AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: ఆలస్యానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఈ రాశుల వారికి పని అప్పగిస్తే అంతే సంగతులు..

కొందరు వ్యక్తులు ఏ పని చేపట్టినా ఏదో ఒక కారణంతో ఆలస్యం చేస్తుంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. చివరి నిమిషంలో పనులు పూర్తి చేయడంలో వీరికి ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాదు, ఎక్కడికెళ్లినా ఆలస్యంగా వెళ్తుంటారు. కొన్నిసార్లు అది హద్దులు కూడా దాటిపోతుంది. అందుకే వీరిని 'లేట్ కమర్స్' అని అంటుంటారు. ఈ సందర్భంగా ఏ రాశుల వారు తరచుగా ఆలస్యం చేస్తారనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్యం ప్రకారం, ఈ అలసత్వ తత్వం గల రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

Astrology: ఆలస్యానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఈ రాశుల వారికి పని అప్పగిస్తే అంతే సంగతులు..
Zodiac Signs Delays In Everything
Bhavani
|

Updated on: Jun 30, 2025 | 4:39 PM

Share

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలు, నక్షత్రాలను బట్టి పన్నెండు రాశుల లక్షణాలు భిన్నంగా ఉంటాయి. కొన్ని రాశుల వారు పనుల విషయంలో కచ్చితమైన సమయపాలన పాటిస్తారు. తమకు అప్పగించిన పనిని సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. మరికొన్ని రాశుల వారు తాము చేసే ఏ పనినైనా చాలా ఆలస్యం చేస్తుంటారు. ముఖ్యంగా గడువులోపు పనులు పూర్తి చేసేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వృషభ రాశి

వృషభ రాశి వారు తమ పనులను తరచుగా వాయిదా వేస్తుంటారు. వీరు పని కంటే నిద్రకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. దీనివల్ల తెలియకుండానే సగం రోజు గడిచిపోతుంది. దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టడం వీరికి చాలా కష్టం. అందుకే వీరు చేసే పనులన్నీ ఆలస్యమవుతుంటాయి. అందరిలా కష్టపడి పని చేయడానికి ఇష్టపడరు. ఎప్పటికీ అందరికంటే వెనుక ఉండాలని భావిస్తారట.

తులా రాశి

తులా రాశి వారు తరచుగా సరైన నిర్ణయాలు తీసుకోలేరు. అయితే, వీరు గొప్ప ప్రణాళికలు వేస్తారు. వచ్చే ఐదేళ్లకు సంబంధించి ఒకేసారి ప్రణాళికలు వేసుకోగలరు. కానీ, తమ ప్రణాళికలను అమలు చేసే విషయానికొస్తే, ప్రతి దాంట్లో లాభనష్టాలను బేరీజు వేసుకుంటారు. ఈ కారణం వల్ల ప్రతి ఒక్క పనిలో ఒక అభిప్రాయానికి రావడం చాలా కష్టమవుతుంది. దీనితో వీరు చేసే పనులన్నీ ఆలస్యమవుతుంటాయి. చాలాసార్లు వీరికి తెలియకుండానే పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

ధనస్సు రాశి

ధనస్సు రాశి వారు ఏదైనా పనిని చివరి నిమిషంలోపు పూర్తి చేయడం దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. వీరు ఎప్పుడైతే వినోదాత్మక కార్యక్రమాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారో, ఆ సమయంలో చేయాల్సిన పనుల గురించి మరచిపోతారు. వీరు ఒక జాబితాను తయారు చేసుకుని తమ జీవితాన్ని పూర్తి స్థాయిలో గడపాలని కోరుకుంటారు. అందుకే ప్రతిదాన్ని షెడ్యూల్ ప్రకారం చేయడంలో విఫలమవుతారు. ఈ కారణం వల్ల వీరి పని చాలా వరకు తీవ్రంగా ప్రభావితమవుతుంది.

మీన రాశి

మీన రాశి వారు ఎక్కువగా అంతర్ముఖులుగా ఉంటారు. వీరు తమ మనసుకు నచ్చిన పనులే చేస్తారు. పగటి కలలు ఎక్కువగా కంటారు. తమ మనసులో ఎక్కువగా ఊహించుకుంటూ ఊహాలోకంలో గడిపేస్తారు. అలాగే ప్రణాళిక ప్రకారం పనులు చేసుకుంటూ పోతారు. కలల ప్రపంచంలోనే ఎక్కువగా జీవిస్తారు. వాస్తవ ప్రపంచానికి చాలా దూరంగా ఉంటారు. అందుకే సులభంగా తాము చేయాల్సిన పనులను ఆలస్యం చేస్తుంటారు.

గమనిక: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.