బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ధృవీకరించింది. ఇది నవంబర్ 14 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అయితే, ఇది తుఫాన్‌గా మారుతుందా, ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు తెస్తుందా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.