Astrology: శనిపై శుక్రుడి దృష్టి.. ఆ రాశుల వారికి ధన, రాజయోగాలు పక్కా..!

ఈ నెల(ఆగస్టు) 2వ తేదీ నుంచి 19వ తేదీ వరకు శుక్రుడు సింహ రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ శుక్రుడి మీద కుంభ రాశి నుంచి శని దృష్టి పడుతుంది. ఈ రెండు మిత్ర గ్రహాల పరస్పర దృష్టి వల్ల కొన్ని రాశులకు రాజయోగాలు, ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఆకస్మిక శుభ పరిణామాలకు ఎక్కువగా అవకాశం ఉంటుంది.

Astrology: శనిపై శుక్రుడి దృష్టి.. ఆ రాశుల వారికి ధన, రాజయోగాలు పక్కా..!
Zodiac Signs
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 02, 2024 | 2:58 PM

ఈ నెల 2వ తేదీ నుంచి 19వ తేదీ వరకు శుక్రుడు సింహ రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ శుక్రుడి మీద కుంభ రాశి నుంచి శని దృష్టి పడుతుంది. ఈ రెండు మిత్ర గ్రహాల పరస్పర దృష్టి వల్ల కొన్ని రాశులకు రాజయోగాలు, ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి ఊహించని స్థాయిలో ధన యోగాలు పట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఆకస్మిక శుభ పరిణామాలకు ఎక్కువగా అవకాశం ఉంటుంది.

  1. మేషం: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్రుడి మీద లాభస్థానంలో ఉన్న శని దృష్టి పడినందువల్ల ఉద్యో గాలపరంగా ఈ రాశివారికి కలలో కూడా ఊహించని అదృష్టాలు పడతాయి. రాజయోగాలు అను భవించడం జరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. సంతానపరంగా శుభ వార్తలు వింటారు. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు కూడా ఆఫర్లు అంద డం, మరింత మంచి ఉద్యోగంలోకి మారడం జరుగుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి.
  2. వృషభం: రాశ్యధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలో ఉండడం, ఈ రాశికి అత్యంత శుభుడైన శనీశ్వరుడి దృష్టి ఆ శుక్రుడి మీద పడడం వల్ల వీరు ఉద్యోగాలపరంగా రాజయోగాలను అనుభవించడం జరుగు తుంది. పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు, ఆశించిన బదిలీలకు బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి పూర్తిగా బయటపడడంతో పాటు, వీటికి బాగా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. రాజపూజ్యాలు వృద్ధి చెందుతాయి.
  3. సింహం: ఈ రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడి మీద సప్తమ స్థానం నుంచి శనీశ్వరుడి దృష్టి పడినందు వల్ల ఉద్యోగంలో ఈ రాశివారి ప్రాభవం, ప్రాధాన్యం బాగా వృద్ధి చెందుతాయి. పదోన్నతికి బాగా అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. జీవిత భాగస్వామికి ఉన్నత పద వులు లభిస్తాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. వృత్తి, వ్యాపా రాలు బాగా కలిసి వస్తాయి. విదేశీయానానికి సంబంధించిన ఆటంకాలు, సమస్యలు తొలగిపోతాయి.
  4. తుల: రాశ్యధిపతి శుక్రుడు లాభ స్థానంలో సంచారం చేయడమే ఒక రాజయోగం కాగా, ఈ రాశికి అత్యంత శుభుడైన శని దృష్టి ఆ శుక్రుడి మీద పడడం విపరీత రాజయోగానికి దారి తీస్తుంది. దీనివల్ల సమాజంలోని అత్యంత ప్రముఖులైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం లభించడంతో పాటు హోదాలు, జీతభత్యాలు పెరగడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా లాభాలు గడిస్తాయి.
  5. ధనుస్సు: ఈ రాశికి తృతీయ స్థానంలో ఉన్న శనీశ్వరుడి దృష్టి భాగ్య స్థానంలో ఉన్న శుక్రుడి మీద పడడం వల్ల ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఉద్యోగా ర్థులకు ప్రభుత్వ లేదా బ్యాంక్ ఉద్యోగాలు లభించే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పట్టే అవకాశం ఉంది. ఆశించిన శుభవార్తలు వినే అవకాశముంది.
  6. కుంభం: ఈ రాశిలో సంచారం చేస్తున్న రాశ్యధిపతి శనీశ్వరుడి దృష్టి సప్తమ స్థానంలో ఉన్న శుక్రుడి మీద పడడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఈ రాశివారి ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. అధికార యోగానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు సైతం అందే సూచనలున్నాయి. ధన ప్రవాహం ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?