AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుజ, రవుల అనుకూలత.. ఈ ఏడాది సవాళ్లు, సమస్యలను ఎదుర్కొనే రాశులివే!

కుజ, రవుల అనుకూలత కారణంగా ఈ ఏడాది కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలుంటాయి. మేషం, మిథునం, సింహం, తుల, వృశ్చికం, ధనస్సు రాశులవారు ఈ ఏడాది సవాళ్లను అధిగమించి విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపార రంగాలలో అభివృద్ధి, ఆర్థిక లాభాలు, కుటుంబ సమస్యల పరిష్కారం వంటి అంశాలను ఇక్కడ వివరించడం జరిగింది.

కుజ, రవుల అనుకూలత.. ఈ ఏడాది సవాళ్లు, సమస్యలను ఎదుర్కొనే రాశులివే!
Telugu Astrology
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 30, 2025 | 4:48 PM

Share

జ్యోతిషశాస్త్రం ప్రకారం జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ కుజ, రవులు బలంగా, అనుకూలంగా ఉన్న రాశులవారు ఎటువంటి సవాళ్లనైనా, సమస్యలనైనా అధిగమించి జీవితంలో దూసుకుపోగలుగుతారు. ఈ ఏడాది చివరి వరకూ ఈ రెండు పోరాట గ్రహాలు బలంగా ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, తుల, వృశ్చికం, ధనూ రాశులు. పట్టుదలకు, సాహసానికి, తెగువకు మారుపేరైన ఈ రాశులవారు అనేక అవరోధాలను, ఆటంకాలను, అవాంతరాలను అధిగమించి తప్పకుండా ఆదాయాన్ని పెంచుకోవడం, ఉద్యోగంలో అందలాలు ఎక్కడం, వృత్తి, వ్యాపారాలను లాభాల బాట పట్టించడం జరుగుతుంది.

  1. మేషం: పట్టుదల, తెగువ, మితిమీరిన ఆత్మవిశ్వాసం కలిగిన ఈ రాశివారు నిర్భయంగా ఎటువంటి సవాలునైనా ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులు అలవికాని లక్ష్యాలను అప్పగించినా, భారీ ప్రాజెక్టులను అప్పగించినా వీరు సకాలంలో సంతృప్తికరంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి, వ్యాపారాలను సరైన నిర్ణయాలు, సరైన మార్పులతో లాభాల బాట పట్టించడం జరుగుతుంది. సరికొత్త నైపుణ్యాలను అలవరచుకుంటారు. గట్టి పట్టుదలతో ఆదాయాన్ని పెంచుకుంటారు.
  2. మిథునం: సహజసిద్దమైన తెలివితేటలు, సమయస్ఫూర్తి, దూరదృష్టి కలిగిన ఈ రాశివారు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఆర్థిక, వ్యక్తిగత, కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబ బాధ్యత లను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఉద్యోగంలో సీనియర్ల మీద పైచేయి సాధించి పదోన్నతులు పొందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సరికొత్త ఆలోచనలను, మార్పులను చేపట్టి లాభాల పరంగా ముందుకు తీసుకువెడతారు. ఎన్ని సమస్యలు ఎదురైనా తమ లక్ష్యాలను సాధిస్తారు.
  3. సింహం: సహజ నాయకత్వ లక్షణాలు, అందరినీ కలుపుకునిపోయే తత్వం, దూసుకుపోయే లక్షణం కలి గిన ఈ రాశివారిని అష్టమ శని గానీ, సప్తమ రాహువు గానీ నిరోధించే అవకాశం ఉండదు. రాశ్యధిపతి రవితో పాటు, ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు ఈ ఏడాదంతా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వీరిలో పట్టుదల, తెగువ, చొరవ బాగా వృద్ధి చెందుతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమ స్యల నుంచి పూర్తిగా బయటపడతారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు.
  4. తుల: ఈ రాశికి లాభాధిపతి రవి, ధనాధిపతి కుజుడు బాగా అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల వీరు కొద్ది ప్రయత్నంతో ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. వీరిలో దూర దృష్టి, లౌక్యం, లాభనష్టాల బేరీజు తత్వం ఎక్కువగా ఉన్నందువల్ల ప్రతి సమస్యనూ పట్టుదలగా పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో సీనియర్ల నుంచి ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. స్వయం కృషితో ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు.
  5. వృశ్చికం: దూర దృష్టి కలిగి ఉండడంతో పాటు, వ్యూహ రచనలో, ప్రణాళికలు రూపొందించడంలో సిద్ధహస్తు లైన ఈ రాశివారికి ఈ ఏడాది కెరీర్ పరంగా అనేక సవాళ్లు, సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే, వీరు వీటిని అధిగమించి అందలాలు ఎక్కగలుగుతారు. రాశ్యధిపతి కుజుడు బాగా బలంగా ఉండడంతో పాటు, రవి కూడా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగ పరంగా, ఆర్థికంగా అగ్ర స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల్ని కూడా చాలావరకు పరిష్కరించుకుంటారు.
  6. ధనుస్సు: ఈ రాశివారిలోని ధైర్య సాహసాలు, వీరత్వం, లక్ష్యసాధన, యాంబిషన్ వంటి లక్షణాలు ఎటువంటి సవాలునైనా, సమస్యనైనా పరిష్కరిస్తాయి. వీరిలోని లౌక్యం, కార్యదక్షతల వల్ల వృత్తి, వ్యాపారాలు లాభాలు పండించడంతో పాటు, ఉద్యోగంలో అధికార యోగం కూడా కలుగుతుంది. నిరుద్యోగులు ఎటువంటి పోటీ పరీక్షల్లోనైనా, ఇంటర్వ్యూల్లోనైనా విజయాలు సాధిస్తారు. ఒక సవాలుగా తీసు కుని వృత్తి, వ్యాపారాలను విజయాల బాట పట్టిస్తారు. అనేక మార్గాలో ఆదాయం పెరుగుతుంది.