Lakshmi Yoga: శ్రావణ మాసంలో ఆ రాశుల వారికి లక్ష్మీ యోగం.. పట్టిందల్లా బంగారమే..!
Lakshmi Yoga: ఈ నెల 5 నుంచి సెప్టెంబర్ 3 వరకూ కొనసాగే శ్రావణ మాసంలో కర్కాటకం, సింహం వంటి రాజయోగ రాశుల్లో రవి, శుక్ర, బుధ గ్రహాల సంచారం జరుగుతున్నందువల్ల కొన్ని రాశుల వారికి కలలో కూడా ఊహించని శుభ ఫలితాలు అనుభవానికి రాబోతున్నాయి. ఆ రాశుల వారికి లక్ష్మీ యోగం పట్టే అవకాశం ఉంది. లాటరీలు, షేర్లు, ఆర్థిక లావాదేవీల వంటివి దాదాపు కనక వర్షం కురిపిస్తాయి.
ఈ నెల 5 నుంచి సెప్టెంబర్ 3 వరకూ కొనసాగే శ్రావణ మాసంలో కర్కాటకం, సింహం వంటి రాజయోగ రాశుల్లో రవి, శుక్ర, బుధ గ్రహాల సంచారం జరుగుతున్నందువల్ల కొన్ని రాశుల వారికి కలలో కూడా ఊహించని శుభ ఫలితాలు అనుభవానికి రాబోతున్నాయి. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చిక రాశుల వారికి లక్ష్మీ యోగం పట్టే అవకాశం ఉంది. లాటరీలు, షేర్లు, ఆర్థిక లావాదేవీల వంటివి దాదాపు కనక వర్షం కురిపిస్తాయి. ఆర్థిక వ్యవహారాలకు, అదాయ ప్రయత్నాలకు ఇది బాగా అనుకూలమైన సమయం. ఆర్థిక సమస్యలు బాగా తగ్గిపోయే అవకాశం ఉంది. సుఖ శాంతులు అనుభవానికి వస్తాయి.
- మేషం: ఈ రాశికి 4, 5స్థానాల్లో శుభ గ్రహాల సంచారం వల్ల శ్రావణ మాసమంతా నిత్య కల్యాణం పచ్చ తోరణంలా సాగిపోతుంది. ఆదాయం అనేక రెట్లు వృద్ధి చెందుతుంది. ఇంటి సౌకర్యాలను మెరుగు పరచుకోవడం, మరమ్మతులు చేసుకోవడం, వస్త్రాభరణాలు కొనుగోలు చేయడం వంటివి జరుగు తాయి. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించు తాయి. లాభదాయక స్నేహాలు ఏర్పడతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి.
- వృషభం: ఈ రాశివారికి నాలుగవ స్థానంలో శుభ గ్రహాలన్నీ చేరుతున్నందువల్ల గృహ, వాహన యోగాలు కలిగే అవకాశం ఉంది. ఇంటా బయటా ఒత్తిడి తగ్గి, అనుకూలతలు పెరిగి మానసికంగా ఊరట కలుగుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఆర్థిక పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు అనేక అవకాశాలు లభిస్తాయి. ఆస్తి కలిసి రావడం గానీ, ఆస్తులు కొనడం గానీ జరుగుతుంది. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
- కర్కాటకం: ఈ రాశిలోనూ, ధన స్థానంలోనూ శుభ గ్రహాల సంచారం ఎక్కువగా ఉన్నందువల్ల ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. శుభ కార్యాల మీద భారీగా ఖర్చు చేసే అవకాశం ఉంది. మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడం జరుగుతుంది. కుటుంబ, దాంపత్య జీవితాలు సుఖ సంతోషాలతో సాగిపో తాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
- సింహం: శ్రావణ మాసమంతా ఈ రాశిలో రాశ్యధిపతి రవి, శుక్ర, బుధుల సంచారం వల్ల ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో తప్ప కుండా శుభవార్తలు వింటారు. అనేక విధాలుగా ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.
- తుల: ఈ రాశికి లాభ స్థానంలో శుభ గ్రహాలు, శుభ స్థానాధిపతుల సంచారం వల్ల రాజయోగం పడు తుంది. ఏ రంగంలో ఉన్నవారైనా ఊహించని అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో అందలాలు ఎక్కడం జరుగుతుంది. ఉన్నతాధికారి అయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలను విస్తరించే ప్రయత్నాలు చేస్తారు. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయ వంతం అవుతుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.
- వృశ్చికం: ఈ రాశికి నవమ, దశమ స్థానాల్లో శుభ గ్రహాల సంచారం వల్ల ఊహించని ధన యోగం పడు తుంది. అనేక విధాలుగా ఆదాయం పెరగడంతో పాటు ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, రాబడి బాగా పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. విదేశీ సొమ్ము అనుభవించే యోగం కూడా ఉంది.