AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇడ్లీ, దోశకు గుడ్ బై.. శనగపిండితో ఇలా టిఫిన్ చేస్తే అదిరిపోద్దీ

టిఫిన్ అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది ఇడ్లీ, దోశ, పూరీ. ఇక చాలా మంది వీటిని పదే పదే తినడం కూడా బోర్‌గా అనిపిస్తుంది. అయితే ఎప్పుడూ తినే విధంగా కాకుండా, కాస్త కొత్తగా ఈ డిఫరెంట్ స్టైల్‌లో టిఫిన్ ప్రిపేర్ చేస్తే రుచి అదిరిపోతుందంట. కాగా, ఇంతకీ ఆ టిఫిన్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Nov 13, 2026 | 5:01 PM

Share
ఉదయం పూట హడావిడిలో అల్పాహారం తయారు చేయడం కష్టంగా ఉంటుందా? తరచుగా ఇడ్లీ, దోశలు తిని బోర్ కొట్టిందా? అయితేఈ టేస్టీ రిసిపీ మీకోసమే.  శనగపిండి రవ్వ టిఫిన్ మీకు మంచి టేస్టీ అల్పాహారం అవుతుంది. కేవలం పది నిమిషాల్లో, ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతో ఈ అద్భుతమైన, నోరూరించే అల్పాహారం ప్రిపేర్ చేసుకోవచ్చును.

1 / 5
కావాల్సిన పదార్థాలు:  శనగపిండి - 1 కప్పు,సుజి రవ్వ - 1 కప్పు,  పెరుగు - 1 కప్పు,   నీళ్లు - 1 కప్పు, ఉల్లిపాయ,   పచ్చిమిర్చి,   క్యాప్సికమ్ , క్యారెట్ తురుము,   పసుపు, జీలకర్ర ,  ఉప్పు, వంటసోడా,   నూనె .

2 / 5
తయారీ విధానంలోకి వెళ్లితే..  ఈ రిసిపీని చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చును.  ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు శనగపిండి, అదే కప్పుతో ఒక కప్పు సుజి రవ్వ, ఒక కప్పు పెరుగు వేయాలి. ఇప్పుడు ఒక కప్పు నీళ్లను కొద్దికొద్దిగా కలుపుతూ ఉండలు లేకుండా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. మొదట సగం నీళ్లను వేసి కలిపి, తర్వాత మిగిలిన సగం నీళ్లను వేసి పిండిని మెత్తగా చేసుకోవాలి.

3 / 5
రవ్వను ఉపయోగించాం కాబట్టి, పిండిని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టడం వలన రవ్వ కాస్త నాని పిండి మరింత మృదువుగా తయారవుతుంది. ఐదు నిమిషాల తర్వాత పిండి కాస్త గట్టిపడి, సాఫ్ట్‌గా మారుతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుము వేయాలి. ఇవే కాకుండా మీకు నచ్చిన ఇతర కూరగాయలైన టమాటో, పాలకూర వంటివి కూడా వేసుకోవచ్చు. వెజిటబుల్స్ తినని పిల్లలకు ఇది మంచి ఆరోగ్యకరమైన టిఫిన్

4 / 5
తర్వాత పావు టీస్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి అన్నింటినీ బాగా కలిసేలా మిక్స్ చేయాలి. చివరగా, పావు టీస్పూన్ వంటసోడా లేదా ఈనో వేసి, దానిపై ఒక టేబుల్ స్పూన్ నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి.  తర్వాత పొంగనాల పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఈ పిండిని వేయాలి. తర్వాత రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ రిసిపీ రెడీ.

5 / 5
Follow Us