే అవకాశం ఉంది.
- కర్కాటక రాశి: ఈ రాశి వారి వృత్తి, ఉద్యోగ జీవితం తప్పకుండా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంది. కొత్త రకం ఆశలతో సరికొత్త ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది. వృత్తిపరంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకునే ప్రయత్నం జరుగుతుంది. ఉద్యోగంలో కూడా సరికొత్త బాధ్యతలు స్వీకరించవలసి వస్తుంది. జీవితం అనుకోకుండా ఒక కొత్త మలుపు తిరుగుతుంది. సైన్స్, ఐటి రంగాల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల కారణంగా దూరప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.
- సింహ రాశి: ఈ రాశి వారు తమ స్థిరమైన భావాలను తప్పనిసరిగా మార్చుకోవలసి వస్తుంది. ఉద్యోగ పరంగా కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగపరంగా తమ నైపుణ్యాలను అప్డేట్ చేసుకోవలసి వస్తుంది. వ్యక్తిగత జీవితం కూడా ఆధునిక భావాలతో నిండిపోయే అవకాశం ఉంది. సమూలమైన మార్పులకు కారకుడైన రాహువు భాగ్యస్థానంలో సంచరిస్తున్నందువల్ల తప్పనిసరిగా విదేశాలలో స్థిరపడే అవకాశం ఉంది. తాను చేస్తున్నది ఏ ఉద్యోగం అయినప్పటికీ ఆ ఉద్యోగంలో మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
- కన్యా రాశి: ఈ రాశి వారు తప్పనిసరిగా కొత్త విద్యలను కొత్త నైపుణ్యాలను అలవరచుకోవలసి వస్తుంది. ఉద్యోగం మారే అవకాశం ఉన్నందువల్ల కొత్త ఉద్యోగానికి సంబంధించిన పద్ధతులను నేర్చు కోవడం జరుగుతుంది. అక్టోబర్ లోపల జీవన శైలిలో కూడా మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొత్త రంగాలలో పెట్టుబడులు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారాల తీరు మారిపోవడం జరుగుతుంది. రాహువు గురు గ్రహంతో కలిసి ఉండటం వల్ల ఈ రాశికి చెందిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు కూడా తమ బోధనా పద్ధతులను మార్చుకోవడం జరుగుతుంది.
- తులా రాశి: ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో పెను మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఆధునిక నైపుణ్యాల కోసం శిక్షణ కోసం వృత్తి నిపుణులు విదేశాలకు వెళ్ళవలసిన అవసరం ఏర్పడుతుంది. వ్యక్తిగత జీవితంలో సైతం మార్పులు జరిగే అవకాశం ఉంది. స్వయం ఉపాధి, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ వంటి రంగాలకు చెందిన వారు కొత్త ప్రయత్నాలు కొత్త పద్ధతులు చేపట్టడం జరుగుతుంది. ఈ కారణంగా తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
- వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ప్రధానంగా ఉద్యోగ బాధ్యతలలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా అధికారం దక్కే అవకాశం ఉన్నందు వల్ల కొంత శిక్షణ పొందడం జరుగు తుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ రంగాలకు చెందిన విద్యార్థులు మరింత ఎక్కువగా పుస్తక పఠనం చేయవలసి వస్తుంది. వృత్తి నిపుణులు పరిశోధన, శిక్షణ లేదా అప్డేట్ల కోసం విదేశాలు వెళ్లవలసి వస్తుంది. రాహు గ్రహం మేషరాశిలో ఉన్నంతకాలం ఈ రాశి వారికి తరచూ ప్రయాణాలు తప్పకపోవచ్చు.
- ధనూ రాశి: ఈ రాశికి నాధుడైన గురుగ్రహంతో రాహువు కలిసి ఉన్నందువల్ల ఈ రాశి వారు తప్పకుండా వృత్తి ఉద్యోగాల పరంగా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఆధునిక రంగాలలో శిక్షణ పొందడం కూడా జరుగుతుంది. ఐటి రంగానికి చెందినవారు గుర్తింపు పొందే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితంలో కొన్ని శుభ పరిణామాలతో పాటు అనేక సానుకూల మార్పులు, చోటు అవసర మార్పులు చోటు చేసుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆధునిక శాస్త్రీయ ధోరణి అలవాటు అయ్యే అవకాశం ఉంది.
- మకర రాశి: ఈ రాశికి చెందిన విద్యార్థులు ఉద్యోగులు వృత్తి నిపుణులు కొత్తరకం జీవన శైలికి, జీవన విధానానికి అలవాటు పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులు మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు కొత్త కోర్సులను ఎంచుకోవడం జరుగుతుంది. ఈ రాశికి చెందిన ఐటీ నిపుణులకు తప్పకుండా విదేశీ కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో కొత్త ప్రయోగాలు చేసే సూచనలు కూడా ఉన్నాయి.
- కుంభ రాశి: ఇంతకాలంగా స్థిరంగా కూర్చుని ఉద్యోగం చేస్తున్న ఈ రాశి వారు దూర ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. ఉద్యోగ బాధ్యతలు మారటం వల్ల వీరి జీవనశైలి కూడా మారే అవకాశం ఉంది. ఉద్యోగాలలో మార్పును కోరుకుంటున్న వారు తప్పకుండా కొత్త జీవితం అనుభవించే సూచనలు ఉన్నాయి. ఇష్టం ఉన్నా లేకపోయినా ఉద్యోగం మార్పుతో సర్దుకుపోవల సిన అవసరం ఏర్పడుతుంది. ఈ రాశికి చెందిన వారు తమ స్థిరమైన భావాలను మార్చుకోవలసి వస్తుంది.
- మీన రాశి: ఈ రాశి వారు తప్పనిసరిగా కొత్త కోర్సులను నేర్చుకోవాల్సి వస్తుంది. ఉద్యోగ జీవితంలో చోటు చేసుకున్న మార్పులతో సర్దుకు పోవాల్సి వస్తుంది. ఉద్యోగ పరంగా కొత్తరకం ఆలోచనలు, కొత్తరకం ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది. వృత్తి జీవితం సమూలంగా మారిపోతుంది. వ్యాపారంలో స్థిర పడటానికి, అభివృద్ధి చెందటానికి కొత్త పద్ధతులు అనుసరించవలసి ఉంటుంది. మేష రాశిలో రాహువు సంచరిస్తున్నంత కాలం ఈ రాశి వారి జీవితం క్షణం కూడా తీరికలేని స్థాయిలో ఉంటుంది.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..