Weekly Horoscope: ఆ రాశివారి ఆర్థిక పరిస్థితికి లోటుండదు.. 12 రాశుల వారికి వారఫలాలు ఇలా..

వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు): మేష రాశి వారికి ఈ వారం ధన స్థానం, లాభ స్థానం బాగా బలంగా ఉన్నందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృషభ రాశి వారికి ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మిథున రాశి వారి ఆదాయానికి లోటుండదు కానీ, వ్యయ స్థానంలో మూడు గ్రహాలు కలవడం వల్ల ఖర్చులు, సహాయాలు బాగా పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

Weekly Horoscope: ఆ రాశివారి ఆర్థిక పరిస్థితికి లోటుండదు.. 12 రాశుల వారికి వారఫలాలు ఇలా..
Weekly Horoscope 19 May 25 May 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: May 19, 2024 | 7:22 AM

వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు): మేష రాశి వారికి ఈ వారం ధన స్థానం, లాభ స్థానం బాగా బలంగా ఉన్నందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృషభ రాశి వారికి ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మిథున రాశి వారి ఆదాయానికి లోటుండదు కానీ, వ్యయ స్థానంలో మూడు గ్రహాలు కలవడం వల్ల ఖర్చులు, సహాయాలు బాగా పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ధన స్థానం, లాభ స్థానం బాగా బలంగా ఉన్నందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల సత్ఫలితాలు ఉంటాయి. ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. రావలసిన డబ్బు కూడా చేతికి అందుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సామాజికంగా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. అనవసర ఖర్చులు బాగా తగ్గిపోతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తలు పాటించడం మంచిది. నిరు ద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు కూడా సఫలం అయ్మే అవకాశముంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఈ రాశిలో రాశ్యధిపతి శుక్రుడు, గురువుతో సంచారం చేస్తున్నందువల్ల ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో సానుకూలతలతో పాటు స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా చక్కబెడతారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మారతాయి. జీవిత భాగస్వామితో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల్లో మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగు తుంది. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

లాభ స్థానంలో రాశ్యధిపతి బుధుడు ఉండడం వల్ల ఆదాయానికి లోటుండదు కానీ, వ్యయ స్థానంలో మూడు గ్రహాలు కలవడం వల్ల ఖర్చులు, సహాయాలు బాగా పెరుగుతాయి. శుభ కార్యాల మీద బాగా ఖర్చు పెరుగుతుంది. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా సాగిపో తాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, లావాదేవీలు విజ యవంతంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగుపడుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగానే పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో మీకు బాగా విలువ, ప్రాధాన్యం పెరిగే అవకాశ ముంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

లాభ స్థానంలో శుక్ర, గురు, రవులు యుతి చెందడం వల్ల అష్టమ దోషం కూడా తగ్గిపోతుంది. కొన్ని కష్ట నష్టాల నుంచి బయటపడతారు. వ్యక్తిగత, కుటుంబ సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో ఒకటి రెండు శుభ ఫలితాలు కూడా అనుభవానికి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభా లకు లోటుండదు. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్ప డతాయి. ఆస్తి వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ఆస్తి విలువ బాగా పెరుగుతుంది. ఆర్థిక విష యాల్లో జీవిత భాగస్వామి సలహాలు బాగా కలిసి వస్తాయి. బంధువుల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

