AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాసిపెట్టుకోండి.. ఏడాది చివరికల్లా వీరి జీవితాల్లో కొత్త వెలుగులు..!

Telugu Astrology: ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, ఉద్యోగ సమస్యలతో సతమతమవుతున్న వారికి త్వరలో అదృష్టం కలిసిరాబోతోందా? మూడు శుభ గ్రహాల అరుదైన సంచారం వల్ల ఈ ఏడాది చివరిలోగా కొందరి జీవితాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇంతకీ ఆ అదృష్టాన్ని అందుకోబోతున్న రాశులేవి? ఎలాంటి శుభ ఫలితాలు కలగనున్నాయి?

రాసిపెట్టుకోండి.. ఏడాది చివరికల్లా వీరి జీవితాల్లో కొత్త వెలుగులు..!
Good Days
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 13, 2026 | 5:01 PM

Share

సింహ రాశిలో గురువు, కన్యా రాశిలో శుక్రుడు, తులా రాశిలో బుధుడి సంచారం వల్ల కొన్ని రాశులవారు ఈ ఏడాది చివరిలోగా ఎటువంటి అధ్వాన పరిస్థితుల నుంచయినా కోలుకుని, ఉన్నత స్థితికి చేరుకోవడానికి అవకాశం ఉంది. మూడు శుభ గ్రహాలు వరుస రాశుల్లో సంచారం చేయడం అరుదుగా జరుగుతుంటుంది. ఆర్థికంగా చితికిపోయినా, అప్పుల పాలైనా, ఉద్యోగాలు కోల్పోయినా, ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నా వీరు క్రమంగా వీటి నుంచి పూర్తిగా బయట పడి కొత్త జీవితం ప్రారంభించడం జరుగుతుంది. మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభ రాశులకు చెందిన వారికి ఈ అదృష్టం పట్టబోతోంది.

  1. మేషం: ఈ రాశికి 5, 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్న శుభ గ్రహాల వల్ల ఈ రాశివారు ఎటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నా, ఏ విధమైన కష్టనష్టాల్లో ఉన్నా క్రమంగా కోలుకోవడం జరుగుతుంది. ఇతరుల నుంచి తగిన సహాయ సహకారాలు అందడం, ఊహించని అవకాశాలు లభించడం జరుగుతుంది. ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అనారోగ్యాలకు తగ్గ వైద్య చికిత్స అందుతుంది. ఆర్థిక పరిస్థితి చక్కబడడానికి మార్గం లభిస్తుంది.
  2. వృషభం: ఈ రాశికి 4, 5, 6 స్థానాల్లో గురు, శుక్ర, బుధుల సంచారం వల్ల అనుకోకుండా ఉద్యోగావకాశాలు అందివస్తాయి. సొంత ఊర్లోనే మంచి ఉద్యోగంలోకి ప్రవేశించడానికి ఆఫర్లు అందుతాయి. జీవితంలో ఊహించని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. వివాదాల్లో చిక్కుకుని ఉన్న ఆస్తికి పరిష్కారం లభించి ఊరట కలుగుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు లభిస్తాయి. శత్రువులు మిత్రులయ్యే అవకాశం ఉంది.
  3. సింహం: ఈ రాశిలో గురువు, ధన స్థానంలో శుక్రుడు, తృతీయంలో బుధుడి సంచారం వల్ల ఆర్థిక, నిరుద్యోగ సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. చిన్న ప్రయత్నంతో ఆశించిన లాభాలు, ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంది. ఎటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నా వీరు అతి సమీప భవిష్యత్తులో బాగా కోలుకుని, తమ కాళ్ల మీద తాము నిలబడడం జరుగుతుంది. ఊహించని ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ఆశించిన సంస్థలో మంచి ఉద్యోగం లభిస్తుంది.
  4. కన్య: ఈ రాశికి గురు, శుక్ర, బుధుల అనుకూల సంచారం వల్ల ఆదాయం క్రమంగా వృద్ధి చెంద తుంది. సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మిత్రుల తోడ్పాటుతో జీవితంలో నిల దొక్కుకోవడానికి, తన కాళ్లపై తాము నిలబడడానికి అవకాశం లభిస్తుంది. పేదరికం, పెళ్లి ప్రయత్నాలు సఫలం కావడానికి, రుణ సమస్యలు, అనారోగ్య సమస్యలు తీరడానికి అవకాశాలు లభిస్తాయి. ఆస్తి వివాదాలు రాజీమార్గంలో పరిష్కారమై, ఆర్థికంగా బాగా పురోగతి చెందుతారు.
  5. ధనుస్సు: ఈ రాశికి 9, 10, 11 స్థానాల్లో శుభ గ్రహాల సంచారం వల్ల ఈ రాశివారి జీవితం అధ్వాన స్థితి నుంచి ఉచ్ఛ స్థితికి ఎదగడం ప్రారంభం అవుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజ యాలు సాధించి ఆశించిన ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అనారోగ్యానికి తగ్గ వైద్య చికిత్స లభించి కోలుకునే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలను మించి లాభించడం వల్ల ఆర్థికంగా నిలదొక్కుకోవడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమై, ఆస్తి లాభం కలుగు తుంది.
  6. కుంభం: ఈ రాశికి శుభ గ్రహాల అనుకూలత వల్ల ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఆర్థిక, వ్యక్తి గత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. స్వయం కృషితో ఆదాయాన్ని పెంచుకోవడం, ఆర్థిక సమస్యలను తగ్గించుకోవడం జరుగుతుంది. ఆదాయ వృద్ధికి ఎంత ప్రయత్నిస్తే అంతగా లాభిస్తుంది. ఎటువంటి దుర్భర పరిస్థితుల నుంచైనా బయటపడడానికి గురు, బుధులు దోహదం చేస్తాయి. సొంత ఊర్లోనే ఉద్యోగం రావడం, ఆర్థికంగా సంతృప్తికర జీవితం ఏర్పడడం జరుగుతుంది.

Follow Us