Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raja Yoga: ధనూ రాశిలో రవి ప్రవేశం.. ఆ రాశుల వారికి రాజ యోగం.. అందులో మీరున్నారా..?

Zodiac Signs in Telugu: ఈ నెల 17న(ఆదివారం) ధనూరాశిలో ప్రవేశించిన రవి.. జనవరి 17 వరకూ అదే రాశిలో కొనసాగడం జరుగుతుంది. ఈ రాశి రవికి మిత్ర క్షేత్రం. అందువల్ల ఏడు రాశుల వారికి తప్పకుండా యోగం పట్టించడం జరుగుతుంది. రవి గ్రహ రాజు అయినందువల్ల అత్యధికంగా శుభ ఫలితాలనిచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మేషం, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారికి రవి ధనూ రాశిలో ఉన్నంత కాలం జీవితం ‘రాజయోగం’గా సాగిపోతుంది.

Raja Yoga: ధనూ రాశిలో రవి ప్రవేశం.. ఆ రాశుల వారికి రాజ యోగం.. అందులో మీరున్నారా..?
Sun Transit 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 18, 2023 | 3:30 PM

ఈ నెల 17న ధనూరాశిలో ప్రవేశించిన రవి.. జనవరి 17 వరకూ అదే రాశిలో కొనసాగడం జరుగుతుంది. ఈ రాశి రవికి మిత్ర క్షేత్రం. అందువల్ల ఏడు రాశుల వారికి తప్పకుండా యోగం పట్టించడం జరుగుతుంది. రవి గ్రహ రాజు అయినందువల్ల అత్యధికంగా శుభ ఫలితాలనిచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మేషం, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారికి రవి ధనూ రాశిలో ఉన్నంత కాలం జీవితం ‘రాజయోగం’గా సాగిపోతుంది. అనుకున్న పనులు పూర్తి కావడం, గౌరవ మర్యాదలు పెరగడం, వృత్తి, ఉద్యోగాలలో అధికారం దక్కడం, రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించడం వంటివి జరుగుతాయి.

  1. మేషం: ఈ రాశికి నవమ స్థానంలో ప్రవేశిస్తున్న రవి వల్ల ఈ రాశివారికి మహా భాగ్య యోగం పట్టడంతో పాటు రాజయోగ ఫలితాలు కూడా అనుభవానికి వస్తాయి. రాజకీయ నేతల నుంచి, ప్రభుత్వం నుంచి ఆదరణ లభిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. విదేశాల నుంచి శుభవార్తలు అందుతాయి. విదేశీ యానానికి సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి. తండ్రి నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది.
  2. సింహం: ఈ రాశికి అధిపతి అయిన రవి పంచమ స్థానంలో, పైగా మిత్ర క్షేత్రంలో ప్రవేశించడం వల్ల అనేక శుభ ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల పరం గానే కాకుండా సామాజికంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. మీ సలహాలు, సూచనలు, ఆలో చనలు అధికారులకు ఉపయోగపడతాయి. ఇష్టమైన వ్యక్తుల్ని, ఇష్టమైన ఆలయాల్ని సందర్శిస్తారు.
  3. తుల: ఈ రాశివారికి లాభ స్థానాధిపతి అయిన రవి తృతీయంలో ప్రవేశించడం వల్ల ఈ రాశివారు ఎటు వంటి ప్రయత్నం తలపెట్టినా సునాయాసంగా నెరవేరుతుంది. ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, చొరవ పెరిగి అనుకున్నవి సాధించడం జరుగుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు, విహార యాత్రలకు అవకాశం ఉంది. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ధనవృద్ధికి అవకాశం ఉంది.
  4. వృశ్చికం: ఈ రాశివారికి ద్వితీయ స్థానంలో రవి ప్రవేశం వల్ల ఆర్థిక వ్యవహారాలు పూర్తి స్థాయిలో చక్కబడే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలపరంగా ధన వృద్ధి కలుగుతుంది. రాజకీయాల్లో ఉన్నవారు ఒక వెలుగు వెలుగుతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో ఫలిస్తాయి. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. కుటుంబ, దాంపత్య జీవితాలు సుఖ సంతోషాలతో వెల్లి విరుస్తాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ప్రభుత్వపరమైన సమస్యలు తొలగిపోతాయి.
  5. ధనుస్సు: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన రవి ఈ రాశిలో ప్రవేశించడం వల్ల ఆకస్మిక ధన లాభానికి, ఆస్తి కలసి రావడానికి, ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం కావడానికి, ప్రభుత్వపరంగా అదృ ష్టం పట్టడానికి అవకాశం ఉంటుంది. తండ్రి నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలకు, స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంది. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు, విహార యాత్రలు చేయడం జరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
  6. కుంభం: ఈ రాశివారికి లాభస్థానంలో రవి ప్రవేశించడం వల్ల అన్ని విషయాల్లోనూ అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. శుభ కార్యాలు జరుగుతాయి. శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఏలిన్నాటి శని ప్రభావం చాలావరకు తగ్గిపోతుంది. తండ్రి నుంచి ఆస్తి లభిస్తుంది. ఎటువంటి ప్రయత్నమైనా నెరవేరుతుంది. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు అందివస్తాయి.
  7. మీనం: ఈ రాశికి దశమ స్థానంలోకి రవి ప్రవేశించడం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. తప్పకుండా అధికారం చేపట్టడం జరుగుతుంది. అన్ని విధాలుగానూ ఆదాయం వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు ఆశించిన సంస్థలో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. కొన్ని ముఖ్య మైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇష్టమైన పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.