Maha Yogas: అనూకూలంగా శుక్ర గ్రహం.. ఆ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు పక్కా..!
శుక్రుడు స్త్రీ గ్రహం. పైగా మహిళా పక్షపాతి. ఈ గ్రహం ఉచ్ఛ స్వక్షేత్రాల్లో ఉన్నప్పుడు పురుషుల కంటే ఎక్కువగా మహిళలకే యోగాలనిస్తాడు. అదృష్టాలను కలగజేస్తాడు. ప్రస్తుతం స్వస్థానమైన వృషభంలో శుక్రుడు సంచారం ప్రారంభించినందువల్ల మహిళల జీవితాలను శుక్రుడు సమూలంగా మార్చేసే అవకాశముంది. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న మహిళలకు కలలో కూడా ఊహించని భాగ్య, అధికార యోగాలను ఇవ్వడం జరుగుతుంది.
శుక్రుడు స్త్రీ గ్రహం. పైగా మహిళా పక్షపాతి. ఈ గ్రహం ఉచ్ఛ స్వక్షేత్రాల్లో ఉన్నప్పుడు పురుషుల కంటే ఎక్కువగా మహిళలకే యోగాలనిస్తాడు. అదృష్టాలను కలగజేస్తాడు. ప్రస్తుతం స్వస్థానమైన వృషభంలో శుక్రుడు సంచారం ప్రారంభించినందువల్ల మహిళల జీవితాలను శుక్రుడు సమూలంగా మార్చేసే అవకాశముంది. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న మహిళలకు కలలో కూడా ఊహించని భాగ్య, అధికార యోగాలను ఇవ్వడం జరుగుతుంది. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, కన్య, వృశ్చికం, మకర రాశులకు చెందిన మహిళలకు వృషభ శుక్రుడి ఫలితాలు వంద శాతం వర్తిస్తాయి. జూన్ నెల 12 వరకు ఈ రాశుల మహిళలకు ఏదో రూపేణా అదృష్టం పడుతూనే ఉంటుంది.
- మేషం: ఈ రాశికి ధన, కుటుంబ స్థానంలో శుక్ర సంచారం వల్ల కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. సంతానం లేని వారు శుభవార్త వింటారు. అవివాహితలకు కొద్ది ప్రయత్నంతో మంచి పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో వీరికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. పుట్టింటి ఆస్తి లభి స్తుంది. అత్తవారి ఇంట్లో అనుకూలతలు పెరుగుతాయి. ఈ రాశి మహిళలకు లక్ష్మీయోగం పడుతుంది.
- వృషభం: ఈ రాశిలో శుక్ర సంచారం వల్ల ఈ రాశికి చెందిన మహిళలకు మాలవ్య మహా పురుష యోగం పడుతుంది. దీనివల్ల ఒక ప్రముఖ వ్యక్తి స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ యోగం కార ణంగా ఈ రాశి మహిళలకు సర్వత్రా ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా అంద లాలు ఎక్కుతారు. కుటుంబ సమస్యలు, దాంపత్య సమస్యలకు అవకాశం ఉండదు. సంతాన యోగం కలుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది. తమ ప్రతిభను నిరూపించుకుంటారు.
- కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానంలో శుక్ర సంచారం వల్ల ఈ రాశి మహిళలకు సర్వత్రా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. అనారోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి జీవితంలో రాబడి బాగా పెరుగు తుంది. ఉద్యోగంలో పదోన్నతికి, అధికార యోగానికి అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగం లోకి మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులు కొద్ది ప్రయత్నంతో ఆఫర్లు అందుకుంటారు. సంసార జీవితంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఎటువంటి సమస్యలున్నా పరిష్కారమవుతాయి.
- సింహం: ఈ రాశివారికి దశమ కేంద్రంలో శుక్రుడు స్వస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల మాలవ్య మహా పురుష యోగం ఏర్పడింది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారులతో అధి కారాలను పంచుకోవడం గానీ, ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించడం గానీ జరుగుతుంది. సామాజి కంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. విహార యాత్రలకు వెడతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.
- కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్ర సంచారం వల్ల విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. విదేశీ సంపదను ఆర్జించే అవకాశం ఉంది. విదేశాల్లో చదువులు, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న మహిళలకు శుభవార్తలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. అనేక శుభ పరి ణామాలు చోటు చేసుకుంటాయి. పుట్టింటి నుంచి ఆస్తి లభిస్తుంది. అత్తవారింట్లో ప్రాభవం పెరుగు తుంది. వృత్తి జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. అనారోగ్యం నుంచి కోలుకునే అవకాశం ఉంది.
- వృశ్చికం: ఈ రాశివారికి సప్తమ కేంద్రంలో శుక్ర సంచారం వల్ల మాలవ్య మహా పురుష యోగం ఏర్పడింది. అనుకోకుండానూ, అకస్మాత్తుగానూ జీవనశైలి మారిపోతుంది. సంపన్న జీవితంలోకి అడుగుపె ట్టడం జరుగుతుంది. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదరడం గానీ, అటువంటి కుటుం బానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం గానీ జరుగుతుంది. దాంపత్య జీవితంలోని సమస్యలు తొలగిపోతాయి. అన్యోన్యత, అనుకూలతలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది.
- మకరం: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు పంచమ కోణంలో సంచారం ప్రారంభించినందువల్ల తప్పకుండా వీరి ఆశలు నెరవేరుతాయి. ఈ రాశికి చెందిన మహిళలకు సంతాన యోగానికి అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వీరు అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనే అవకాశం ఉంది. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో వీరికి ఆదరణ బాగా పెరుగుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది.