- Telugu News Photo Gallery Spiritual photos Retrograde Saturn in Pisces 2025: Positive Impact on These Zodiac Signs Details in Telugu
Lord Shani Vakri: శని వక్రిస్తే ఈ రాశుల దశ తిరిగినట్టే..! ఇందులో మీ రాశి ఉందా..?
Retrograde Saturn in Pisces 2025: జూలై 13 నుంచి నవంబర్ 28 వరకు మీన రాశిలో శనీశ్వరుడు వక్రించడం జరుగుతోంది. సాధారణంగా మందగమనంతో వ్యవహరించే శని వక్రించే పక్షంలో శనిలో వేగం పెరుగుతుంది. వక్ర గతి వల్ల వచ్చే వేగాన్ని, చురుకుదనాన్ని జ్యోతిషశాస్త్రంలో చేష్టా బలమని అంటారు. ఈ బలం కారణంగా శని స్వతంత్రంగా వ్యవహరించడం జరుగుతుంది. దీనివల్ల వృషభ, మిథునం, కన్య, తుల, మకర, కుంభ రాశుల వారు ఏ రంగంలో ఉన్న వారి జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. వారి ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.
Updated on: Jun 30, 2025 | 3:53 PM

వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు వక్రించడం వల్ల ఈ రాశివారికి రాజ యోగాలు పడతాయి. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. ఈ రాశికి చెందిన నిరుద్యోగులకు తప్పకుండా విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా నూరు శాతం నెరవేరుతుంది. జీవనశైలి మారిపోతుంది. ఈ రాశిలో జన్మించిన సగటు వ్యక్తి కూడా సంపన్నుడవుతాడు. ఉన్నత స్థాయి కుటుంబంతో వివాహం కుదురుతుంది.

మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో శని వక్రించడం వల్ల విదేశీయానానికి తప్పకుండా మార్గం సుగమం అవుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. విదేశాల్లో ఉన్నవారు ఉద్యోగాల్లో స్థిరపడతారు. పిత్రార్జితం లభించే అవకాశం ఉంది. ఆస్తి సమస్యలు, వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు తప్పకుండా పదవీ యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా బాగా పురోగతి చెందే అవకాశం ఉంది.

కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో సంచారం చేస్తూ దిగ్బలం కలిగి ఉన్న శనీశ్వరుడు వక్రించడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా రాజయోగాలు కలుగుతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. రాజకీయాలు, ప్రభుత్వం, రియల్ ఎస్టేట్ వంటి రంగాలవారు అందలాలు ఎక్కుతారు. కొద్ది ప్రయత్నంతో నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.

తుల: ఈ రాశికి షష్ట స్థానంలో సంచారం చేస్తున్న శని వక్రించడం వల్ల ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందడం వల్ల ఆర్థిక సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి. వ్యక్తిగత, అనారోగ్య సమస్యల నుంచి దాదాపు పూర్తిగా బయటపడడం జరుగుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. నిరుద్యోగులు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ప్రత్యర్థులు, పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు.

మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న రాశ్యధిపతి శని వక్రించడం వల్ల ఏ ప్రయత్నం చేపట్టినా నెరవేరుతుంది. ఆత్మవిశ్వాసం, తెగువ, చొరవ, పట్టుదల, సాహసం వంటి లక్షణాలు బాగా వృద్ధి చెందుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదవీ యోగం పడుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఉన్న ఊర్లోనే కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది.

కుంభం: ధన స్థానంలో ఉన్న రాశ్యధిపతి శని వక్రించడం వల్ల ఏలిన్నాటి దోషం బాగా తగ్గే అవకాశం ఉంది. వ్యక్తిగత, ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు వంటివి విశేషంగా లాభిస్తాయి. సంతాన యోగం కలుగుతుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి.