దశమ స్థానంలో శుభ గ్రహాలు కేంద్రీకృతం కావడంతో పాటు, రాశ్యధిపతి రవి కూడా దశమంలోనే ఉండడం వల్ల వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటుచేసుకునే అవకాశముంది. నిరుద్యోగులకు ఆశించిన సంస్థలో కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశముంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు శుభ ఫలితాలనిస్తాయి. ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితంలో కలలో కూడా ఊహించని గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆరవ స్థానంలో శనీశ్వరుడు, భాగ్య స్థానంలో శుక్ర, గురువులు కొండంత అండగా ఉంటారు. ఫలితంగా ఆర్థిక పరిస్థితికి లోటుండదు. సమస్యలు, అవసరాలు తీరిపోతాయి. ఆరోగ్యం కూడా బాగా మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. కుటుంబ పరిస్థితులు చాలా వరకు సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు కూడా చాలావరకు సత్ఫలితాలని స్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగి పోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత, సామ రస్యం పెరుగుతాయి. నిరుద్యోగులు ఆశించిన మంచి ఉద్యోగంలో స్థిరపడే సూచనలున్నాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆరవ స్థానంలో కుజ, రాహువులు, సప్తమంలో బుధుడు కాస్తంత అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి, కోర్టు వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది. అనారోగ్యాల నుంచి కోలుకోవడం ప్రారంభిస్తారు. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. జీవిత భాగ స్వామి నుంచి శుభ వార్తలు వింటారు. తల్లితండ్రుల జోక్యంతో రాజీమార్గంలో ఆస్తి వివాదాన్ని పరి ష్కరించుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. ఇంటా బయటా బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు సానుకూలపడతాయి. జీవిత భాగస్వామితో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభం కలుగు తుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

సప్తమ స్థానంలో గురు, శుక్రుల వంటి శుభ గ్రహాల సంచారం కారణంగా వ్యక్తిగతంగానూ, కుటుంబపరంగానూ కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితం కొన్ని సానుకూల మార్పులకు లోనవుతుంది. పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి బాగా డిమాండ్ పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు రాబడి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్, లిక్కర్ వంటి రంగాలవారు బాగా లబ్ధి పొందుతారు. వ్యాపారులకు సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పడతారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడ తాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా సాగిపోతుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

తృతీయ స్థానంలో శని సంచారం కారణంగా ఆర్థిక స్థితికి, ఆదాయం పెరుగుదలకు అవకాశాలు బాగానే ఉన్నప్పటికీ, ఈ రాశ్యధిపతి గురువు ఆరవ స్థానంలో ఉండడం వల్ల అనుకోని ఖర్చులు మీద పడడం వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ బాగా తగ్గే అవకాశముంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో వీలైనంత ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ముఖ్యమైన అవస రాలు, కొన్ని సమస్యలు తీరిపోతాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా, ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అధికారులు అతిగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అనుకున్న పనులు, వ్యవహారాలు, ఆశించిన విధంగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ధన స్థానంలో రాశ్యధిపతి శని, తృతీయంలో కుజ, రాహువులు, పంచమంలో గురు, శుక్రుల సంచారం వల్ల అనేక విషయాలు శుభప్రదంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. కుటుంబ పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్య మైన వ్యవహారాలలో విజయాలు సాధిస్తారు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు అనుకూలంగా, ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ధన, సుఖ స్థానాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ధనానికి ఇబ్బంది ఉండదు. ఖర్చులు తగ్గించుకుని, పొదుపు పాటిస్తారు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉండే అవకాశముంది. కుటుంబ వ్యవహారాల్లో సొంత ఆలోచనల మీద ఆధారపడడం మంచిది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం శ్రేయస్కరం. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం, గుర్తింపు ఉంటాయి. మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభ్యం కాకపోయినప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలు, పనులను పూర్తి చేస్తారు. గతంలో మీ నుంచి సహాయం పొందినవారు కూడా ముఖం చాటేసే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఒక మోస్తరు లాభాలతో సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధగా ఉండడం మంచిదికాదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆర్థిక వ్యవహారాల్లో గ్రహ బలం అంతగా అనుకూలంగా లేనందువల్ల ఆదాయ వ్యయాల విష యంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం శ్రేయ స్కరం. ఇంటా బయటా అనుకూలతలు తగ్గుతాయి. అతి కష్టం మీద కొన్నిముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆస్తి వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఆస్తి సంబంధమైన క్రయ విక్రయాల్లో కొద్దిపాటి లాభాలు పొందుతారు. వ్యాపారులకు లాభాలు పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడులు పెంచడానికి, వ్యాపారాలను విస్తరించడానికి ఇది సమయం కాదు. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో మొండి బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ప్రయాణాల వల్ల లాభముంటుంది. పిల్లల నుంచి శుభ వార్తలు వినడం జరుగుతుంది.